Fact Check: ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లారా? - ఆ ప్రచారంలో నిజమెంత?
Factly: అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారనే ఓ ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై 'ఫ్యాక్ట్ లీ' చెక్ క్లారిటీ ఇచ్చింది.
Factly Clarity On Asaduddin Owaisi Went To The Temple: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారనే విధంగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అసదుద్దీన్ ఒవైసీ పూల మాల వేసుకుని పూజారులతో కలిసి నిల్చున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. అయితే, దీనిపై 'ఫ్యాక్ట్ లీ' క్లారిటీ ఇచ్చింది.
క్లెయిమ్: 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లి అర్చన చేయించుకున్నారు, అందుకు సంబంధించిన ఫోటో
ఫాక్ట్(నిజం): 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ గుడికి వెళ్లినట్లు ఎలాంటి సమాచారం లేదు. ఈ వైరల్ ఫోటో.. ఇటీవల 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించినప్పటిది. ఈ సందర్భంగా పలువురు హిందూ పూజారులు అసదుద్దీన్ ఒవైసీకి పూల మాల వేసి, శాలువాతో సత్కరించిన సందర్భంలో తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
#WATCH | Telangana: AIMIM chief and Hyderabad LS candidate Asaduddin Owaisi was greeted by some Hindu priests during his campaigning in the Malakpet assembly constituency. (02/05)
— ANI (@ANI) May 4, 2024
(Video source - AIMIM PRO) pic.twitter.com/0CLFpdR34Y
ఇదీ వాస్తవం
Kab koi yahan aapas mein ladaa hai?
— AIMIM (@aimim_national) May 2, 2024
Har mazhab Majlis ke saath khada hai
Sadr-e-Majlis wa Ummeedwar Hyderabad Parlimani Halqa Barrister @asadowaisi ne AIMIM Malakpet MLA @balala_ahmed ke saath Halqa-e-Assembly Malakpet ke Moosarambagh, Indira Nagar aur uske aas-paas ke ilaaqo'n… pic.twitter.com/i1zzQ2DLjC
హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హిందూ పూజారులు అసదుద్దీన్ ఒవైసీకి పూలమాల వేసి, శాలువాతో సత్కరించారు. ఇదే ఫోటోను 2024, మే 2వ తేదీన AIMIM పార్టీ తమ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసింది. ఒవైసీ మలక్‌పేట్ ఎమ్మెల్యేతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మూసారాంబాగ్, ఇందిరానగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి, పతంగి గుర్తుకు ఓటు వేయాలని కోరారని ట్వీట్ లో పేర్కొంది. దీన్ని బట్టి అసదుద్దీన్ ఒవైసీ ఈ ప్రచారంలో పూజారులతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఒవైసీ గుడికి వెళ్లినట్లుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని 'ఫ్యాక్ట్ లీ' స్పష్టత ఇచ్చింది. పూజారులు సన్మానించినప్పుడు తీసిన ఫోటోను షేర్ చేస్తూ అసదుద్దీన్ గుడికి వెళ్లినట్లుగా ప్రచారం చేస్తున్నారని నిర్ధారించింది.
This story was originally published by Factly.in as part of the Shakti Collective. This story has been Edited by ABP Desam staff.