Yatra 2: 'యాత్ర 2' మూవీ అప్డేట్ - వైఎస్ జగన్ పుట్టినరోజు కానుకగా!
Yatra 2 Trailer Release Date: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు కానుకగా 'యాత్ర 2' ట్రైలర్ విడుదల చేయాలని మహి వి రాఘవ్ సన్నాహాలు చేస్తున్నారు.
![Yatra 2: 'యాత్ర 2' మూవీ అప్డేట్ - వైఎస్ జగన్ పుట్టినరోజు కానుకగా! Yatra 2 trailer release on YS Jagan Mohan Reddy birthday Jiiva Mammootty Telugu News Yatra 2: 'యాత్ర 2' మూవీ అప్డేట్ - వైఎస్ జగన్ పుట్టినరోజు కానుకగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/12/50ef4fb672be4df49f2b611ab2edcc871702353992490313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Yatra 2 update on YS Jagan Mohan Reddy Birthday: ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' సినిమా తీశారు దర్శకుడు మహి వి. రాఘవ్! ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా... ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ తనయుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో పాటు సీఎం కావడానికి ముందు ఆయనకు ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో 'యాత్ర 2' తెరకెక్కిస్తున్నారు.
జగన్ పుట్టినరోజు కానుకగా...
Yatra 2 trailer release date: 'యాత్ర 2' సినిమాలో మరోసారి వైఎస్ఆర్ పాత్రలో మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి సందడి చేయనున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన జీవా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
'యాత్ర 2' ట్రైలర్ రెడీ అయ్యింది. డిసెంబర్ 21న... వచ్చే గురువారం పుట్టినరోజు కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఏపీ సీఎం అభిమానులకు ఆ రోజు మరింత స్పెషల్ కానుందన్నమాట! త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక 'యాత్ర 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
A resilient force behind the rise of a leader!
— Three Autumn Leaves (@3alproduction) December 9, 2023
Presenting @KetakiNarayan as #YSBharathi from #Yatra2. In cinemas from 8th Feb, 2024.#HBDYSBharathiGaru #Yatra2OnFeb8th #LegacyLivesOn @ShivaMeka @MahiVraghav @vcelluloidsoffl @3alproduction pic.twitter.com/VxGDehzaA0
ఫిబ్రవరి 8న 'యాత్ర 2' సినిమా విడుదల!
Yatra 2 Movie Release Date: 'యాత్ర' చిత్రాన్ని 2019లో ఫిబ్రవరి 8న విడుదల చేశారు. 'యాత్ర 2'ను కూడా ఆ తేదీకి విడుదల చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న 'యాత్ర 2' విడుదల కానుంది. ఇటీవల సినిమాలో వైఎస్ భారతి పాత్రలో నటిస్తున్న కేతికా నారాయణన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : మది, సంగీతం : సంతోష్ నారాయణన్.
సోనియా గాంధీగా జర్మన్ నటి సుజానే!
'యాత్ర 2'లో సమకాలీన రాజకీయ ప్రముఖుల ప్రస్తావన సైతం ఉండబోతోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో ఉత్తరాది నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత సోనియా గాంధీ పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారు.
Also Read: పిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
వైయస్సార్ మరణం తర్వాత తెలుగు గడ్డపై జరిగిన రాజకీయాల్లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ పేరు బలంగా వినిపించింది. ఆమె పాత్రను ఎలా చూపిస్తున్నారు? అనేది సినిమా విడుదలైతే తప్ప చెప్పలేం! జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ (Suzanne Bernert) ఫస్ట్ లుక్ చూస్తే... అచ్చం సోనియా గాంధీలా ఉన్నారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. హిందీ నటుడు, ఈ ఏడాది మరణించిన అఖిల్ మిశ్రా భార్య సుజానే. సుమారు 20 ఏళ్ళ నుంచి భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్, సీరియళ్లు చేస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి సినిమా 'యాత్ర 2'.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)