హిట్ టాక్ తో దూసుకుపోతున్న 'యశోద', రెండో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా ?
లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన 'యాశోద' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా కలెక్షన్స్ పై ఆసక్తి నెలకొంది.
స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో హరి, హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'యశోద'. ఈ మూవీ ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో కూడా సినిమాను విడుదల చేసింది నిర్మాణ సంస్థ. హీరోయిన్ సమంత కు హిందీలో ఇది తొలి థియేట్రికల్ రిలీజ్ మూవీ. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా తొలి రోజు నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది
ఈ సినిమా పై విడుదలకు ముందు నుంచే అంచనాలు పెంచేశారు మేకర్స్. ట్రైలర్ బాగుండటంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూశారు ప్రేక్షకులు. ఇదే సినిమాకు మంచి బిజినెస్ ను చేసిపెట్టింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక రెండో రోజు శనివారం కూడా కలెక్షన్లు పుంజుకున్నాయనే చెప్పాలి.
ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సినిమా శనివారం 4 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా యశోద చిత్రం 3 కోట్లకుపైగా షేర్, 6 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది యశోద మూవీ. తొలి రోజున తెలుగులో 2.7 కోట్లు, హిందీలో 10 లక్షలు, తమిళంలో 25 లక్షలు, మలయాళంలో 10 లక్షలు వసూలు చేసింది. ఇది సమంత కెరీర్ లో పెద్ద ఓపెనింగ్స్ అనే చెప్పొచ్చు. ఇక రెండు రోజుల తర్వాత ఈ సినిమా టోటల్ కలెక్షన్ 7.06 కోట్లకు చేరుకుంది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. నిపుణుల అంచనా ప్రకారం 'యశోద' 55 కోట్లకు పైనే ప్రి రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్.
ఇక ఈ సినిమాలో సమంత నటన కు వందశాతం మార్కులు పడ్డాయనే చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ లో ఆమె యాక్టింగ్, ఫైటింగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. ఇక ఈ మూవీ లో సస్పెన్స్ థ్రిల్లర్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ట్విస్ట్ లు కూడా ఆకట్టుకుంటాయి. సరోగసి విధానం, అందులో ఎలాంటి లోపాలు ఉన్నాయి అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూవీపై దేశవ్యాప్తంగా మంచి టాక్ రావడంతో సమంత కు క్రేజ్ మంరింత పెరిగింది. ప్రస్తుతం సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య, ప్రియాంక శర్మలు తదితరులు కనిపించారు. ఈ వీకెండ్ సినిమా కలెక్షన్ లు ఎలా ఉంటాయో చూడాలి.
View this post on Instagram