అన్వేషించండి

Sakshi Dhoni: ప్రభాస్, బన్నీ, పవన్ కళ్యాణ్‌లతో సినిమాలు చేయను - ధోని భార్య సాక్షి, కారణం ఇదేనట!

‘ఎల్జీఎం’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు ఎంఎస్ ధోనీ దంపతులు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా ధోనీ భార్య సాక్షి టాలీవుడ్ హీరోల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Sakshi Dhoni: ఇండియా దిగ్గజ క్రికెటర్ ఎమ్ ఎస్ ధోనీ ఆయన భార్య సాక్షి ధోనీ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోనీ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఇటీవలే ప్రారంభించారు. ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా ‘ఎల్జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీ) అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు రమేష్ తమిళమణి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హరీష్ కళ్యాణ్, ఇవానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జులై 28 న సినిమా తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం అంత బడ్జెట్ నా దగ్గర లేదు: సాక్షి ధోనీ

‘ఎల్జీఎం’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ నిర్మాత సాక్షి ధోనీ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే తెలుగులో ఉన్న స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వారితో సినిమాలు తీస్తారా అని అడిగిన ప్రశ్నకు సాక్షి ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం తన వద్ద అంత డబ్బు లేదని చెప్పింది సాక్షి. వాళ్లు స్టార్ హీరోలు, పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. వారితో సినిమా చేయాలి అనుకుంటే తాము భారీ రెమ్యూనరేషన్ లు ఇవ్వాలి. తాము ఇప్పుడే నిర్మాణ రంగంలో అడుగు పెట్టామని, ‘ఎల్జీఎం’ సినిమా తొలి అడుగు అని చెప్పింది. భవిష్యత్ లో వారితో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తామని చెప్పింది సాక్షి. అలాగే తాను అల్లు అర్జున్ కు వీరాభిమానినని సాక్షి వెల్లడించింది. ఎప్పటి నుంచో ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని, అల్లు అర్జున్ సినిమాలు అన్నీ చూస్తానని చెప్పిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.

తెలుగులో ఆగస్టు 4 న ప్రేక్షకుల ముందుకు ‘ఎల్జీఎం’..

‘ఎల్జీఎం’ సినిమా ధోనీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోన్న మొదటి సినిమా. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించారు. అలాగే తెలుగులోనూ డబ్ చేశారు. ఈ సినిమాను రమేష్ తమిళమణి తెరకెక్కించారు. కామెడీ ఎంటర్టైనర్ జోనర్ లో సాగే ఈ సినిమాలో యోగిబాబు, మిర్చి విజయ్‌లు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే మూవీలో ధోనీ కనిపిస్తారా అని అడిగిన ప్రశ్నకు సాక్షి క్లారిటీ ఇవ్వలేదు. సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అంటూ సమాధానం ఇచ్చింది సాక్షి. తమిళ్ లో మూవీను జులై 28 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులో ఇదే రోజు పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమా విడుదల కావడంతో తెలుగులో ఈ మూవీను నాలుగు రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఆగస్ట్ 4 న ‘ఎల్జీఎం’ ను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. 

Also Read: అలాంటి సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నా: మీనాక్షి చౌదరి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kaala Bhairava Marriage : పెళ్లి పీటలెక్కబోతున్న కీరవాణి కుమారుడు కాల భైరవ! - వధువు ఎవరో తెలుసా?
పెళ్లి పీటలెక్కబోతున్న కీరవాణి కుమారుడు కాల భైరవ! - వధువు ఎవరో తెలుసా?
Ustaad Bhagat Singh : మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ సారీ - 'తథాస్తు' ట్వీట్‌పై క్లారిటీ
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ సారీ - 'తథాస్తు' ట్వీట్‌పై క్లారిటీ
Podharillu Serial Today March 11th:  మాధవ్‌పై దాడిచేశారనగానే తెలియగానే తమ్ముళ్లు ఏం చేశారు..? చక్రి అన్నదమ్ములను అరెస్ట్ చేయడానికి కారణమేంటి..? 
పొదరిల్లు: మాధవ్‌పై దాడిచేశారనగానే తెలియగానే తమ్ముళ్లు ఏం చేశారు..? చక్రి అన్నదమ్ములను అరెస్ట్ చేయడానికి కారణమేంటి..? 
Nindu Manasulu Serial Today March11th:హోలీ సంబరాలకు వచ్చి గొడవ పెట్టుకున్న గణ...ప్రేరణకు  తన ప్రేమ విషయం సిద్ధూ చెప్పాడా..? లేదా...?
నిండుమనసులు: హోలీ సంబరాలకు వచ్చి గొడవ పెట్టుకున్న గణ...ప్రేరణకు  తన ప్రేమ విషయం సిద్ధూ చెప్పాడా..? లేదా...?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget