News
News
X

Pavitra Lokesh: నరేష్ ఎవరో తెలీదు, ఆ ఆధారం ఒక్కటే లేదు, పవిత్ర నన్ను క్షమించు - భర్త సుచేంద్ర ప్రసాద్

పవిత్ర లోకేష్, నరేష్ బంధంపై ఎట్టకేలకు సుచేంద్ర ప్రసాద్ స్పందించారు. తమది సహజీవనం కాదని, హిందూ సాంప్రదాయ ప్రకారమే పెళ్లి చేసుకున్నామని స్పష్టం చేశారు.

FOLLOW US: 

త కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ బంధం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా వారిద్దరు ఒకే హోటల్‌లో బస చేయడం, నరేష్ మూడో భార్య.. ఆ హోటల్‌కు వెళ్లి మరీ వారిద్దరినీ చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించడం గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే, పవిత్ర లోకేష్-నరేష్‌ల గురించి వస్తున్న వార్తలు రూమర్స్ కావని, నిజమే అనే అభిప్రాయం నెలకొంది. దీనిపై నరేష్, పవిత్ర స్పష్టత ఇచ్చే ప్రయత్నం ఇచ్చినా.. నెటిజన్స్ ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నరేష్, పవిత్ర హోటల్ రూమ్ నుంచి బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. మీడియా చానెళ్లు సైతం ఈ వీడియోలను చూపిస్తూ రకరకాల కథలను అల్లేస్తున్నాయి. 

పవిత్ర లోకేష్ భర్త మాత్రం ఈ వివాదం గురించి బయట మాట్లాడటం లేదు. అయితే, ఆయన ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. పవిత్ర లోకేష్ తీరును ఆయన ఎండగట్టినట్లు ఆ వార్తల సమాచారం. అయితే, ఆ వాఖ్యలు ఆయనే చేశారా? లేదా కన్నడ మీడియా సృష్టా అనేది ఇంకా తేలాల్సి ఉంది. సుచేంద్ర ప్రసాద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వింటే మాత్రం ఆయన అలా మాట్లాడలేదని అనిపిస్తోంది. ఎందుకంటే.. ఆయన కర్ణాటకలోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పవిత్రకు, తనకు పెళ్లయిన విషయాన్ని స్పష్టం చేశారు. తాము ఇంకా భార్యభర్తలమేనని వెల్లడించారు. పవిత్ర తమది సహజీవనం అని ఎందుకు చెబుతుందో తెలీదని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారనేది.. ఆయన మాటల్లోనే. 

మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు: ‘‘పవిత్ర లోకేష్, నరేష్‌ల గురించి నాకు మీడియా ద్వారానే తెలిసింది. మాది సహజీవనం అని పవిత్ర ఎందుకు అన్నదో తెలీదు. నాకు దగ్గర మ్యారేజ్ సర్టిఫికెట్ ఒక్కటే లేదు. ఎందుకంటే.. హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకొనే చాలామంది దగ్గర ఆ సర్టిఫికెట్ ఉండదు. అయితే, మా పాస్‌పోర్ట్, ఇతర గుర్తింపు కార్డుల్లో మేం దంపతులమని ఉంటుంది. మేమిద్దరం భార్యభర్తలమని కర్ణాటక మొత్తానికి తెలుసు. హిందూ సాంప్రదాయల ప్రకారం మా పెళ్లి చట్టబద్ధమైనది. నా దగ్గర అన్ని రకాల డాక్యుమెంట్స్, ఆధారాలున్నాయి. అవసరమైనప్పుడు ఇస్తాను. మాది 16 ఏళ్ల బంధం. ప్రేమించి పెళ్లిచేసుకున్నాం. మాది సహజీవనం కాదు’’ 

నరేష్ ఎవరో తెలీదు: ‘‘నాది కర్ణాటక, తెలుగు తెలియదు. నరేష్ పేరు నాకు కొత్త. ఆయన గురించి నాకు తెలీదు. మీడియా వల్లే నాకు ఆయన గురించి, పవిత్ర గురించి తెలిసింది. కానీ, ఇది మా వ్యక్తిగత వ్యవహారం మీడియా రోజు దీని గురించే ఎందకు మాట్లాడుతుందో తెలియదు. మీడియా తమ పని తాము చేసుకోవడం బెటర్. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. నన్ను, మా కుటుంబాన్ని, మా పిల్లలను ఇందులోకి లాగకండి. దీన్ని పెద్ద వివాదం చేయకండి. మేం ఇప్పటికీ దంపతులమే. జంటగా అనేక సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఒక వేళ పవిత్ర లోకేష్‌కు నా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉన్నా, నేను ఆమెను బాధ పెట్టినా.. క్షమాపణలు తెలియజేస్తున్నా. పవిత్ర చాలా మంచిది. ఆమె మీద నాకు నమ్మకం ఉంది. ఆమెను గౌరవిస్తున్నా’’ అని తెలిపారు.

Published at : 06 Jul 2022 09:55 PM (IST) Tags: Pavitra Lokesh Pavitra Lokesh Naresh Pavitra Lokesh Wedding Pavitra Lokesh Husband Suchendra Prasad

సంబంధిత కథనాలు

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?

Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ

Bigg Boss Season 6: సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 - కొత్త ప్రోమో చూశారా?

Bigg Boss Season 6: సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 - కొత్త ప్రోమో చూశారా?

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని ముందే నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని ముందే నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Karthika Deepam Serial ఆగస్టు 19 ఎపిసోడ్: డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత, మళ్లీ వంటలక్కకు కష్టాలు మొదలు

Karthika Deepam Serial ఆగస్టు 19 ఎపిసోడ్: డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత, మళ్లీ వంటలక్కకు కష్టాలు మొదలు

టాప్ స్టోరీస్

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!

WhatsApp Emojis: వాట్సాప్‌లో ఆ రంగుల హార్ట్ ఎమోజీలకు అర్థం తెలుసా? ఒక్కో కలర్‌కు ఒక్కో భావం!