News
News
X

అమ్మో తాత, అన్ని సినిమాలు చూశావా, పుస్తకంలో తేదీలతో సహా రాసుకున్న పెద్దాయన!

చాలా మంది ముఖ్యమైన విషయాలను బుక్ లో రాసుకుంటారు. కానీ, ఓ వ్యక్తి తను చూసిన సినిమాల వివరాలను రాసుకున్నాడు. ఎప్పుడు? ఎక్కడ? సినిమాలో చూశాడో అందులో వివరించాడు.

FOLLOW US: 
Share:

మీ జీవితంలో ఎన్ని సినిమాలు చూశారనేది మీకు గుర్తుందా? చెప్పడం కష్టమే కదూ. అయితే, ఈ తాతగారు తేదీతో సహా ఏ సినిమా ఎప్పుడు ఎన్ని గంటలకు చూశాడో కూడా చెప్పేస్తాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఎందుకంటే.. అతడు చూసిన ప్రతి సినిమా గురించి ఒక బుక్‌లో రాసుకున్నాడు. ఇటీవలే అతడి మనవడికి ఆ పుస్తకం దొరికింది. అందులోని వివరాలు చూసి అతడు కూడా ఆశ్చర్యపోయాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. దీంతో ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 

తొలి సినిమా నుంచి చివరి సినిమా దాకా

తాజాగా AK అనే ఓ ట్విట్టర్ యూజర్ తన తాతకు సంబంధించిన అరుదైన విషయాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. ఆయన చూసిన ప్రతి సినిమాను ఓ పుస్తకంలో భద్రపరిచాడు. సినిమా పేరు, నటీనటుల వివరాలు, ఆ సినిమా విడుదలైన సమయం, ఏ థియేటర్ తాను ఆ చిత్రాన్ని చూశాను అనే విషయాలను అందులో పొందుపరిచాడు. ఆయన చూసిన తొలి సినిమా నుంచి చివరి సినిమా వరకు అందులో రాశారు. మొత్తంగా అతను 470 సినిమాలు చూశాడు. ఈ బుక్ లోని పేజీలను ఫోటోలు తీసి AK తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.    

1961 నుంచి మొదలు.. 

“సినిమాలకు సంబంధించిన వివరాలను పంచుకునేందుకు 2011లో లెటర్ బాక్స్డ్ అనే సోషల్ నెట్వర్కింగ్  సర్వీస్ మొదలయ్యింది. కానీ మా తాత చూసిన సినిమాలను రికార్డు చేయడానికి అప్పట్లోనే స్వంత వెర్షన్ లెటర్ బాక్స్డ్ రూపొందించాడు. అతడు హిచ్ కాక్, జేమ్స్ బాండ్ సినిమాలను థియేటర్లలో చూడటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది” అని AK వివరించాడు. అంతేకాదు, “మా తాత 1961లో వచ్చిన ‘కమ్ సెప్టెంబర్’, 1966లో వచ్చిన ‘అన్బే వా’ అనే చిత్రాలను  కూడా థియేటర్లలో చూశారు” అని తెలిపాడు. 

సోషల్ మీడియాలో జోరుగా చర్చ

ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. AK ట్వీట్స్ కు వేల సంఖ్యలో రీట్వీట్లు వస్తున్నాయి. వాళ్ల తాత రాసిన పుస్తకాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. “మీ తాత రెండవ జేమ్స్ బాండ్ చిత్రం థియేటర్లలో చూడటం ఆశ్చర్యకరం, అద్భుతం అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అతడు ఆ పుస్తకంలో ఎన్ని సినిమాలు రికార్డ్ చేశాడు? అని మరో నెటిజన్ ప్రశ్నించగా, 470 అని రిప్లై ఇచ్చాడు. ఈ పుస్తకాన్ని కచ్చితంగా కాపాడాలని మరొకరు కోరాడు. ఇందుకోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.  

Read Also: ‘సిటాడెల్’ టీజర్ - అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో సరికొత్త సీరిస్ - ఇప్పుడు ప్రియాంక, తర్వాత సమంత!

Published at : 28 Feb 2023 03:19 PM (IST) Tags: Movies Viral News watched movies list

సంబంధిత కథనాలు

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

టాప్ స్టోరీస్

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్

Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్

IPL 2023: బట్లర్‌ అరాచకం.. 6 ఓవర్లకే రాజస్థాన్‌ 85/1 - పవర్‌ప్లే రికార్డు!

IPL 2023: బట్లర్‌ అరాచకం.. 6 ఓవర్లకే రాజస్థాన్‌ 85/1 - పవర్‌ప్లే రికార్డు!