News
News
X

Citadel teaser: ‘సిటాడెల్’ టీజర్ - అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో సరికొత్త సీరిస్ - ఇప్పుడు ప్రియాంక, తర్వాత సమంత!

ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ కీలక పాత్రల్లో తెరెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ఈ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన టీజర్ ఆడియెన్స్ లో ఆసక్తిరేకెత్తిస్తోంది.

FOLLOW US: 
Share:

హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందిస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. అయితే, ఓ ఫ్యాన్ పేజ్ ద్వారా ఈ సీరిస్‌కు సంబంధించిన టీజర్‌లోని కొన్ని సీన్లు లీకయ్యాయి. ఆ వీడియోను ఇక్కడ చూడవచ్చు. 

View this post on Instagram
 
A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi)

ఆకట్టుకుంటున్న హాలీవుడ్ ‘సిటాడెల్ టీజర్

"మీకు తెలిసినదంతా అబద్ధం. నువ్వన్నది గతం. నువ్వు ఉండేవి సిటాడెల్" అంటూ స్టాన్లీ టుచీ చెప్పడంతో టీజర్ మొదలవుతుంది. ఇందులో ప్రియాంక నవ్వుతూ కనిపిస్తుంది. రిచర్డ్ ఎవరినో చూస్తున్నట్లు ఉంటుంది. ఆ తర్వాత భారీ యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తాయి. ఇప్పటికే ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రియాంక చేతిలో గన్ పట్టుకుని సైలెంట్ గా వార్నింగ్ ఇస్తున్నట్లు అందులో కనిపించింది. ‘సిటాడెల్‌’లో ప్రియాంక ఎలైట్ గూఢచారి నదియా సిన్ పాత్ర పోషిస్తుంది. రస్సో బ్రదర్స్ సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా మొదటి రెండు ఎపిసోడ్‌లు ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి.

View this post on Instagram
 
A post shared by Priyanka (@priyankachopra)

బాలీవుడ్ లోనూ తెరకెక్కుతున్న ‘సిటాడెల్’ సిరీస్  

ఇదే ‘సిటాడెల్’ సిరీస్ బాలీవుడ్ లోనూ తెరకెక్కుతోంది. ఇక్కడి ప్రేక్షకులకు అనుకూలంగా  స్క్రిప్ట్ ని మార్చి దర్శకులు రాజ్, డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన సమంతాను ’సిటాడెల్’ ఇండియన్ వర్షన్ మెయిన్ లీడ్ గా తీసుకున్నారు. వరుణ్ ధావన్ సైతం ఇందులో మెయిన్ లీడ్స్ లో నటిస్తున్నారు. సమంత చేసే ఈ సిరీస్ పై కూడా ఇండియాలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్ కూడా షూటింగ్ జరపుకుంటోంది.

సమంత ఫస్ట్ లుక్ విడుదల చేయాలంటున్న అభిమానులు

తాజాగా హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో ఇక్కడి అభిమానులు సమంత ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.  ఇండియన్ వెర్షన్ లో రూపొందుతున్న ’సిటాడెల్’  సిరీస్ సౌత్ భాషల్లోనూ డబ్ చేసి, విడుదల చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘సిటాడెల్’ చర్చ సాగుతోంది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా పోషిస్తున్న పాత్రను బాలీవుడ్ లో సమంతా చేస్తోంది. ‘ఫ్యామిలీమ్యాన్’తో ఇప్పటికే దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సామ్, ఇప్పుడు ’సిటాడెల్’తో మరింత పాపులారిటీ సంపాదించుకునే అవకాశం ఉంది.

Read Also: 'మామా మశ్చీంద్ర' మూవీ వీడియో లీక్, సుధీర్ బాబు లుక్ చూసి ఆడియన్స్ షాక్!

Published at : 28 Feb 2023 01:11 PM (IST) Tags: Priyanka Chopra Richard Madden Citadel teaser Stanley Tucci

సంబంధిత కథనాలు

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?

Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?

Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్