అన్వేషించండి

Vijaya Nirmala Brother Death: కృష్ణ, విజయ నిర్మల ఫ్యామిలీలో విషాదం - పండుగ రోజు అన్నయ్య మృతి

S Ravi Kumar Death: గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్, దివంగత నటి, దర్శక నిర్మాత విజయ నిర్మల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. పండుగ నాడు ఆమె సోదరుడు మృతి చెందారు.

Vijay Nirmala elder brother Ravi Kumar is no more: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. భోగి పండుగ నాడు సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కుటుంబంలో తీరని శోకం నెలకొంది. తమ కుటుంబంలో ఓ సభ్యుడిని కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

విజయ నిర్మల సోదరుడు మృతి
దివంగత నటి, ప్రముఖ దర్శక - నిర్మాత, అత్యధిక చిత్రాలకు మహిళగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న శ్రీమతి విజయ నిర్మల గురించి ప్రేక్షకులకు తెలుసు. జూన్ 29, 2019లో ఆవిడ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

నటిగా, దర్శక నిర్మాతగా విజయ్ నిర్మల విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఆమె అన్నయ్య ఎస్. రవి కుమార్ ఒకరు. విజయ నిర్మలకు చెందిన శ్రీ విజయ కృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థ రథసారథిగా నిర్మాణ నిర్వహణ బాధ్యతలు ఆయన చూసుకున్నారు. 'మీనా', 'కవిత', 'అంతం కాదిది ఆరంభం', 'హేమాహేమీలు' తదితర చిత్రాలకు ఆయన పని చేశారు. ఈ రోజు (జనవరి 14న) ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. పండుగ నాడు కృష్ణ - విజయ నిర్మల ఫ్యామిలీకి ఆయన మరణం తీరని శోకం మిగిల్చింది.

Also Read: అమెరికాలో 'నా సామి రంగ' ఎర్లీ ప్రీమియర్ షోలు పడలేదు - ఎందుకంటే?

విజయ నిర్మల తనయుడు, రవి కుమార్ మేనల్లుడు నరేష్ విజయకృష్ణ తెలుగులో అగ్ర నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు హీరోగా పలు హిట్ సినిమాలు చేసిన నరేష్... ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. రవికుమార్ తమ్ముడి మనవడు శరణ్ కుమార్ 'మిస్టర్ కింగ్' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు. 

Also Read: డ్యాన్సుల్లో శ్రీ లీలకు పోటీ లేదుగా... స్టార్స్ సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ తెలుగమ్మాయే

జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ పరిధిలో గల మహాప్రస్థానంలో రవికుమార్ అంతిమ సంస్కారాలు నిర్వహించారని కృష్ణ, విజయ నిర్మల ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కృష్ణ కుటుంబానికి కలిసిరాని 2022
2022లో కృష్ణ ఫ్యామిలీ వరుస విషాదాలు చవి చూసింది. ఆ ఏడాది జనవరి 8న కృష్ణ పెద్ద కుమారుడు, హీరోగా కొన్ని సినిమాలు చేసిన రమేష్ బాబు మరణించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 28, 2022న కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. భార్య మరణించిన రెండు నెలలకు... నవంబర్ 15, 2023లో కృష్ణ ఘట్టమనేని కన్ను మూశారు. తండ్రి మరణంతో మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల జరిగిన 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేడుకలో కూడా తండ్రిని గుర్తు చేసుకున్నారు.

Also Read: 'యాత్ర 2'లో వైఎస్ షర్మిల పాత్ర ఉండదు - అన్నయ్య సినిమాలో చెల్లికి చోటు లేదా? జగన్ సినిమా నుంచి చెల్లెల్ని ఎందుకు తీసేశారు?

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరికి నువ్వు కన్నతల్లివేనా? సహస్ర మీద విహారి ఫైర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరికి నువ్వు కన్నతల్లివేనా? సహస్ర మీద విహారి ఫైర్!
Archana Jois: తెలుగు సినిమాలో హీరోయిన్‌గా 'కేజీఎఫ్' మదర్... వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా సినిమా ప్రారంభం
తెలుగు సినిమాలో హీరోయిన్‌గా 'కేజీఎఫ్' మదర్... వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా సినిమా ప్రారంభం
Sandeep Reddy Vanga On Raptadu Case: రాప్తాడు ఘటనపై సందీప్ రెడ్డి వంగా రియాక్షన్... సినిమాలను టార్గెట్ చేయవద్దు
రాప్తాడు ఘటనపై సందీప్ రెడ్డి వంగా రియాక్షన్... సినిమాలను టార్గెట్ చేయవద్దు
Godavari Serial Today November 4th: 'గోదావరి' సీరియల్: నందు ఆకర్ష్‌కి దగ్గరైపోతుందా! గౌతమి బాధని జాను తీర్చుతుందా!
'గోదావరి' సీరియల్: నందు ఆకర్ష్‌కి దగ్గరైపోతుందా! గౌతమి బాధని జాను తీర్చుతుందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget