అన్వేషించండి

Sreeleela: డ్యాన్సుల్లో శ్రీ లీలకు పోటీ లేదుగా... స్టార్స్ సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ తెలుగమ్మాయే

Sreeleela dance: 'గుంటూరు కారం' సినిమా తర్వాత శ్రీ లీల డ్యాన్స్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈతరం హీరోయిన్లలో డ్యాన్సుల్లో ఆమెకు పోటీ ఇచ్చేది ఎవరు? అనే చర్చ మొదలైంది.

Sreeleela dance Guntur Kaaram: డ్యాన్సింగ్ స్టార్... 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీ లీలకు మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇచ్చిన ట్యాగ్. హీరోయిన్లు సాధారణంగా ఒకరినొకరు పొగడటం అరుదు. ప్రశంసించడం కాకుండా బిరుదు ఇవ్వడం అంటే సంథింగ్ స్పెషల్. ఆ ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబు సైతం 'శ్రీ లీలతో డ్యాన్స్ అంటే హీరోల తాట తీరిపోద్ది' అని చెప్పారు. 'గుంటూరు కారం' విడుదలైన తర్వాత వాళ్లిద్దరి మాటలు నిజమేనని తెలుగు ప్రేక్షకులు సైతం చెబుతున్నారు.

డ్యాన్సుల్లో శ్రీ లీలను కొట్టే హీరోయిన్ ఉన్నారా?
ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్స్ ఇరగదీసే హీరోయిన్లు ఎవరు ఉన్నారు? అని చూస్తే... ముందు వినిపించే పేరు శ్రీ లీల. సినిమా ప్రముఖులు మాత్రమే కాదు... ప్రేక్షకులు సైతం ఆమె పేరు చెబుతున్నారు. ఆ స్థాయిలో శ్రీ లీల డ్యాన్స్, ఆమె ఎనర్జీ అందర్నీ ఆకట్టుకున్నాయి.

'గుంటూరు కారం'లో 'కుర్చీ మడతపెట్టి...' సాంగ్ విడుదలకు ముందు విపరీతంగా ప్రేక్షకుల్లోకి వెళ్లింది. మహేష్ మాస్ స్టెప్స్ గురించి డిస్కషన్ నడిచింది. సినిమా విడుదలైన తర్వాత ఆ పాటలో శ్రీ లీల డ్యాన్స్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. నిజంగా శ్రీ లీల చింపేశారు. 

మిర్చి యార్డు గోడౌన్‌లో 'చెప్పవే చిరుగాలి...' పాటకు శ్రీ లీల డ్యాన్స్ వేసిన తర్వాత 'ప్రభుదేవాకు డూప్‌లా ఉంది' అని మహేష్ బాబు అంటారు. ఆ మాట నిజమే అని చెప్పాలి. ఆ తర్వాత 'నక్కిలీసు గొలుసు...' పాటకు కూడా శ్రీ లీల అద్భుతంగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో సీజనల్ కొరియోగ్రాఫర్స్, కంటెస్టెంట్ల కంటే సూపర్బ్ డ్యాన్స్ చేశారు.

Sreeleela: డ్యాన్సుల్లో శ్రీ లీలకు పోటీ లేదుగా... స్టార్స్ సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ తెలుగమ్మాయే

మాస్ థియేటర్లలో శ్రీ లీల స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి విజిల్స్, క్లాప్స్ పడుతున్నాయి. డ్యాన్సుల్లో ఆమెకు పోటీ ఇచ్చే హీరోయిన్ ఎవరు ఉన్నారు? అని చూస్తే... ఎవరూ కనిపించడం లేదనేది ఇండస్ట్రీలో కొందరు చెప్పే మాట. సాయి పల్లవి మంచి డ్యాన్సర్. అయితే... కమర్షియల్ కథలు, క్యారెక్టర్లకు ఇప్పుడు ఆవిడ కాస్త దూరంగా ఉంటున్నారు. దాంతో స్టార్ హీరోలు చేసే కమర్షియల్ సినిమాలకు శ్రీ లీల ఫస్ట్ ఛాయిస్ అయ్యారు.  

'భగవంత్ కేసరి' అండ్ 'ధమాకా'లోనూ...
'గుంటూరు కారం' సినిమాకు ముందు మాస్ మహారాజా రవితేజ 'ధమాకా', గాడ్ ఆఫ్ మాసెస్ & నట సింహం నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమాల్లోనూ శ్రీ లీల సూపర్ స్టెప్స్ వేశారు. శ్రీ లీల డ్యాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 'పెళ్లి సందడి' సినిమా తర్వాత ఆమె నటనకు, డ్యాన్సులకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఒక్కసారి పది సినిమాలకు ఆమె సంతకం చేశారు.

Also Read: సైంధవ్ రివ్యూ : సైకోగా వెంకటేష్ ఎలా చేశారు? ఆయన 75వ సినిమా హిట్టా? ఫట్టా?

ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', 'భీష్మ' తర్వాత నితిన్ & వెంకీ కుడుముల చేస్తున్న సినిమాలు శ్రీ లీల చేతిలో ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. కమర్షియల్ సినిమాలు తీసే దర్శక నిర్మాతల చూపు ముందుగా శ్రీ లీల మీద పడుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. డ్యాన్సులతో పాటు అందం, అభినయం చక్కగా చేయడం & తెలుగమ్మాయి కావడం శ్రీ లీలకు ప్లస్ పాయింట్.

Also Readకాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today July 31th: శైలుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన కేశవ్‌...కేశవ్‌ బాధ్యతను మెచ్చుకున్న మహాలక్ష్మీ
పొదరిల్లు: శైలుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన కేశవ్‌...కేశవ్‌ బాధ్యతను మెచ్చుకున్న మహాలక్ష్మీ
Brahmamudi Serial Today July 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను నిలదీసిన భ్రమరాంబ – అయోమయంలో ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను నిలదీసిన భ్రమరాంబ – అయోమయంలో ఇందు
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Embed widget