Dil Raju: ‘దిల్’ రాజును ఆడేసుకుంటున్న తెలుగు ప్రేక్షకులు - ‘విజయ్ సార్’ ఎంత పనిచేశారు!
విజయ్ నెంబర్ 1 హీరో అంటూ అజిత్ ఫ్యాన్స్ తో ఘోరంగా ట్రోలింగ్ కు గురయ్యారు దిల్ రాజు. ఇటు ‘వారిసు’ సినిమా టైటిల్స్ లో ‘విజయ్ సర్’ అని రాసి తెలుగు ప్రేక్షకులతోనూ తిట్లు తింటున్నారు.
![Dil Raju: ‘దిల్’ రాజును ఆడేసుకుంటున్న తెలుగు ప్రేక్షకులు - ‘విజయ్ సార్’ ఎంత పనిచేశారు! ‘Vijay Sir Tamilians Happy gesture from Dil Raju Telugu Audience Angry Dil Raju: ‘దిల్’ రాజును ఆడేసుకుంటున్న తెలుగు ప్రేక్షకులు - ‘విజయ్ సార్’ ఎంత పనిచేశారు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/9cc0b8e694b35a9357d40c3f8c13ee911673947289579544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
‘వారిసు’ పుణ్యమా అని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అస్సలు మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ మూవీకి సంబంధించిన దిల్ రాజు ఇంటర్వ్యూతో మొదలైన రచ్చ ఇప్పటికీ కొనసాగుతోంది. అటు అజిత్ ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల విమర్శలతో తట్టుకోలేకపోతున్నారు. హీరో విజయ్ గురించి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తమిళనాట పెద్ద దుమారం రేపాయి. తమిళంలో విజయ్ నే నెంబర్ వన్ హీరో అంటూ ఆయన చేసిన కామెంట్స్ అజిత్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. దీంతో అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజుపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. తాజాగా తెలుగు ప్రేక్షకులతోని కూడా ఆయన తిట్లు తింటున్నారు.
‘వారిసు’ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం
నిర్మాత దిల్ రాజు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘వారిసు’ సినిమా నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేశారు. వాస్తవానికి ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలి అనుకున్నారు. కానీ, తమిళ సినిమాను పండగ బరిలో ఉంచడం ఏంటనే విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం తమిళంలో బాగానే ఆడుతున్న ఈ సినిమా, తెలుగులో ఫర్వాలేదు అన్నట్లుగా రన్ అవుతోంది. సినిమా ఎలా ఉందనే విషయాన్ని పక్కన పెడితే, ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి దిల్ రాజు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ‘వారిసు’ విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తమిళంలో అజిత్ కంటే విజయ్ గొప్ప నటుడు అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు అజిత్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. దీంతో దిల్ రాజు టార్గెట్ గా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. దిల్ రాజు ఎప్పుడూ ఇంతే ఏ సినిమా తీస్తే ఆ హీరో ను పొగుడుతూ ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.
హ్యాపీగా ఫీలవుతున్న విజయ్ అభిమానులు
‘వారిసు’ సినిమా టైటిల్స్ లో ‘విజయ్ సార్’ (Vijay Sir) అని సంబోధించారు. విజయ్ తన కెరీర్‌లో మొదటిసారిగా 'విజయ్ సార్'గా ఘనత పొందాడు అని రాశారు. దిల్ రాజు వ్యాఖ్యలపై తమిళ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి దక్కాల్సిన గౌరవం ఇచ్చినందుకు విజయ్ ఫ్యాన్స్ దిల్ రాజుకు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
దిల్ రాజు తీరుపై టాలీవుడ్ ప్రేక్షకుల ఆగ్రహం
మరోవైపు, దిల్ రాజు తీరును తెలుగు ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. ఆయన సినిమాను సైతం పెద్దగా ఆదరించడం లేదు. టాలీవుడ్ లోని పెద్ద స్టార్స్ తో పని చేసిన దిల్ రాజు, ఏనాడు, ఏ స్టార్ హీరోను సార్ అని సంబోధించలేదు. ఇప్పుడు తమిళ హీరోను సార్ అని పొగడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తీరును తప్పుబడుతున్నారు. మొత్తంగా ‘వారిసు’ దెబ్బకు దిల్ రాజు తలపట్టుకుంటున్నారు.
Thank You for always being there Brother @Jagadishbliss..
— Vamshi Paidipally (@directorvamshi) January 16, 2023
🤗 https://t.co/n0mnrLziPB
Read Also: చాలు విసిగిపోయాం, మేం వ్యతిరేక ధృవాలం: ఎన్టీఆర్, రామ్ చరణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)