అన్వేషించండి
Vijay Deverakonda: సారా అలీఖాన్ డేటింగ్ కామెంట్స్ పై విజయ్ దేవరకొండ రియాక్షన్!
సారా అలీఖాన్ డేటింగ్ కామెంట్స్ విజయ్ దేవరకొండ స్పందించారు.
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7ని హోస్ట్ చేస్తున్నారు. ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్స్ ఒక్కొక్కటిగా హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతున్నాయి. తాజాగా కరణ్.. సారా అలీఖాన్, జాన్వీ కపూర్ లను తన షోకి గెస్ట్ లుగా పిలిచారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఫన్నీగా ఈ ప్రోమోను కట్ చేశారు.
ముందుగా జాన్వీ, సారా అలీఖాన్ ల స్నేహం గురించి ప్రశ్నించిన కరణ్.. ఆ తరువాత ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నావో చెప్పాలని సారాని అడిగారు. దానికి ఆమె ముందు సమాధానం చెప్పనని ఫైనల్ గా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. వెంటనే కరణ్.. జాన్వీకి కూడా విజయ్ అంటే ఇష్టమని అనగా.. ఆమె నవ్వేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.
సారా అలీఖాన్ డేటింగ్ కామెంట్స్ పై స్పందిస్తూ.. 'దేవరకొండ అని నువ్ పిలిచే విధానం నాకు నచ్చింది.. క్యూటెస్ట్.. సెండింగ్ బిగ్ హగ్స్ అండ్ మై ఎఫెక్షన్' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో రాసుకొచ్చారు. ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు నటించిన 'లైగర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కాకుండా పూరి జగన్నాధ్ తో మరో సినిమా ఒప్పుకున్నారు విజయ్. 'జెజిఎం' అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Also Read: విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుంది - సారా అలీఖాన్ కామెంట్స్!
Also Read: 'ఫుల్లుగా తాగేసి ఇంటికెళ్లా, ప్రెగ్నెన్సీ విషయంలో అబద్దం చెప్పా' - రెజీనా కామెంట్స్!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
న్యూస్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion