Vijay Devarakonda: రాత్రి 1:30కి సమంతకు విజయ్ దేవరకొండ వీడియో కాల్ - ‘నిన్ను మిస్ అవుతున్నా’ అంటూ ఏం మాట్లాడారంటే?
విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతతో మాట్లాడిన వీడియో కాల్ వీడియోను షేర్ చేశారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను చిత్రబృందం ఒక రేంజ్‌లో చేస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. ఇందులో సమంతతో వీడియో కాల్ మాట్లాడుతూ తనను మిస్సవుతున్నా అని చెప్పడంతో ఒక జోక్ కూడా చెప్పి సామ్‌ను నవ్వించాడు.
ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉంది?
ముందుగా విజయ్ దేవరకొండ... సమంతకు వీడియో కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన సమంత ‘హేయ్... వాట్సాప్... అంతా ఓకేనా?’ అని అడిగారు. దానికి విజయ్ దేవరకొండ సమాధానం ఇస్తూ ‘ఏం లేదు. నిన్ను మిస్ అవుతున్నా... నీకు ఒక నాక్ నాక్ జోక్ చెప్పనా?’ అని అడిగారు. దానికి సమంత ‘లేదు. ఇప్పుడు సమయం 1:30 అవుతుంది. ఇప్పుడు నేను నాక్ నాక్ జోక్ వినలేను.’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. వెంటనే ‘ఓకే... ఫైన్...’ అన్నారు. దీనికి విజయ్ దేవరకొండ ‘సరే... నాక్ నాక్’ అనగానే సమంత ‘హూజ్ దేర్’ అని అడిగారు. వెంటనే విజయ్ దేవరకొండ ‘నా’ అని బదులిచ్చాడు. మళ్లీ సమంత వెంటనే ‘ఎవరు’ అనగానే విజయ్ దేవరకొండ ‘నా రోజా నువ్వే’ అంటూ పాట పాడతారు. దీనికి సమంత నవ్వడం ఈ వీడియోలో చూడవచ్చు.
వీడియో కాల్‌లో నిజంగానే మాట్లాడారా?
అయితే ఇది వీడియో కాల్ కాదు రికార్డెడ్ వీడియో అని తెలిసిపోతుంది. ఎందుకంటే సమంత కాల్ మాట్లాడేటప్పుడు తన కళ్లద్దాల్లో ఫోన్ మిర్రర్ అవుతుంది. ఐఫోన్‌లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు పైన రెడ్ కలర్‌లో పడే టైమర్‌ను చూడవచ్చు. కాబట్టి ఇది సినిమా ప్రమోషన్ కోసం రికార్డ్ చేసిన వీడియో అని అర్థం చేసుకోవచ్చు.
'ఖుషి' సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా సినిమా చూడొచ్చన్నమాట. ఈ సినిమా నిడివి 165 నిమిషాలుగా ఉంది. అంటే రెండు గంటల 45 నిమిషాలు అన్నమాట. ఈ టైమింగ్ మూడు గంటలకు కేవలం ఒక్క పావుగంట మాత్రమే తక్కువ.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమాలో సచిన్ ఖేడ్కర్, జయరామ్, లక్ష్మీ, మురళీ శర్మ, ఆలీ, శరణ్య పొన్నవణ్నన్, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. మేకప్ : బాషా, కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్ - హర్మన్ కౌర్ - పల్లవి సింగ్, కళా దర్శకత్వం : ఉత్తర కుమార్ - చంద్రిక, పోరాటాలు : పీటర్ హెయిన్, రచనా సహకారం : నరేష్ బాబు .పి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : దినేష్ నరసింహన్, కూర్పు : ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్, సంగీతం : హేషమ్ అబ్దుల్ వాహబ్, సి.ఇ.ఓ : చెర్రీ, ఛాయాగ్రహణం : జి. మురళి, నిర్మాతలు : నవీన్ యేర్నేని - రవిశంకర్ యలమంచిలి, కథ, కథనం, కొరియోగ్రఫీ, దర్శకత్వం : శివ నిర్వాణ.
View this post on Instagram