అన్వేషించండి

Trivikram: మావాడు చాలా గట్టివాడు, విజయ్ దేరకొండపై మాటల మాంత్రికుడి ప్రశంసలు

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రశంసలు కురిపించారు. ‘మావాడు మహా గట్టివాడు’ అంటూ ‘అమృతం కురిసిన రాత్రి’ కవితను కోట్ చేస్తూ అభినందించారు.

Trivikram about Vijay Devarakonda: వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు, ప్రముఖు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ వేడుకలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ విజయ్ దేరకొండపై ప్రశంసల జల్లు కురిపించారు.  

ప్రేమను, అంతకు మించి ద్వేషాన్ని చూశాడు!

త్రివిక్రమ్ స్పీచ్ అంటేనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. ప్రతిమాట ప్రేక్షకులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ‘లక్కీ భాస్కర్’ సినిమా గురించి మాట్లాడిన ఆయన, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “విజయ్ దేవరకొండ నా ఫేవరెట్ యాక్టర్. విజయ్ ఎంతో ప్రేమను చూశాడు. అదే సమయంలో అంతకు మించిన ద్వేషాన్ని కూడా చూశాడు. తక్కువ సమయంలో ఈ రెండింటిని చూసిన విజయ్ చాలా గట్టివాడు. అమృతం కురిసిన రాత్రి పుస్తకంలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ‘మావాడు మహా గట్టివాడు’ అనే కవితను మాటను రాశారు. “మావాడు కూడా చాలా గట్టి వాడు” అంటూ విజయ్ ని అభినందించారు. త్రివిక్రమ్ మాటలకు విజయ్ ఎమోషనల్ అయ్యారు.

రౌడీ బాయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

డైలాగ్ రైటర్ గా, స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్.. ప్రశంసల జల్లు కురిపించడంతో విజయ్ దేవరకొండపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్రివిక్రమ్ ఎవరినీ అంత త్వరగా ప్రశంసించరని, విజయ్ ని అభినందించారంటే ఆయనలోని టాలెంట్ తనకు అర్థం అయ్యిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో VD12 అనే సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్ లో 12వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.  సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 

‘లక్కీ భాస్కర్’ సినిమా గురించి...

దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా, అక్టోబర్ 31న విడుదలకానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పైసూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.  ఈ సంస్థకు త్రివిక్రమ్ కు మంచి అనుబంధం ఉంది. ఈ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమా విషయంలో త్రివిక్రమ్ పాత్ర ఉంటుంది. అందుకే ఈ సినిమా వేడుకకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమాలోని ప్రతి నటుడు ఎమోషనల్ గా నటించారని చెప్పారు. తడిచిన కళ్లతో నవ్వుతున్న పెదాలతో ప్రేక్షకులు థియేటర్స్‌‌ నుంచి బయటికి వస్తారని నమ్ముతున్నట్లు అభిప్రాయపడ్డారు.    

Read Also: జ్యోతికతో సినిమా, సిగ్గు పడుతూ సూర్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 27th: 'గోదావరి' సీరియల్: జాను మీద నందు ఫైర్! తాంబూలం విసిరి కొట్టిన నందు! జానుకి అండగా సంజయ్!
'గోదావరి' సీరియల్: జాను మీద నందు ఫైర్! తాంబూలం విసిరి కొట్టిన నందు! జానుకి అండగా సంజయ్!
Nindu Manasulu Serial Today October 27th: నిండు మనసులు: ప్రేరణలో మార్పునకు సిద్ధూ షాక్! కలిసి పని చేస్తానంటూ ట్విస్ట్!
నిండు మనసులు: ప్రేరణలో మార్పునకు సిద్ధూ షాక్! కలిసి పని చేస్తానంటూ ట్విస్ట్!
Ramayana: ఆదిపురుష్ పాటలే బెటరా? సొంత పాటలు కాపీ కొట్టిన రెహమాన్?
ఆదిపురుష్ పాటలే బెటరా? సొంత పాటలు కాపీ కొట్టిన రెహమాన్?
Nindu Noorella Saavasam Serial Today October 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి నిజం చెప్పిన అంజు - అంజును హగ్‌ చేసుకున్న వైజయంతి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి నిజం చెప్పిన అంజు - అంజును హగ్‌ చేసుకున్న వైజయంతి

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
BJP Jana Sena Telangana: ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
ఢిల్లీ సంబంధాలు - గల్లీ ఇరకాటం - తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో జనసేన కోసం బీజేపీ వెనక్కి తగ్గక తప్పదా?
Cyclone Arnab Relief Number: అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు
అర్నాబ్ తుపాను బాధితుల కోసం ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
రూ.10 లక్షలకే Hyundai Bayon లాంచ్‌ - ఈ కారు మీ మాట వింటుంది.. 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్ కూడా!
Hyundai Bayon SUV లాంచ్.. Creta కంటే ధర తక్కువే, ఫీచర్లు మాత్రం అదుర్స్!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Embed widget