అన్వేషించండి

Family Star Release Date: ఎన్టీఆర్ 'దేవర' డేట్ మీద కన్నేసిన దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'

Vijay Devarakonda Family Star Release Date: ఎన్టీఆర్ 'దేవర' వాయిదా పడటంతో ఆ తేదీకి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'ను విడుదల చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

Vijay Devarakonda's Famil Star to release on April 5th, 2024: ఎన్టీఆర్ సినిమా వెనక్కి వెళుతుండటంతో విజయ్ దేవరకొండ సినిమాను విడుదల చేయడానికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ 'దిల్' రాజు సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్' ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది. విజయ్ దేవరకొండకు బెస్ట్ థియేట్రికల్ రిలీజ్ డేట్ దొరికిందని చెప్పవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే...

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'దేవర'ను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. సినిమా యూనిట్ ఇంకా అనౌన్స్ చేయలేదు గానీ... ఆ రోజు థియేటర్లలోకి సినిమా వచ్చే అవకాశాలు లేవు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సాంగ్స్ లేటుగా ఇవ్వడం, నేపథ్య సంగీతం చేయడానికి మరింత సమయం కావాలని అడగడంతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేశారు. దాంతో ఏప్రిల్ 5న 'దేవర' రిలీజ్ కావడం లేదు. ఇప్పుడు ఆ తేదీకి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' వస్తోంది.

సంక్రాంతి మిస్ అయినా...
అంత కంటే బెస్ట్ రిలీజ్ డేట్!
తొలుత 'ఫ్యామిలీ స్టార్' సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే... బరిలో నాలుగైదు సినిమాలు ఉండటంతో వెనక్కి వెళ్ళింది. ఒక విధంగా అలా వెళ్ళడం వల్ల చాలా మంచి జరిగింది. ఏప్రిల్ 5 దొరికింది.

Also Read: గోదారోళ్లతో ఈషా రెబ్బా స్పెషల్ సాంగ్ - మామూలుగా ఉండదు మరి!

ఏప్రిల్ 5 శుక్రవారం. విడుదల రోజు ఓపెనింగ్స్ కలెక్షన్స్ బావుంటాయి. శని, ఆది వారాలైన 6, 7 తేదీల్లో వీకెండ్ వసూళ్లు సైతం బాగా వస్తాయి. అయితే... ఏప్రిల్ 8న ఉగాది వచ్చింది. తెలుగు పండుగ. పైగా, ఫ్యామిలీ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా. మంచి బజ్ రావడమే కాదు... థియేటర్లకు జనాలు కూడా వస్తారు. సో... సంక్రాంతి మిస్ అయినా విజయ్ దేవరకొండకు అంత కంటే మంచి రిలీజ్ డేట్ దొరికిందని చెప్పవచ్చు. దర్శక నిర్మాతలు అనౌన్స్ చేయలేదు గానీ ఈ విడుదల తేదీని సంగీత దర్శకుడు గోపీసుందర్ కన్ఫర్మ్ చేశారు.

Also Readనిర్మాత ఎస్కేఎన్ ఇంటికి అల్లు అర్జున్... తండ్రి మరణించిన బాధలో ఉన్న ఆత్మీయుడికి ధైర్యం చెప్పిన బన్నీ

'ఫ్యామిలీ స్టార్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన 'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాల ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా 'మజిలీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మైఖేల్' సినిమాల ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే... 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కలయికలో వస్తున్న చిత్రమిది.

ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో రూపొందుతున్న 54వ సినిమా 'ఫ్యామిలీ స్టార్'. హీరో విజయ్ దేవరకొండకు ఇది 13వ సినిమా. ఈ సినిమాకు 'దిల్' రాజు, శిరీష్ నిర్మాతలు.

Also Readకొత్త కారు కొన్న తమిళ హీరో దళపతి విజయ్ - బాబోయ్ అంత రేటా?

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 6th: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Korean Kanakaraju OTT : కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?
కొరియన్ కనకరాజు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు చూడొచ్చంటే?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget