‘లైగర్’లో విజయ దేవరకొండ MMA ఫైటర్, ఈ ఆటను ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
‘లైగర్’ మూవీలో విజయదేవర కొండ బాక్సర్ కాదు, MMA ఫైటర్. ఇందులో రూల్స్ మిగతా క్రీడలు కంటే చాలా భిన్నంగా ఉంటాయ్.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై ఇటు టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లో సైతం ఎన్నో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ నటించడం వల్ల హైప్ మరీ ఎక్కువగా ఉంది. దీనికి తోడు.. ‘లైగర్’కు పూరీ టీమ్ ఎన్నడూ చేయనంతగా పబ్లిసిటీ ఇచ్చారు. దాదాపు ఇండియా మొత్తం చుట్టేసి.. సినిమాను ఓ రేంజ్‌లో హిట్ చేయాలనే పట్టుదలతో సాగారు. కానీ, సినిమాను ఎంత ప్రమోషన్ చేసినా.. చివరికి మార్కులు వేయాల్సింది ఆడియన్స్ మాత్రమే. మీరు ఆ సినిమా చూసేందుకు ముందు ఒక్క విషయం తెలుసుకోవాలి. అందరూ అనుకుంటున్నాట్లుగా అందులో విజయ్ దేవరకొండ బాక్సర్ కాదు, MMA ఫైటర్. అదేంటీ కొత్తగా ఉందే అని అనుకుంటున్నారా? అయితే, మీరు దాని గురించి తెలుసుకోవల్సిందే.
MMA అంటే?: MMA అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఆ పేరులోనే ఉందండీ మొత్తం గేమ్ గురించి ఉంది. ఇదో హైబ్రిడ్ యుద్ధ క్రీడ. బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, జుజిత్సు, కరాటే, థాయ్ బాక్సింగ్ వంటి యుద్ధ క్రీడల నుంచి తీసుకున్న టెక్నిక్స్ ను ఉపయోగించి ఈ MMA ను అభివృద్ధి చేశారు. ఈ గేమ్ వచ్చిన తొలిరోజుల్లో ఎలాంటి రూల్స్ లేకుండా అత్యంత క్రూరంగా ఆడే క్రీడగా దీన్ని చూసేవారు. కానీ ఎంఎంఏ ఆ చెడు ఇమేజ్ నుంచి బయటపడి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వీక్షించే క్రీడగా ఎదిగింది. కానీ ఇప్పటికీ చాలా దేశాలతో పాటు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఎంఎంఏపై ఆంక్షలు ఉన్నాయి. నాకౌట్, సబ్మిషన్, జడ్జెస్ ద్వారా మూడు విధాలుగా ఇందులో విజయాన్ని నిర్ణయిస్తారు. వీటి గురించి డీటెయిల్డ్ గా చెప్పుకునే ముందు.. ఎంఎంఏ హిస్టరీ గురించి కాస్త తెలుసుకుందాం.
క్రీస్తు పూర్వం 648వ సంవత్సరంలో పురాతన ఒలింపిక్ గేమ్స్ లో ఎంఎంఏ ఆడినట్టు భావిస్తున్నారు. గ్రీక్ సైన్యానికి కూడా ఇందులో శిక్షణ ఇచ్చేవారు. క్రీస్తు శకం 393 సంవత్సరంలో రోమన్ చక్రవర్తి ఒలింపిక్స్ ను బ్యాన్ చేశాక ఈ క్రీడ పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. 20వ శతాబ్దంలో బ్రెజిల్ లోని వాలే ట్యూడో ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చింది. కార్లో, హెలియో అనే ఇద్దరు సోదరులు నార్త్ అమెరికాలో బాగా పాపులారిటీ తీసుకొచ్చారు. వాళ్లే ఈ టోర్నమెంట్ కు UFC అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ అని పేరు పెట్టారు. ఆ యూఎఫ్సీయే MMA కు ప్రధాన ప్రచారకర్తగా ఎదిగింది.
View this post on Instagram
ఎంఎంఏ క్రీడకు స్థిరమైన నిబంధనలు తీసుకొచ్చేలా UFC కృషి చేసింది. 2009 నాటికి యూనిఫైడ్ నిబంధనల పేరిట అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్ ఏం చెప్తాయంటే.. ఆటగాళ్లు బూట్లు వేసుకోకూడదు. చేతికి ఉన్న గ్లవ్స్ కూడా పూర్తిగా ఉండకూడదు. కేవలం నకల్స్ మాత్రమే కవర్ చేయాలి. వేళ్లు ఓపెన్ గానే ఉండాలి. హెడ్ కు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండకూడదు. కొరకడం, జుట్టు లాగడం, తలతో కొట్టడం, ప్రత్యర్థి కంట్లోకి పొడవడం పూర్తిగా నిషేధం.
MMA యూనిఫైడ్ రూల్స్ కింద ఒక్కో రౌండ్ 5 నిమిషాలు చొప్పున 3 రౌండ్స్ జరుగుతాయి. ఒక్కో రౌండ్ తర్వాత ఒక్కో నిమిషం విశ్రాంతి ఉంటుంది. నాకౌట్, సబ్మిషన్, జడ్జెస్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ప్లేయర్ మళ్లీ పైకి లేవకుండా నాకౌట్ చేయాలి. సబ్మిషన్ అంటే.. ఇక నేను ఆడలేనని ప్రత్యర్థి చేత ఓటమి అంగీకరింపచేయడం.... ఇక మూడోది జడ్జెస్ నిర్ణయం. ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా తలపడితే.... విజేతలను జడ్జెస్ ప్యానెల్ నిర్ణయిస్తుంది.
Also Read: 'లైగర్' రివ్యూ - విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?
Also Read: హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మొదటి ఎపిసోడ్ రివ్యూ: గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్థాయిని అందుకుందా?