Liger Movie: 'లైగర్' నుంచి మరో కొత్త సాంగ్ - ప్రోమో చూశారా?
ఆగస్ట్ 25న 'లైగర్' సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగులోనే సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ కావడానికి రెడీ అవుతున్నారు. అతడు నటించిన 'లైగర్' సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది.
ఆగస్ట్ 25న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో సినిమా నుంచి ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా నుంచి 'ఆఫట్' అనే పాటను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో విజయ్, అనన్య రొమాంటిక్ సీన్ ను చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'
Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















