అన్వేషించండి

Saindhav Movie: సంక్రాంతి బరిలో ‘సైంధవ్’, ఈసారి విక్టరీ వెంకటేష్ లెక్క మారిపోయేనా?

వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సైంధవ్'. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంక్రాంతి బరిలో ‘సైంధవ్’

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,  'హిట్' దర్శకుడు శైలేష్ కొలను కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'సైంధవ్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఎలాంటి బ్రేకులు లేకుండా ఈ మూవీ షూటింగ్ నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. వాస్తవానికి ‘సైంధవ్’ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, కొన్ని కారణాలతో రిలీజ్ డేట్ ను పోస్టుపోన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టుగా చెప్పారు. 

 ఈసారి సంక్రాంతి కి లెక్క మారిపోయేనా?

దగ్గుబాటి వెంకటేష్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా 'సైంధవ్' మూవీ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటి వరకు వెంకటేష్ కెరీర్ లో ఎప్పుడూ కనిపించని కొత్త గెటప్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ తో కీలక విషయాన్ని వెల్లడించింది. 'ఈసారి సంక్రాంతి కి లెక్క మారుద్ది' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్ ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. వెంకటేష్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ పడటం ఖాయం అని భావిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తో పాటు కొంత టాకీ పార్ట్ ను కూడా చిత్రీకరిస్తున్నారట. సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ వెంకటేష్ కి భార్యగా కనిపించబోతోంది.   

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటుడు

ఇక ‘సైంధవ్’ సినిమా వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా రూపొందుతోంది. దర్శకుడు శైలేష్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు.  ఈ సినిమాలో నవాజుద్దీన్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారున తమిళ హీరో ఆర్య సైతం మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళతో పాటు రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. తాజాగా 'దసరా' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చాటిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ,మలయాళ భాషలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.  

Read Also: జూ. ఎన్టీఆర్ ను ఏనాడు పట్టించుకోలే, చంద్రబాబు అరెస్టు గురించి ఎందుకు మాట్లాడాలి?- తమ్మారెడ్డి

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranveer Singh: తెలుగులో రణవీర్‌ను బ్యాన్ చేయలేదు... Don 3కి చేసినట్టు ప్రశాంత్ వర్మ గొడవ చేయలేదు
తెలుగులో రణవీర్‌ను బ్యాన్ చేయలేదు... Don 3కి చేసినట్టు ప్రశాంత్ వర్మ గొడవ చేయలేదు
Sachin Billion Dreams OTT : గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ డాక్యుమెంటరీ - 9 ఏళ్ల తర్వాత ఓటీటీలో ఎంట్రీ
గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ డాక్యుమెంటరీ - 9 ఏళ్ల తర్వాత ఓటీటీలో ఎంట్రీ
Nindu Manasulu Serial Today May 26th: నిండు మనసులు: సిద్ధూని అవమానించడానికి విజయానంద్ ప్లాన్! గుత్తి వంకాయతో ప్రేరణ మామ తిక్క కుదుర్చుతుందా!
నిండు మనసులు: సిద్ధూని అవమానించడానికి విజయానంద్ ప్లాన్! గుత్తి వంకాయతో ప్రేరణ మామ తిక్క కుదుర్చుతుందా!
Chennai Love Story : కిరణ్ అబ్బవరం సినిమాకు 100 కోట్ల కలెక్షన్స్ - ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఇదే
కిరణ్ అబ్బవరం సినిమాకు 100 కోట్ల కలెక్షన్స్ - ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఇదే

వీడియోలు

Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Will Jacks Fielding in RR vs MI IPL 2026 | గాల్లో తేలుతూ విల్ జాక్స్ ఫీల్డింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
YSRCP committee restructuring: స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
Dairy Farm Scheme: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
Dharamsala Pitch Report: ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
Pawan Kalyan on Nageshwar: జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
GHMC MeeSeva WhatsApp Number: అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
Numerology: పుట్టిన తేదీ 5, 14, 23 అయితే పదునైన మేధస్సు , ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరి సొంతం, మరి ఉండకూడని లక్షణాలేంటో తెలుసా?
పుట్టిన తేదీ 5, 14, 23 అయితే పదునైన మేధస్సు , ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరి సొంతం, మరి ఉండకూడని లక్షణాలేంటో తెలుసా?
Embed widget