అన్వేషించండి

Varun-Lavanya: అప్పుడేమో అలా అన్నారు, ఇప్పుడేమో పెళ్లికి రెడీ అయ్యారు: వరుణ్-లావణ్య ఓల్డ్ వీడియో వైరల్

గతంలో వరుణ్ తేజ్ - లావణ్య కలసి ‘మిస్టర్’ సినిమాలో నటించారు. ఆ సమయంలో మూవీ ప్రమోషన్ష్ లో భాగంగా ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరూ సమాధానాలు చెప్పారు. షూటింగ్ స్పాట్ లో..

Varun-Lavanya: టాలీవుడ్ కొత్త జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల గురించి పరిచయం అవసరం లేదు. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయారు. వీరి ప్రేమ, పెళ్లి గురించి నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. అందరూ అనుకున్నట్టు ఎట్టకేలకు ఈ జంట జూన్ 9 న నిశ్చితార్థం చేసుకున్నారు. వరుణ్ తేజ్ నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగిందీ వేడుక. వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. అయితే వరుణ్-లావణ్యలు గతంలో పలు సినిమాలలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకరి గురించి ఒకరు మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో వరుణ్-లావణ్య మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 

గతంలో వరుణ్ తేజ్ - లావణ్య కలసి ‘మిస్టర్’ సినిమాలో నటించారు. ఆ సమయంలో మూవీ ప్రమోషన్ష్ లో భాగంగా ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరూ సమాధానాలు చెప్పారు. షూటింగ్ స్పాట్ లో మొదటి సారి ఒకర్ని ఒకరు చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అని  అడిగితే.. వరుణ్ ను చూసినపుడు పొడుగ్గా, అందంగా కనిపించాడని చెప్పింది లావణ్య. అలాగే తనకు లావణ్యను మొదటిసారి చూసినపుడు చాలా ఫన్నీగా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేదని చెప్పాడు వరుణ్. 

చిన్న వాటికి కూడా ఎక్కువ ఆలోచిస్తుంది : వరుణ్

సాధారణంగా లావణ్య చాలా ఫన్నీగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు వరుణ్. షూటింగ్ టైమ్ లో కూడా యాక్టీవ్ గా కనిపిస్తూ ఉంటుందని అన్నాడు. అయితే ఒక్కోసారి ప్రతీ చిన్న దానికి కూడా ఓవర్ గా ఆలోచించేస్తుందని, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా ఎక్కువ టెన్షన్ పడుతుందని చెప్పాడు. కానీ తాను అలా ఎక్కువగా ఆలోచించనని, పరిస్థితులు ఎలా ఉన్నా మామూలుగానే ఉంటానని అన్నాడు. 

పక్కన ఉన్నా పట్టించుకోలేదు..

మొదట్లో షూటింగ్ స్పాట్ లు దగ్గర లావణ్య కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్పేదని, అయితే ఒక్కోసారి కొంచెం దూరంగా ఉన్నప్పుడు తాను సైగ చేసినా, పక్క నుంచి వెళ్తూ హాయ్ చెప్పినా పట్టించుకునేది కాదని అన్నాడు వరుణ్. అయితే తనకు ఓ రోజు చిరాకొచ్చి ఆ విషయం అడిగేశానని అప్పుడు అసలు విషయం చెప్పిందని చెప్పాడు. లావణ్య కు కళ్లకు లెన్స్ ఉండేవని, అవి లేకపోతే దూరం నుంచి కనిపించేది కాదని చెప్పిందని చెప్పాడు. 

కోస్టార్స్ ను ఎప్పుడూ అలా ఊహించుకోలేదు..

ఇదే ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో మీరు ఎప్పుడైనా కో స్టార్స్ తో అట్రాక్ట్ అయ్యారా అని అడిగితే.. ఇద్దరూ ఒకే ఆన్సర్ చెప్పారు. తాము షూటింగ్ సమయంలో ఉన్నప్పుడు కేవలం డైలాగ్స్, యాక్టింగ్ మీదే దృష్టి పెడతామని చెప్పారు. షూటింగ్ సమయాల్లో అలా ఎప్పుడూ జరగలేదని, ఏ హీరోతో హీరోయిన్ తో గాని ఆ ఫీలింగ్ రాలేదని చెప్పారు. అయితే ఈ ఇంటర్వ్యూ జరిగి ఓ నాలుగైదేళ్లు గడుస్తోంది. ఇప్పుడు వరుణ్-లావణ్య ప్రేమించుకొని పెళ్లికి సిద్ధమయ్యారు. ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దీంతో అప్పట్లో వరుణ్-లావణ్య అన్న మాటలు ఇప్పుడు ట్రెంట్ అవుతున్నాయి. దీని పై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: మహేష్ బాబు Vs రవితేజ - 2024 సంక్రాంతికి బిగ్ ఫైట్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Deewana Teaser: సమ్మర్‌లో హర్షిత్ రెడ్డి 'దీవాన'... థియేటర్లలోకి గీతా ఫిలిం నుంచి - టీజర్ చూశారా?
సమ్మర్‌లో హర్షిత్ రెడ్డి 'దీవాన'... థియేటర్లలోకి గీతా ఫిలిం నుంచి - టీజర్ చూశారా?
Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Carmeni Selvam Teaser: డబ్బు... ఆధునిక ఆశయాలు... మధ్యలో 'కార్మేని సెల్వం' - టీజర్ చూశారా?
డబ్బు... ఆధునిక ఆశయాలు... మధ్యలో 'కార్మేని సెల్వం' - టీజర్ చూశారా?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Embed widget