Ananya Nagalla: బాలీవుడ్‌లోకి అనన్య నాగళ్ల - నటిగా కాదు రచయితగా.. ఏ మూవీకో తెలుసా?
Ananya Nagalla: 'మల్లేశం' సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన అనన్య నాగళ్ల.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా.. ఇప్పుడు రచయితగా మారారు. ఒక హిందీ సినిమాకి ఆమె రైటర్ గా చేశారు.
Telugu Actress Ananya Nagalla Became Writer For Hindi Movie: 'మల్లేశం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. 'మల్లేశం'లో ఆమె యాక్టింగ్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక అక్కడ నుంచి వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మూవీ 'వకీల్ సాబ్'లో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇక ఈ మధ్యే 'తంత్ర' పేరుతో అందరినీ భయపెట్టింది. ఇక 'పొట్టేల్' తో మరో సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, కేవలం యాక్టింగ్ మాత్రమే కాదట. ఆమెలో మరో స్కిల్ దాగి ఉందట. అదే రైటర్. అందుకే, ఒక హిందీ సినిమాకి రచయితగా వ్యవహరించింది. ‘మల్లేశం' సినిమా డైరెక్టర్ రాజ్ రాచకొండ తీసిన హిందీ సినిమా '8 ఏఎం మెట్రో'కు (8am Metro Movie) కథలో సహకారం అందించిందట.
రైటర్ గా..
'8 ఎఎం మెట్రో' (8am Metro Movie) సినిమా మే 19, 2023న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమా మొదట్లో.. అనన్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక స్లైడ్ ఉంది. అయితే, అది దేనికో ఇప్పుడు రివీల్ చేసింది అనన్య. ఆ సినిమాలో ఒక రైటర్ గా తను భాగస్వామి అయినట్లు చెప్పింది. ఈ సందర్భంగా ఆమె డైరెక్టర్ కి ధన్యవాదాలు చెప్పారు. అంతటి గొప్ప అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఆమె అభిమానులంతా.. మీలో రైటర్ కూడా ఉన్నాడా? మల్టీటాలెంటెడ్ మీరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి ఫేమస్ నవల అందమైన జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. '8 ఎఎం మెట్రో' చిత్రానికి రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. అలాగే, ఆయనే నిర్మాణ భాగస్వామి. కిషోర్ గంజితో కలిసి చిత్రాన్ని నిర్మించారు. మార్క్ కే రాబిన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా మొత్తం హైదరాబాద్ మెట్రోలో సాగుతుంది.
కథ ఏంటంటే?
ఇరావతి (సయామీ ఖేర్) కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉంటారు. నాందేడ్ లో ఉంటుంది వాళ్ల ఫ్యామిలీ. కానీ, తన చెల్లెలి కోసం, ఆమె హెల్త్ కోసం ఇరావతి హైదరాబాద్ రావాల్సి వస్తుంది. ట్రైన్ ఎక్కడం కూడా సరిగ్గా తెలియని ఇరావతి రోజూ మెట్రోలో ప్రయాణించాల్సి వస్తుంది. అలా మెట్రోలో పరిచయం అవుతాడు ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య). అది కాస్తా స్నేహంగా మారుతుంది. ఆ తర్వాత ఏమైంది? ఆ స్నేహం ఏ తీరాలకు దారి తీసింది? ఆమె మారుతుందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక మొదటి సినిమానే రాచకొండ హిందీలో అద్భుతంగా తెరకెక్కించారు.
Also Read: అభిమాని గుండెలపై ఎన్టీఆర్ సంతకం - పోలింగ్ బూత్ వద్ద అరుదైన దృశ్యం