By: ABP Desam | Updated at : 26 Jan 2023 03:44 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Uorfi/Instagram
బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వింత వింత డ్రెస్సులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమె వేసుకునే బట్టలపై నిత్యం రగడ కొనసాగుతూనే ఉంటుంది. ఎవరు ఏమి అనుకున్నా నాకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తుంది. నచ్చిన డ్రెస్సింగ్ స్టైల్లో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా బయట పెట్టుకుంది. ఇంతకీ తనకి వచ్చిన బాధేమిటంటే...
ఈ నటికి ముంబైలో ఉండటానికి ఇల్లే దొరకడం లేదట. అద్దె ఎక్కువిస్తానన్నా సరే ఎవరూ తనకు ఇల్లు ఇవ్వడం లేదట. ఇదే విషయాన్ని నెట్టింట్లో ప్రస్తావిస్తూ తన ఆవేదనంతా వెళ్లగక్కింది. ఉర్ఫీ జావేద్ తన ట్విట్టర్లో ఏం రాసిందంటే? “ముస్లిం యజమానులు నేను ధరించే దుస్తుల కారణంగా నాకు ఇల్లు రెంటుకు ఇవ్వరు. నేను ముస్లీంను కాబట్టి హిందువులు కూడా ఇల్లు ఇవ్వడం లేదు. అటు నాకు రాజకీయ బెదిరింపులు వచ్చిన కారణంగా చాలా మంది భయపడి ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు. మొత్తంగా నాకు ముంబైలో అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టంగా మారింది. ఇంటి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు” అంటూ ట్వీట్ చేసింది.
Muslim owners don’t want to rent me house cause of the way I dress, Hindi owners don’t want to rent me cause I’m Muslim. Some owners have an issue with the political threats I get . Finding a rental apartment in mumbai is so tuff
— Uorfi (@uorfi_) January 24, 2023
అటు గతంలో కూడా ఉర్ఫీకి ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఉర్ఫీ రిప్లై ఇచ్చింది. “ఒక్కసారి కాదు, ప్రతి సారి ఇదే పరిస్థితి ఎదురైంది. నటిని, అందులోనూ సింగిల్ ఉన్నాను. అందుకే నాలాంటి వాళ్లకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు” అని తన బాధను వెల్లడించింది.
It’s literally Everytime mahn , single , Muslim , actress - impossible to find a house
— Uorfi (@uorfi_) January 24, 2023
బిగ్ బాస్ OTT షో తర్వాత ఉర్ఫీ పలు టీవీ షోలలో నటించింది. ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి బాగా పేరు సంపాదించింది. ALT బాలాజీలో ప్రసారమైన ‘మేరీ దుర్గా’లో ఆర్తిగా, ‘బేపన్నా’లో బెల్లాగా, ‘పంచ్ బీట్’ సీజన్ 2లో మీరాగా కనిపించింది. 2016 నుండి 2017 వరకు, ఉర్ఫీ స్టార్ ప్లస్ ‘చంద్ర నందిని’లో ఛాయా పాత్రను పోషించింది. 2018లో SAB TV ‘సాత్ ఫేరో కి హెరా ఫెరీ’లో కామినీ జోషి పాత్రను పోషించింది. 2020లో ఉర్ఫీ జావేద్ ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో శివాని భాటియాగా చేసింది. ఆ తర్వాత ‘కసౌటి జిందగీ కే’లో తనీషా చక్రవర్తి పాత్ర పోషించింది.
ఉర్ఫీ జావేద్ అక్టోబర్ 15, 1997న లక్నోలో జన్మించింది. ఆమెకు అస్ఫీ జావేద్ అనే సోదరి ఉంది. ఆమె లక్నోలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ లో పట్టా అందుకుంది. పరాస్ కల్నావత్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది.
Read Also: అందుకే నేను పూర్తిగా బట్టలేసుకోలేను - అసలు విషయం చెప్పిన ఉర్ఫీ జావెద్
Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!
Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్
Manoj wishes Ram Charan: ‘స్వీటెస్ట్ బ్రదర్’ అంటూ చెర్రీకి మంచు మనోజ్ బర్త్‌డే విసెష్, విష్ణును ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
HBD Ram Charan: చెర్రీకి ఎన్టీఆర్, మహేష్ బాబు శుభాకాంక్షలు, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్!
చేతిలో చెంబు, కండలు తిరిగిన బాడీతో బెల్లంకొండ - హిందీ ‘ఛత్రపతి’ ఫస్ట్ లుక్ చించేశారుగా!
KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్
Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక