By: ABP Desam | Updated at : 31 Jan 2023 07:11 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:kangana-Urfi/Instagram
బాలీవుడ్ డేేర్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె మాటలతో ఎప్పుడూ ఏదొక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది. అలాగే ఈ మధ్య బాలీవుడ్ లో వివాదాలు అంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఉర్ఫీ జావేద్. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. అయితే ఇటీవల కంగనా రనౌత్ చేసిన ఓ ట్వీట్ తో వీరిద్దరి మధ్య ట్వీట్ ల వార్ మొదలైంది. దీంతో వీరి మేటర్ బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన సినిమా ‘పఠాన్’. ఈ మూవీకు మంచి హిట్ టాక్ రావడంతో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే ఇటీవల ఈ మూవీను ఉద్దేశించి ట్విట్టర్ లో ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ పై నటి కంగనా రనౌత్ స్పందిస్తూ రీట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్త వివాదం అయింది.
ఇంతకీ కంగనా ఏమని ట్వీట్ చేసిందటే.. ‘‘అవును, ఈ భారతీయులకు ఖాన్ నటులు, ముస్లిం నటీమణులు అంటే ఎక్కువ ఇష్టపడతారు’’ అని పేర్కొంది. కంగనా రనౌత్ ట్వీట్ పై నెటిజన్స్ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ కూడా స్పందించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై ఉర్ఫీ జావేద్ స్పందిస్తూ.. అసలు ఈ ముస్లిం నటులు, హిందు నటులు ఏమిటి? కళని, మతాన్ని బట్టి వేరు చేయకూడదు. ఇక్కడ కేవలం నటులు మాత్రమే ఉంటారు. కంగనా ట్వీట్ సరైంది కాదు. తను ముస్లిం కాదు. అందుకే తన సినిమాలను చూడాలని చెబుతోందా అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది.
Also Read : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!
అయితే దీనికి పాజిటివ్ గా స్పందంచిన కంగన యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి రాసుకొచ్చింది. దానికి ఉర్ఫీ స్పందిస్తూ.. అది తనకు సెట్ అవ్వదని రీట్వీట్ చేసింది. అయితే ట్వీట్‌ల వార్ నడుస్తుండగానే సడెన్ గా ఉర్ఫీ పై ప్రేమను కురిపిస్తూ కంగనా ట్వీట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది. ‘‘నీలో దైవత్వం దాగి ఉంది, చాలా స్వచ్చమైన దానివి’’ అని రీట్వీట్ చేసింది. అంతే కాదు పురాణాల్లో ఉన్న అక్కమహాదేవిను ప్రస్తావించింది. పూర్వ భారతదేశ రాణి అక్కమహాదేవి ఎక్కువగా శివుడిని ఆరాధించేవారని చెప్పింది. అయితే ఓ రోజు ఆమె అందరి ముందు తనకు శివుడు అంటేనే ఇష్టమని తన భర్త అంటే ఇష్టం లేదని చెబుతుంది, అప్పుడా భర్త.. అయితే తన నుంచి దక్కినవి అన్ని విడిచిపెట్టేయాలని నిబంధన పెట్టడంతో తన ఒంటిపై ఉన్న వస్త్రాలను కూడా విడిచిపెట్టి అడవికి వెళ్లిపోతుంది. ఆమె తర్వాత కూడా వస్త్రాలు ధరించలేదు. అలాగే అడవిలో బట్టలు లేకుండా జీవించింది. ఆమె జీవితం నేటి మహిళలందరికీ ఆదర్శమనే చెప్పాలి. అందుకే తనను అవమానించే అధికారం ఎవరికీ ఇవ్వద్దు’’ అని ఉర్ఫీని కోరుతూ ఈ స్టోరి చెప్పుకొచ్చింది కంగనా. 2020లో కూడా ఇలాగే కంగనా సోషల్ మీడియా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే ఆమె ట్విటర్ అకౌంట్ బ్లాక్ అయింది. మళ్లీ ఈ మధ్య ట్వీట్టర్ లో అడుగు పెట్టిన కంగనా వరుస ట్వీట్ లతో వివాదాస్పదమవుతోంది. మరి ఈ తాజా పరిణామాలు ఎటు నుంచి ఎటు దారితీస్తాయో చూడాలి.
Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!
Akshay Kumar: మూవీ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్
New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!
Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి
Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల