Upendra's Kabzaa Movie: ఉపేంద్ర ‘కబ్జా’ రిలీజ్ డేట్ ఫిక్స్, పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా విడుదల
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న తాజా సినిమా ‘కబ్జా’. ఆర్.చంద్రు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా విడుదల కాబోతోంది.
కన్నడ టాప్ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కబ్జా’. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ రూపొందిస్తోన్న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకాబోతోంది. శాండిల్ వుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమాపై ఓ రేంజిలో క్యూరియాసిటీని పెంచుతూ వచ్చాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్.చంద్రు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మార్చి 17న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
View this post on Instagram
పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా విడుదల
ఉపేంద్ బర్త్ డే సందర్భంగా ‘కబ్జా’ టీజర్ విడుదల అయ్యింది. ఈ టీజర్ పీరియాడిక్ ఫిల్మ్ పై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెంచాయి. ఇండియాలో ఓ గ్యాంగ్‌స్టర్ క్రమ క్రమంగా ఎలా ఎదిగాడు అనేదే ‘కబ్జా’ మూవీ స్టోరీ. 1947 నుంచి 1984 మధ్యకాలంలో ఈ సినిమా కథ నడుస్తుంది. స్వాతంత్య్ర సమర యోధుడి కొడుకు మాఫియా వరల్డ్ లో ఎలా చిక్కుకున్నాడు? ఆ తర్వాత ఏ రేంజ్‌కు చేరుకున్నాడు? అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కుతోంది. చంద్రు దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీని కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కన్నడ పవర్ స్టార్ కు నివాళిగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పారు.
కన్నడ చిత్రాలు ‘కె.జి.యఫ్’, ‘777 చార్లీ’, ‘విక్రాంత్ రోణ’, ‘కాంతార’ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో అద్భుత విజయాలను అందుకున్నాయి. ‘కబ్జా’ మూవీ సైతం ఆ సినిమాల లిస్టులో చేరుతోందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై కన్నడ నాట భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మరో బ్లాక్ బస్టర్ పక్కా అని అక్కడి సినీ లవర్స్ భావిస్తున్నారు.
కీలక పాత్రలు పోషిస్తున్న స్టార్ యాక్టర్స్
ఇక ‘కె.జి.యఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో శ్రియా శరన్, కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సముద్రఖని, మురళీ శర్మ, నవాబ్ షా, కబీర్ దుహాన్ సిఒంగ్, దనీష్ అకర్త షఫి, ప్రదీప్ సింగ్ రావత్, కృష్ణ మురళీ పోసాని, ప్రమోద్ శెట్టి, అనూప్ రెవనన్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.టి.బి నాగరాజ్ సమర్పణలో శ్రీ సిద్ధేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతోంది.
Read Also: కొంతమంది దర్శకులు రాజమౌళిని చంపేందుకు కుట్ర చేస్తున్నారు, ఆర్జీవీ సంచలన ట్వీట్