News
News
వీడియోలు ఆటలు
X

Upcoming Movies This Week: 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' సహా ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే...

థియేటర్లు, ఓటీటీల్లో పోటాపోటీగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ వారం సినిమాలు, వెబ్ సిరీస్ లు అన్నీ 19 వ తేదీనే కావడం విశేషం. అవేంటో చూద్దాం...

FOLLOW US: 
Share:

సావిత్రి w/o సత్యమూర్తి'
సీనియర్‌ నటి శ్రీలక్ష్మి, 'కేరింత' ఫేమ్‌ పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సావిత్రి w/o సత్యమూర్తి'. చైతన్య కొండ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మహేంద్ర క్రియేషన్స్‌ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్నారు. 60 ఏళ్ల మహిళకు.. పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే భర్త ఉంటే ఎలా ఉంటుంది అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ నవంబరు 19న థియేటర్స్‌లో విడుదల కానుంది. 
'మిస్టర్‌ లోన్లీ'
విక్కీ, నూరజ్‌, కీయా, లోహిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మిస్టర్‌ లోన్లీ' కూడా . నవంబరు 19న థియేటర్‌లలో విడుదల కానుంది.  ఈ సినిమాకు హరీష్‌ కుమార్‌ దర్శకుడు. కండ్రేగుల ఆదినారాయణ నిర్మాత. ‘అర్జున్‌ రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్‌ 100’ లా యూత్ ని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు మేకర్స్.
'ఊరికి ఉత్తరాన'
నరేన్‌ వనపర్తి, దీపాలి శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఊరికి ఉత్తరాన’ కూడా నవంబరు 19నే విడుదల కానుంది. ఈగల్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటయ్య వనపర్తి నిర్మాత.
'రామ్‌ అసుర్‌'
అభినవ్‌ సర్దార్‌, రామ్‌ కార్తిక్‌, చాందిని తమిళ్‌రాసన్‌, శాని సాల్మాన్‌, శెర్రి అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పీనట్‌ డైమండ్‌’. ఇప్పుడీ టైటిల్‌ను ‘రామ్‌ అసుర్‌’గా మార్చారు. వెంకటేష్‌ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎఎస్‌పి మీడియా హౌస్‌, జీవీ  ఐడియాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఇది కూడా నవంబర్‌ 19నే థియేటర్లలో సందడి చేయనుంది.
ఇవి కూడా నవంబరు 19నే విడుదల
తాన్య దేశాయ్‌, అంకిత్‌రాజ్‌, కావ్య రెడ్డి, వినోద్‌కుమార్‌ నటించిన 'స్ట్రీట్‌లైట్‌' 
విజయ్‌ ధరన్‌, రాశి సింగ్‌, అక్షత సోనావానే  ప్రధాన పాత్రల్లో టి. మహిపాల్‌ రెడ్డి తెరకెక్కించిన 'పోస్టర్‌'
క్రిష్‌ బండిపల్లి, అస్మిత కౌర్‌ జంటగా నటించిన  'రావణ లంక'  
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే
'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'
అఖిల్‌, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. అక్టోబరు 15న వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నవంబరు 19న ఆహా, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.
'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'
జీ5లో ఈ నెల 19 నుంచి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్‌ ప్రసారం కాబోతోంది. నిహారిక కొణిదెల నిర్మించిన సిరీస్‌ ఇది. సంగీత్‌ శోభన్‌, సిమ్రన్‌ శర్మ, తులసి, నరేష్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మహేష్‌ ఉప్పల దర్శకత్వం వహించారు. 
'అద్భుతం'
తేజ సజ్జా, శివానీ రాజశేఖర్‌ జంటగా రూపొందిన చిత్రం ‘అద్భుతం’. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. ప్రశాంత్‌ వర్మ కథ అందించారు. ఈ సినిమా నేరుగా ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌’లో నవంబర్‌ 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 
'ధమాకా'
బాలీవుడ్‌ యంగ్ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో రామ్‌ మధ్వానీ తెరకెక్కించిన చిత్రం 'ధమాకా'. మృణాల్‌ ఠాకూర్‌, అమృత సుభాష్‌, వికాస్‌ కుమార్‌, విశ్వజీత్‌ ప్రధాన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో  19న స్ట్రీమింగ్‌ కానుంది.
Also Read:
అమెజాన్‌ ప్రైమ్‌
నెవర్‌ బ్యాక్‌ డౌన్‌ (హాలీవుడ్‌) నవంబరు 16
ద వీల్‌ ఆఫ్ టైమ్‌ (వెబ్‌ సిరీస్‌) నవంబరు 19
డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌
క్యాష్‌ (హిందీ) నవంబరు 19
చురులీ (మలయాళం) నవంబరు 19
పొన్‌ మాణిక్‌వేల్‌(తమిళం) నవంబరు 19
సోనీ లివ్‌
యువర్‌ హానర్‌ (వెబ్‌ సిరీస్- సీజన్‌‌) నవంబరు 19
ఎంఎక్స్‌ ప్లేయర్‌
మత్స్యకాండ్‌ (తెలుగు వెబ్‌సిరీస్‌)  నవంబరు 19
బుక్‌ మై షో
డోంట్‌ బ్రీత్‌2 (తెలుగు డబ్బింగ్‌) నవంబరు 15
నెట్‌ఫ్లిక్స్‌
టైగర్‌ కింగ్‌(వెబ్‌ సిరీస్‌-2)  నవంబరు 17
బంటీ ఔర్‌ బబ్లీ 2(హిందీ ) నవంబరు 19
హెల్‌ బౌండ్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 19
కౌబాయ్‌ బే బోప్‌ (వెబ్‌ సిరీస్‌)  నవంబరు 19
Also Read: బిజీ డిసెంబర్... అసలు గ్యాప్ లేదుగా..

Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'

Also Read: కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ పోలీస్

Also Read: డిసెంబ‌ర్‌లో కీర్తీ సురేష్ డ‌బుల్ ధ‌మాకా... ఇటు గురి, అటు హిస్టరీ!

Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి  కథియవాడి'

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Nov 2021 05:12 PM (IST) Tags: upcoming telugu movies OTT Movies Most Eligible Bachelor Oka Chinna Family Story Mr Lonely Poster Ram Asur Ravana Lanka Savitri Wife Of Satyamurthy ooriki utharana Adbhutham

సంబంధిత కథనాలు

Ram Charan Sharwanand : శర్వాకు చరణ్ కంగ్రాట్స్ - కొత్త జంటతో ఫోటోలు  

Ram Charan Sharwanand : శర్వాకు చరణ్ కంగ్రాట్స్ - కొత్త జంటతో ఫోటోలు  

Amitabh Bachchan: చెప్పులు లేకుండా ఫ్యాన్స్‌ను కలిసిన అమితాబ్ బచ్చన్, 50 ఏళ్లుగా అలాగే చేస్తున్నారట - ఎందుకంటే..

Amitabh Bachchan: చెప్పులు లేకుండా ఫ్యాన్స్‌ను కలిసిన అమితాబ్ బచ్చన్, 50 ఏళ్లుగా అలాగే చేస్తున్నారట - ఎందుకంటే..

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రావణుడు మిస్సింగ్ - సైఫ్ అలీఖాన్ అందుకే రాలేదా?

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రావణుడు మిస్సింగ్ - సైఫ్ అలీఖాన్ అందుకే రాలేదా?

7:11 PM Movie: మరో టైమ్ ట్రావెల్ సినిమా వస్తోంది - ఉత్కంఠభరితంగా ‘7:11pm’ మూవీ టీజర్!

7:11 PM Movie: మరో టైమ్ ట్రావెల్ సినిమా వస్తోంది - ఉత్కంఠభరితంగా ‘7:11pm’ మూవీ టీజర్!

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

టాప్ స్టోరీస్

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్

చట్టం పరిధిలోనే మార్గదర్శి కేసులో విచారణ- అవసరమైతే మళ్లీ శైలజ, రామోజీరావును ప్రశ్నిస్తాం: ఏపీ సీఐడీ

చట్టం పరిధిలోనే మార్గదర్శి కేసులో విచారణ- అవసరమైతే మళ్లీ శైలజ, రామోజీరావును ప్రశ్నిస్తాం: ఏపీ సీఐడీ

Odisha train accident: ప్రమాదానికి కారణం సిగ్నల్‌ ఫెయిల్యూర్ కాదు, లూప్‌లైన్‌లోకి వెళ్లడమే మిస్టరీ - సీనియర్ అధికారి

Odisha train accident: ప్రమాదానికి కారణం సిగ్నల్‌ ఫెయిల్యూర్ కాదు, లూప్‌లైన్‌లోకి వెళ్లడమే మిస్టరీ - సీనియర్ అధికారి