అన్వేషించండి

Upasana Konidela: గవర్నర్ తమిళిసైతో మెగా కోడలు ఉపాసన - ఎందుకు కలిశారంటే?

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను ఉపాసన కొణిదెల కలిశారు.

Upasana: మెగా కోడలు ఉపాసన కొణిదెల తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్ భవన్‌లో కలిశారు. గురువారం ఉపాసన రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. గిరిజనుల కోసం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఉపాసన అన్నారు.

గిరిపుత్రుల సంక్షేమం, అభివృద్ధి కోసం గవర్నర్‌ తమిళి సై చేస్తున్న పనులు తన మనసును కదిలించాయని ఉపాసన కొణిదెల పేర్నొన్నారు. ఆవిడ చేస్తున్న పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ గవర్నర్‌ను కలిసిన ఫొటోలను తన ఎక్స్ / ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు మెగా కోడలు ఉపాసన. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉన్న గిరిజన గ్రామాలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దత్తత తీసుకున్నారు. తెలంగాణ రాజ్ భవన్ తరుపున నాగర్ కర్నూలు జిల్లాలో ఆరు చెంచు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్న తమిళిసై అక్కడ తరచూ పర్యటిస్తూనే ఉన్నారు. నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. విద్య, వైద్యం వంటి మౌలిక వసతులు కల్పిస్తూ గిరిపుత్రుల జీవన ప్రమాణాలను పెంచుతున్నారు. ఈ విషయంలపై ఉపాసన గవర్నర్‌ను కలిసి ప్రశంసలు తెలిపారు.

మెగా స్టార్‌ చిరంజీవికి కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు మెగా స్టార్ చిరంజీవిని ఎంపిక చేశారు. ఉపాసన తాతగారు, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి 2010లోనే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు తన మామయ్య చిరంజీవి పద్మ విభూషణ్ అందుకోవడంతో ఉపాసన ఆనందంలో మునిగిపోయారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Jay Shah: ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Embed widget