PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి
Pawan Kalyan in Unstoppable 2 : ఒక్క రోజు ముందు బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ 'అన్‌స్టాపబుల్ 2' సందడి ఆహాలో మొదలు కానుంది. ఎపిసోడ్ రిలీజ్ డేట్ మారింది.
అవును... ఒక్క రోజు ముందు 'అన్‌స్టాపబుల్ 2'లో (Unstoppable With NBK Season 2) గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna)తో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సందడి షురూ కానుంది. రేపు రాత్రి నుంచి పవర్ ఫైనల్ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీ వేదిక స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఫిబ్రవరి 2...
గురువారం రాత్రి...
తొమ్మిది గంటల నుంచి!
బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన ఎపిసోడ్ రెండో సీజన్ చివరి ఎపిసోడ్. పవర్ ఫైనల్ అంటూ ఆహా అనౌన్స్ చేసింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, వీడియో గ్లింప్స్ చూస్తే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఎలా సందడి చేశారనేది అర్థమైంది.
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వీడియో గ్లింప్స్‌లో ''నేను కొన్ని మెజర్‌మెంట్స్ (కొలతలు) తీసుకోవాలి'' అని బాలకృష్ణ అంటే పవన్ కళ్యాణ్ నవ్వేశారు. ఇక, 'అన్‌స్టాపబుల్ 2' టీజర్ విషయానికి వస్తే... తనను 'బాల' అని పిలవమని పవన్ కళ్యాణ్ అడగడం... అందుకు పవన్ ''నేను ఓడిపోవడానికి సిద్ధం కానీ పిలవలేను'' అని పవన్ అనడం వైరల్ అయ్యింది. అభిమానులు ఎందుకు ఓట్లు వేయడం లేదనే అంశాన్ని కూడా బాలకృష్ణ అడిగారు.
Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?
ట్రైలర్ విషయానికి వస్తే... బండ్ల గణేష్ డైలాగ్ బాలకృష్ణ నోటి వెంట రావడం... బాలయ్య టాక్ షో ట్రేడ్ మార్క్ డైలాగ్ పవన్ నోటి వెంట రావడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్రివిక్రమ్ ఫ్రెండ్షిప్ గురించి అడిగితే చేయాల్సి వచ్చిందని, రామ్ చరణ్ ఆలనా పాలనా చూస్తూ క్లోజ్ అవ్వాల్సి వచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు. ఇందులో మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా సందడి చేయనున్నారు. 'అమ్మాయిలు, హారర్ సినిమాలు ఒక్కటే' అని అతడు చెప్పడం, ఇంటికి వెళ్ళిన తర్వాత బడిత పూజ ఉంటుందని పవన్ చెప్పడం అభిమానులను ఆకట్టుకున్నాయి.
'తొడ కొట్టి వెళ్లిపో' అని సాయి ధరమ్ తేజ్‌కు బాలయ్య చెప్పారు. అప్పుడు తేజ్ బాలకృష్ణ దగ్గరకు వెళ్లగా ఆయన 'నా తొడ కాదమ్మా నీ తొడ కొట్టాలి' అన్నారు. సాయి ధరమ్ తేజ్ వెళ్లిపోయాక బాలకృష్ణ వివాదాస్పదమైన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి అడిగారు. 'ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?' అని అడిగినప్పుడు దానికి పవన్ చెప్పిన సమాధానాన్ని పూర్తిగా చెప్పలేదు. అలాగే తనకు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వచ్చిన విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు.
రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి!
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఏయే టాపిక్స్ గురించి 'అన్‌స్టాపబుల్ 2'లో మాట్లాడారు? అని సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు... రాజకీయ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ కూడా! ఎందుకంటే... ఇటీవల తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వ వైఖరి సహేతుకంగా లేదంటూ సంఘీభావం ప్రకటించారు. మరోవైపు అమెరికాలో అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్ గురించి వైసీపీ కూడా ఎదురు చూస్తోంది.
Also Read : ఎవరీ ఆషిక? నందమూరి నయా నాయిక గురించి ఆసక్తికరమైన విషయాలు...
View this post on Instagram