By: ABP Desam | Updated at : 21 Apr 2023 05:48 PM (IST)
ఆదివారం ఆర్ ఆర్ ఆర్ టీమ్కు అమిత్ షా విందు
RRR Amit Shah : నాటు నాటు పాటకు ఆస్కార్ గెలుచుకున్న ట్రిపుల్ ఆర్ సినిమా టీంకు అమిత్ షా విందు ఇవ్వనున్నారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న అమిత్ షా.. హైదరాబాద్‌లోనే ఈ విందు ఇవ్వనున్నారు. .ఈ విందు భేటీ దాదాపుగా 40 నిమిషాల సేపు ఉంటుంది. ఆస్కార్ గెలిచినందుకు అమిత్ షా ఆత్మీయ సన్మానం చేయనున్నట్లుగా తెలుస్తోంద. ట్రిపుల్ ఆర్ దర్శకుడు, హీరోలతోపాటు కీలకమైన యూనిట్ మొత్తాన్ని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. దేశానికి గర్వకారణం అయిన విజయం సాధించినందుకు గుర్తుగా ఈ విందు ఏర్పాటు చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని చెబుతున్నారు.
చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను గతంలోనే అభినందించిన అమిత్ షా
నిజానికి ఆర్ ఆర్ ఆర్ టీం ఆస్కార్ అవార్డుల తర్వాత విడివిడిగా ఇండియాకు చేరుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ఇండియాకు వచ్చిన తర్వాత అమిత్ షాను కలిశారు. అలాగే సినిమా ఇంకా ఆస్కార్ విజయం సాధించకముందు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ ను హోటల్‌కు పిలిపించుకుని అభినందించారు. అయితే ఇప్పుడు అధికారికంగా టీం మొత్తానికి సన్మానం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆస్కార్ టీంను సన్మానానిస్తున్న ప్రముఖ సంస్థలు - విదేశాల్లోనూ సన్మానాలు
ఆస్కార్ అవార్డు సాధించినప్పటి నుండి రాజమౌళి టీంకు వరుసగా సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. టాలీవుడ్ మొత్తం హైదరాబాద్ శిల్పకళావేదికలో తెలుగు చిత్రపరిశ్రమ ఘనంగా సత్కరించింది. తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సన్మాన కార్యక్రమం ఓ మంచి జ్ఞాపకం, గర్వించదగ్గ ప్రోత్సాహం అయిందని అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వివిధ నగరాల్లో విదేశాల్లో కూడా సన్మాన కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో సన్మాన సభను ఏర్పాటు చేయనుంది. ఆస్కార్ అవార్డ్ ను అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రం RRR . ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
చరిత్ర సృష్టించిన ఆర్ ఆర్ ఆర్
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది. భారత సినీ చరిత్రలో అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. జపాన్ వంటి దేశాల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. నాటు నాటు పాటు పిల్లలకు కూడా నోటెడ్ అయిపోయింది. ఇంత భారీ విజయం సాధించిన సినిమాకు.. ఆస్కార్ కూడా రావడంతో తిరుగులేకుండా అయినట్లయింది. ఆ సినిమా టీంను గౌరవించుకునేందుకు ప్రభుత్వాలు కూడా పోటీ పడుతున్నాయి.
Krishna Mukunda Murari October 4th: శకుంతలని అవమానించిన ముకుంద- కృష్ణ ఉగ్రరూపం!
Kannur Squad Review - 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?
Nindu Noorella Saavasam October 4th: మేజర్ ను చూసి షాకైన మిస్సమ్మ - మనోహరి నిజస్వరూపం తెలుసుకున్న అరుంధతి!
Prema Entha Madhuram October 4th: ఆర్య ఇంట్లోకి అడుగుపెట్టిన అను - అంజలీ, నీరజ్ పెళ్లి ఆపేస్తారా!
Trinayani October 4th: గడప దాటిన నయని - విశాల్ ప్రాణాలు తీసేందుకు తిలోత్తమ ప్లాన్!
Telangana MIM : MIM మాస్టర్ ప్లాన్ - హంగ్ వస్తే హంగామా తప్పదా ?
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
/body>