అన్వేషించండి

Telugu Movies 2022: గూగూల్‌ సెర్చ్‌లోనూ దక్షిణాది సినిమాల హవా, టాప్-10లో ఏయే సినిమాలు ఏయే స్థానాలంటే..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెడుతూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తున్నాయి. గూగుల్ సెర్చ్ లోనూ టాప్ ప్లేస్ లో నిలుస్తున్నాయి.

కప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే భ్రమలో ఉండేవారు. ఏ రికార్డులు సాధించాలన్నా అక్కడి తీసిన సినిమాలే ముందుండేవి. దక్షిణాదిలో మహా నటులు ఉన్నా ఆ రేంజ్‌లో గుర్తింపుకు నోచుకునే వారు కాదు. సౌత్ లో పెద్ద యాక్టర్లు సైతం బాలీవుడ్ సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు వచ్చినా గొప్పగా ఫీలయ్యేవారు. కానీ, రోజులున్నీ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. ప్రస్తుతం సౌత్ నుంచి వచ్చే సినిమాలు బాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే దక్షిణాది సినిమాలు హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వ్యాల్యూస్ తో వస్తున్నాయి.  

గూగుల్ సెర్చ్ లో తెలుగు, కన్నడ సినిమాల హవా    

2022లో అత్యధికంగా  గూగుల్ లో సెర్చ్ చేసిన టాప్ సినిమాల లిస్టును తాజాగా గూగుల్ విడుదల చేసింది. ఈ లిస్టులో తొలి 5 స్థానాల్లో రెండు స్థానాలను కన్నడ సినిమాలు దక్కించుకోగా, తెలుగు చిత్రం RRR 4వ స్థానంలో ఉంది. దక్షిణాది సినిమాలు దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంఫుల్ ‘కాంతార’ సినిమా. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్ల రూపాయలను సాధించింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగుతో పాటు హిందీలోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్ చేసిన టాప్ 5 లిస్టులో ‘కాంతార’ చోటు దక్కించుకుంది. ‘కాంతర’ సినిమా ఓటీటీలో విడుదలైనా, థియేటర్లలో ఇప్పటికీ ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. కన్నడ నాట కొన్ని చోట్ల థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.

ఇదే లిస్టులో స్థానాన్ని సంపాదించుకున్న మరో కన్నడ సినిమా ‘KGF 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ మూవీ విడదలైన అన్ని చోట్ల అద్భుత విజయాన్న సొంతం చేసుకుంది. యష్ అద్భుత నటనతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 500 కోట్లపైగా వసూళ్లను రాబట్టింది. ‘KGF’ సినిమాతో దేశ వ్యాప్తంగా సత్తా చాటిన ప్రశాంత్ నీల్, అంతకు మించి అన్నట్లుగా ‘KGF 2’ను తెరెక్కించారు. ఈ సినిమా కూడా ఫస్ట్ పార్టుకంటే ఘన విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది కన్నడ సినిమా పరిశ్రమకు ఈ రెండు సినిమాలు కనీ వినీ ఎరుగని రీతిలో క్రేజ్ తీసుకొచ్చాయి. ఇక ‘పుష్ప-2’, ‘RRR’ మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఈ సినిమాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. జపాన్‌లో RRR భారీ వసూళ్లను సాధిస్తోంది. అలాగే, ‘పుష్ప-2’ సైతం రష్యా భాషలో రిలీజ్ అయ్యింది. గురువారం అక్కడి థియేటర్లలో సందడి చేసింది. అయితే, రిజల్ట్ ఏమిటనేది కొద్ది గంటల్లో తెలుస్తుంది. 

టాప్-10 గూగుల్ సెర్చ్ మూవీస్ లిస్ట్ ఇదే

1 – Brahmastra: Part One – Shiva
2 – KGF: Chapter 2
3 – The Kashmir Files
4 – RRR
5 – Kantara
6 – Pushpa: The Rise
7 – Vikram
8 – Laal Singh Chaddha
9 – Drishyam 2
10 – Thor: Love and Thunder

Read Also: క్యాన్సర్ ను జయించి మళ్లీ షూటింగ్స్ లో హంస నందిని బిజీ బిజీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Highlights | ఆర్సీబీ విక్టరీతో సంతోషంలో చెన్నై, ముంబై ఇండియన్స్ | ABP DesamSRH vs RCB Match Highlights | సన్ రైజర్స్ మీద మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ బౌలర్లు | IPL 2024 | ABPVirat Kohli Half Century | SRH vs RCB మ్యాచ్ లో మరో అర్థశతకం చేసిన విరాట్ కొహ్లీ | IPL 2024 | ABPSRH vs RCB Match Highlights | ఉప్పల్ లో సన్ రైజర్స్ కి ఓటమి రుచి చూపించిన ఆర్సీబీ | IPL 2024 | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Megha Akash: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ITR 2024: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
Embed widget