Trinayani Serial Today September 18th: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపని మచ్చిక చేసుకునే పనిలో సుమన.. విశాలాక్షి ఎంట్రీతో తారుమారు!
Trinayani Today Episode విశాలాక్షి ఇంటికి వచ్చి భుజంగ మణిని దక్కించుకోవడానికి ఇంట్లో వాళ్లకి సలహా ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode విక్రాంత్ సుమనతో దారి తెలియగానే ముందు నువ్వు వెళ్లు తర్వాత నేను నీ వెనకాలే వచ్చేస్తా తర్వాత మనం భుజంగ మణి దక్కించుకుంటాం కాబట్టి మన మాటే వింటారని విక్రాంత్ సుమనతో అంటాడు. దాంతో సుమన భర్తని పొగిడేస్తుంది. మీరు చాలా మంచి వాళ్లని అంటుంది.
విక్రాంత్: పంచకమణిని ఎలాగూ దక్కించుకోలేకపోయాం కనీసం భుజంగమణి అయినా సొంతం చేసుకుందాం సుమన.
సుమన: మీరు నా గురించి ఇంతలా ఆలోచిస్తుంటే గుండె నొప్పి వచ్చి పోయేలా ఉన్నాను బుల్లి బావ గారు.
విక్రాంత్: మనసులో నువ్వు పోతే ఈ ఇంటికి పట్టిన శని పోతుందే. నయని వదినకు దారి తెలిసినా ముందు అయితే నిన్నే పంపిస్తానే. దారి మధ్యలో నువ్వు గల్లంతైతే చాలు. వెర్రి సుమన భుజంగమణికి వెళ్లిన అరగంటకే భుజాల మీద నీ పాడె మోసుకెళ్లడం గుర్తొస్తుంది.
నయని, విశాల్, దురంధర, పావనాలు హాల్‌లో ఉంటే హాసిని తన భర్తని లాక్కొచ్చి ఘన కార్యం చేయబోతున్నారని చెప్తుంది. ఏమైందని అందరూ అడుగుతారు. భుజంగ మణిని తన భర్త తీసుకొస్తాడని అంటుంది. వల్లభ కూడా షాక్ అవుతాడు. నేను బతకడం నీకు ఇష్టం లేదా అని అంటాడు. దానికి హాసిని మీరు వీరుడిలా భుజంగ మణి తీసుకొస్తే అందరూ పొగుడుతారని అంటుంది. నా వల్ల కాదని వల్లభ చేతులెత్తేస్తాడు.
గాయత్రీ దేవి గారి వల్లే దారి తెలుస్తుందని అందుకే ఎదురు చూస్తున్నామని నయని అంటుంది. ఇంతలో విశాల్ గజగండకు భుజంగమణి గురించి తెలిస్తే ప్రమాదం అని అంటాడు. ఆ విషయం తిలోత్తమ గజగండకి చెప్తుందని హాసిని అంటుంది. ఇక ఇంట్లో ఎవరి వల్ల వస్తాడో అని అందరూ టెన్షన్ పడతారు. గజగండ ఎలా వచ్చినా అతన్ని కనిపెడితే పంచకమణి కూడా తీసుకోవచ్చని అంటుంది. అందరూ కనిపెట్టడం ఎలా అనే ఆలోచనలో పడతారు.
గాయత్రీ పాప ఆడుకుంటూ ఉంటూ సుమన పాల బాటిల్ పట్టుకొని వచ్చి ప్రేమగా మాట్లాడటం చూసిన దురంధర ఇదంతా కలా నిజమా అని అంటుంది. నువ్వేనా సుమన అని అంటే కాదు నేను గజగండని అని సుమన అంటుంది. దీంతో దురంధర పెద్దగా అరుస్తుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. ఏమైందని అడిగితే సుమనను చూపించి తను సుమన కాదంట గజగండ అంట అని చెప్తుంది. గాయత్రీ పాపకి సుమన ప్రేమగా పాలు తాగించాలని ప్రయత్నించడంతో అనుమానం వచ్చిందని అంటుంది.
విశాల్: సుమన నువ్వు పాపకి పాలు తాగించడం ఏంటి విచిత్రంగా ఉంది.
విక్రాంత్: ఏయ్ పాపని ఏం చేయాలనుకున్నావ్ చెప్పు.
నయని: ఉన్నట్టుండి పాప మీద ఎందుకు ప్రేమ పుట్టిందో చెప్తావా సుమన.
విశాలాక్షి: నేను చెప్తా అమ్మా.
విశాల్: అమ్మా విశాలాక్షి ఎంత కాలం అయిందమ్మా నిన్ను చూసి.
విశాలాక్షి: నిన్ను చూద్దామనే వచ్చాను నాన్న.
వల్లభ: నువ్వు చూడాల్సింది ఫేస్ కాదు తమ్మి చేయి ఒకసారి చేయి చూడు ఎలా వాడిపోయిందో.
విశాలాక్షి: గాయత్రీని మచ్చిక చేసుకొని మణికాంత ప్రాంతానికి పాపని తీసుకెళ్లడానికి సుమన ప్లాన్ చేసింది.
నయని: అక్కడికి సుమన అయినా ఎలా వెళ్తుంది.
అక్క బాధ చూడలేక వెళ్లాలి అనుకున్నానని సుమన అంటుంది. చిన్న పిల్ల వెంట పడ్డావేంటి అని అందరూ సుమనను అంటారు. భుజంగమణిని తీసుకురావడం అంత సులభం కాదని విశాలాక్షి అంటుంది. ఇక విశాలాక్షి పంచకమణి, భుజంగ మణి గురించి తెలియడంతో అందరూ షాక్ అవుతారు. తాను చెప్పినట్లు చేస్తే గజగండని పట్టి బంధించొచ్చని విశాలాక్షి చెప్తుంది. తన వెంట తీసుకొచ్చిన నగల మూట అందరికీ చూపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. అందులో రెండు గాజులను నయనికి తీసుకోమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.