అన్వేషించండి

Trinayani Serial Today September 11th: 'త్రినయని' సీరియల్: పాపే గాయత్రీదేవి అని తిలోత్తమ అనుమానం.. నయని కోసం పాప మీద విష ప్రయోగం! 

Trinayani Serial Today Episode గాయత్రీ పాప చేయి తాకగానే తిలోత్తమకు షాక్ కొట్టడంతో పాపే గాయత్రీ దేవి అని అది నిర్ధారించుకోవడానికి పాప మీద విషప్రయోగం చేయాలనుకోవడతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode గాయత్రీ పాపని పావనా మూర్తి హాల్‌లో ఆడిస్తుంటాడు. దురంధర, తిలోత్తమ, వల్లభ అక్కడికి వస్తారు. గాయత్రీ పాప వల్లే తిలోత్తమ చేయి నయం అయినట్లు తెలిసిందని పావనా అంటాడు. 

తిలోత్తమ: అవును పావనమూర్తి. పాప ఇన్ని సార్లు నిన్ను కసురుకునేదాన్ని కానీ ఈ రోజు మెచ్చుకుంటున్నాను. నీకు థ్యాంక్స్ కూడా.
దురంధర: ఊరికే థ్యాంక్స్ కాదు వదిన. గాయత్రీ షేక్ హ్యాండ్ బాగా ఇస్తుంది. చేయి ఇవ్వు వదిన.
పావనా: గాయత్రీ పాప పద మనం వెళ్దాం.
తిలోత్తమ: ఒక్క నిమిషం పావనమూర్తి పాపకి షేక్ హ్యాండ్ ఇవ్వనివ్వు. గాయత్రీ షేక్ హ్యాండ్ ప్లీజ్.
పావనా: అక్కయ్య మనం ఓ గేమ్ ఆడుదాం నేను పాపని పట్టుకొని పరుగెడతా నువ్వు పాపని పట్టుకొని షేక్ హ్యాండ్ ఇవ్వాలి. 
దురంధర: ఓరి మీ వేషాలో వదినకు ఇబ్బంది పెడుతున్నారు కదా అండీ.
తిలోత్తమ: పర్వాలేదులే దురంధర పాప సరదా పడుతుంది కదా.

తిలోత్తమ పరుగెడుతూ పాప చేయి పట్టుకోగానే తిలోత్తమకు షాక్ కొడుతుంది. (గాయత్రీ దేవి చేయి తగిలితే తిలోత్తమకు షాక్ కొడుతుంది. పునర్జన్మలో ఉన్న గాయత్రీదేవే గాయత్రీ పాప కాబట్టి తిలోత్తమకు షాక్ కొడుతుంది) అందరూ అక్కడికి వస్తారు. షాక్ కొట్టిందని తిలోత్తమ చెప్తుంది. గాయత్రీ పాప చేతిని తాకగానే షాక్ కొట్టిందని తిలోత్తమ చెప్తుంది. అందరూ షాక్  అయిపోతారు.

సుమన: అప్పుడెప్పుడో చెప్పారు గాయత్రీ అత్తయ్య పునర్జన్మ ఎత్తి తన కుడి చేతిని తిలోత్తమ అత్తయ్య కుడి చేతికి టచ్ చేస్తే షాక్ కొడుతుందని. 
హాసిని: ఇప్పుడేమంటావ్ చిట్టీ ఈ పాపే గాయత్రీ అత్తయ్య అంటావా.
సుమన: నేను ఏదో అన్నాను అని మీరు అలా ఒప్పేసుకోకండి. 
నయని: అత్తయ్య నిజంగానే గాయత్రీ పాప చేయి తగిలి మంట వచ్చిందా. 

పావనా మూర్తి పరుగెత్తినప్పుడు బాడీలో కరెంట్ పాస్ అవుతుందని అందువల్ల షాక్ కొట్టుంటుందని అంటాడు. విక్రాంత్ కూడా సైన్స్ ప్రకారం అలా అవుతుందని చెప్తాడు. తిలోత్తమ వాళ్లు అది తమకు తెలుసని కానీ అంత గట్టిగా షాక్  కొట్టడం ఏంటని అడిగితే హాసిని పావనా ఇద్దరూ పాపని పట్టుకొని పరుగెత్తి కొని షాక్ కొట్టినట్లు నటిస్తారు. మొత్తానికి అందరినీ కన్ఫ్యూజ్ చేసి కవర్ చేస్తారు. పాపని తీసుకొని పావనా, హాసిని వెళ్లిపోతారు. రాత్రి వల్లభ తల్లి చేతికి వెన్న పూస్తూ సేవలు చేస్తాడు. హాసిని కూడా అక్కడికి వస్తుంది. గజగండ దగ్గరకు వెళ్లి మీ చేయి నయం చేసుకున్నారు కానీ విశాల్ సంగతి ఏంటి అని అడుగుతుంది. ఇక నయని కూడా వస్తుంది. 

నయని: అత్తయ్య ఆ మణి గురించి కాదు కానీ మీ చేతికి మంట ఎలా వచ్చిందా అని అడుగుదామని వచ్చాను. 
హాసిని: అయ్యో చెల్లికి అనుమానం వచ్చింది అంటే ఒక పట్టాన వదలదు ఈ బ్రహ్మ రాక్షసి ఏం చెప్పి చస్తుందో.
తిలోత్తమ: గాయత్రీ పాప షేక్ హ్యాండ్ ఇచ్చింది కానీ అప్పుడు ఏం కాలేదు హాసిని అన్నట్లు మిస్ ఫైర్ అనుకుంటా. 
వల్లభ: నయని వాళ్లు వెళ్లిన తర్వాత.. మమ్మీ పాప చేయి తగిలిన తర్వాతే కదా మంట వచ్చింది మరి ఎందుకు నయనితో అబద్ధం చెప్పావ్.
తిలోత్తమ: నయని కంటే ముందు మనకు నిజం తెలియాలి. తెలుసుకుంటాను.

ఉదయం తిలోత్తమ, వల్లభలు గజగండ దగ్గరకు వస్తారు. గాయత్రీ పాప కుడి చేయి తగలగానే తనకు షాక్ కొట్టినట్లు అయిందని మంట కూడా వచ్చిందని తిలోత్తమ గజగండకి చెప్తుంది. గజగండ గాయత్రీ దేవిని వదలను అని తన కొడుకుని చంపిన ఆమె అంతు చూస్తా అంటాడు. గాయత్రీ పాపే గాయత్రీ దేవి అయితే మన ఇద్దరి పగ ఒకే సారి తీరుతుందని తిలోత్తమ అంటుంది. నిజం తెలుసుకోవడానికి పాప మీద విష ప్రయోగం చేయాలని పాప నయని బిడ్డ కాకపోతే మీ కుట్ర పసిగడుతుందని లేదంటే కనిపెట్టలేదు అని చెప్తాడు. పాప ఒక వేళ చనిపోతే గాయత్రీ దేవి చనిపోతుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: ముత్యాలుకి కిడ్నీ ఇచ్చి కాపాడింది అమ్మాయిగారే అని చెప్పేసిన రాజు.. మొత్తం నాశనం చేసిన విజయాంబిక!

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Kia Price Hike: జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Kia Price Hike: జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Ram Charan - Salman Khan: రామ్ చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఉన్నాడా? డైరెక్టర్ ఏం చెప్పాడంటే?
రామ్ చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఉన్నాడా? డైరెక్టర్ ఏం చెప్పాడంటే?
Embed widget