అన్వేషించండి

Trinayani Serial Today October 20th: 'త్రినయని' సీరియల్: నయనిని చంపేది హాసినినే.. గాయత్రీ పాప ఓదార్పు వెనక అర్థమేంటో?

Trinayani Today Episode నయనికి ప్రాణ గండం హాసిని వల్ల వస్తుందని విశాలాక్షి బుక్‌లో చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode నయనికి గండం ఎవరి వల్ల వస్తుందో చెప్పమని పావనా మూర్తి విశాలాక్షికి అడుగుతాడు. అలా చెప్తే నీకు ఇంకా గొప్పగా చూసుకుంటామని సుమన అంటుంది. దానికి విశాలాక్షి ఎవరి వల్ల గండం వస్తుందో చెప్తానని అందుకు తాను చదువుతున్న పుస్తకం చూపించి అమ్మవారికి తలచుకొని పుస్తకం తెరిస్తే పేరు  కనిపిస్తుందని అంటుంది. హాసిని పుస్తకం తీసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని బుక్ చూసి పెద్దగా అరుస్తూ బుక్ విసిరేస్తుంది. 

నయని: నా ప్రాణం తీయాలి అనుకున్న వారు ఎవరు అక్క.
వల్లభ: ఏం పేరు వచ్చిందో ఏమో మమ్మీ హాసిని అలా వచ్చింది.
హాసిని: పేరు.. పే.. పే..  పేరు. 
విశాలాక్షి: నయనమ్మకి మృత్యు గండం రావడానికి కారణం ఎవరో పేరు చూశావు కదా చెప్పమ్మ
హాసిని: వద్దు తల్లి నేను చెప్పమంటే చెప్పను. ఎవరి పేరు వచ్చిందో చెప్తే మీరంతా తట్టుకోలేరు. 
వల్లభ: మమ్మీ పేరా.
తిలోత్తమ: ఇడియట్ నా పేరు ఎందుకు వస్తుంది.
విశాల్: నయని పుస్తకం నీ చేతిలో ఉంది కదా నువ్వు చూసి చెప్పు.
నయని: అలాగే బాబుగారు. పేరు లేదు పుస్తకం ఇంతకు ముందు లానే ఉంది.
విక్రాంత్: విశాలాక్షి ఇది నీ గారడీ అయితే తక్షణమే ఆపేయ్.
విశాలాక్షి: అయ్యో చిన్నాన్న నేను ఎవరి విషయంలో అయినా ఆట పట్టిస్తాను కానీ నాకు అన్నం పెట్టిన నయనమ్మ విషయంలో తప్పు చేయను.
విశాల్: వదినా మీరు ఇప్పుడు ఆ పేరు చెప్పకపోతే నా మీద ఒట్టే. నువ్వు చెప్తున్నావ్ అంటే.
హాసిని: మీరు ఏమనుకుంటారో ఏమో కానీ నేను కూడా నమ్మలేకపోతున్నాను. చెల్లికి ప్రాణ గండం రావడానికి కారకురాలిని నేనే అని నా పేరు వచ్చింది.
పావనా: నువ్వా అమ్మా.
హాసిని: ఏడుస్తూ చెప్పా కదా చూడండీ మీరంతా నన్ను ఎలా చూస్తున్నారో.
నయని: అక్కా బాధ పడకు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నువ్వు అయితే నాకు ఎలాంటి నొప్పి బాధ లేకుండా నా ప్రాణాలు నలుపుతావు.
హాసిని: చెల్లి ఇంకోసారి అలా అంటే ముందు నేను చచ్చిపోతాను. అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. 

సుమన దేవుడికి దండం పెట్టుకొని నన్ను కాపాడారు మీరు అని అన్ని దేవుల్ని తలచుకుంటుంది. ఆ పుస్తకంలో నా పేరు వచ్చి ఉంటే అందరూ తనని ముందే చంపేసేవాళ్లని విక్రాంత్‌తో అంటుంది. హాసిని వదిన పేరు రావడం ఏంటో అని విక్రాంత్ అంటాడు. దానికి సుమన నమ్మినవారే మోసం చేస్తారు కదా అని అంటుంది. ఇక తన అదృష్టానికి తన అక్క అడ్డుగా ఉందని తనే లేకపోతే నాకు ఆస్తి వస్తుందని అంటుంది. బాల్యానీలో హాసిని ఏడుస్తూ ఉంటే గాయత్రీ పాప వెళ్లి హాసిని కన్నీళ్లు తుడుస్తుంది.

ఇంతలో నయని, విశాల్ కూడా అక్కడికి వస్తారు. ఎందుకు అలా ఉన్నావ్ అక్క ఏమైంది అని అడుగుతుంది. దానికి హాసిని ఏంటి చెల్లి అలా అంటున్నావ్ నీ ప్రాణాలు నావల్ల పోతాయి అంటున్నారు కదా మరి నువ్వు నాతో ఇంత ప్రేమగా ఎలా మాట్లాడుతున్నావ్ అంటుంది. నా వల్ల నీకు ఏమైనా జరిగితే జీవితాంతం నేను పశ్చాత్తాపపడుతూనే ఉంటానని ఏడుస్తుంది. ఎక్కువ ఆలోచించొద్దని నయని అంటుంది. విశాల్ కూడా హాసినికి ధైర్యం చెప్తాడు. గాయత్రీ పాప నీ దగ్గరకు వచ్చిందంటే అర్థం చేసుకో నీకు ఏ కల్మషం లేదని అంటుంది. మరోవైపు తిలోత్తమ వల్లభతో విషం తీసుకొని రమ్మని చెప్తుంది. విషం తీసుకొని తిలోత్తమ దగ్గరకు వస్తాడు. ఆ విషయాన్ని నయని కోసం వాడుతానని హాసిని చేత నయని మీద విష ప్రయోగం చేస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమితో గొడవ పెట్టుకున్న నక్షత్ర – నక్షత్రను గగన్‌తో తిట్టించిన భూమి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 1st Test Highlights: వరుణుడు కరుణించలేదు, సంచలనాలు జరగలేదు - తొలి టెస్టులో భారత్ ఓటమి
వరుణుడు కరుణించలేదు, సంచలనాలు జరగలేదు - తొలి టెస్టులో భారత్ ఓటమి
Revanth Reddy: త్వరలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1, లీడర్లకు 2 లక్షణాలు తప్పక ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
త్వరలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1, లీడర్లకు 2 లక్షణాలు తప్పక ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
Kadapa Crime News: కడప జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి, గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్
కడప జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి, గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్
HYDRA News: మీ ఇల్లు కూల్చేందుకు బుల్డోజర్ వచ్చిందా ?  ఆ పని చేస్తే చాలన్న రేవంత్ రెడ్డి - హైడ్రా స్పష్టత
మీ ఇల్లు కూల్చేందుకు బుల్డోజర్ వచ్చిందా ? ఆ పని చేస్తే చాలన్న రేవంత్ రెడ్డి - హైడ్రా స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మసీదుకు హిందూ సంఘాలు, ముత్యాలమ్మ గుడిపై డీసీపీ సంచలన నిజాలుKTR Comments: రేవంత్ రెడ్డికి బండి సంజయ్ మద్దతు - కేటీఆర్సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాలపై లాఠీ ఛార్జ్ఆ లిక్కర్‌తో హెల్త్ పాడైంది, ఈ రూ.100 మందు బాగుంది

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 1st Test Highlights: వరుణుడు కరుణించలేదు, సంచలనాలు జరగలేదు - తొలి టెస్టులో భారత్ ఓటమి
వరుణుడు కరుణించలేదు, సంచలనాలు జరగలేదు - తొలి టెస్టులో భారత్ ఓటమి
Revanth Reddy: త్వరలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1, లీడర్లకు 2 లక్షణాలు తప్పక ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
త్వరలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1, లీడర్లకు 2 లక్షణాలు తప్పక ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
Kadapa Crime News: కడప జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి, గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్
కడప జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి, గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్
HYDRA News: మీ ఇల్లు కూల్చేందుకు బుల్డోజర్ వచ్చిందా ?  ఆ పని చేస్తే చాలన్న రేవంత్ రెడ్డి - హైడ్రా స్పష్టత
మీ ఇల్లు కూల్చేందుకు బుల్డోజర్ వచ్చిందా ? ఆ పని చేస్తే చాలన్న రేవంత్ రెడ్డి - హైడ్రా స్పష్టత
Naga Chaitanya Sobhita : ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి శోభిత ఫోటో షేర్ చేసిన నాగచైతన్య.. లుక్​, క్యాప్షన్ అదిరిందిగా
ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి శోభిత ఫోటో షేర్ చేసిన నాగచైతన్య.. లుక్​, క్యాప్షన్ అదిరిందిగా
Delhi Blast News: ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు, ఓ కారు ధ్వంసం - హై అలర్ట్
ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు, ఓ కారు ధ్వంసం - హై అలర్ట్
IND Vs NZ 1st Test Highlights: వరుణుడు కరుణిస్తాడా? లేక టీమిండియా 20 ఏళ్ల రికార్డును తిరగరాస్తుందా!
వరుణుడు కరుణిస్తాడా? లేక టీమిండియా 20 ఏళ్ల రికార్డును తిరగరాస్తుందా!
NTR Style Mutton Pulao : ఎన్టీఆర్ స్టైల్ మటన్ పలావ్.. సండే స్పెషల్​గా హీరో రెసిపీని ఫాలో అయిపోండి
ఎన్టీఆర్ స్టైల్ మటన్ పలావ్.. సండే స్పెషల్​గా హీరో రెసిపీని ఫాలో అయిపోండి
Embed widget