Trinayani Serial Today November 27th: 'త్రినయని' సీరియల్: గాయత్రీ దేవి ఆత్మని చూడలేకపోయిన త్రినేత్రి... నువ్వు నా భార్యవి కాదన్న విశాల్!
Trinayani Today Episode త్రినేత్రి గాయత్రీ దేవి ఆత్మని చూడలేకపోవడంతో అందరూ ఇంట్లో ఉన్నది నయని కాదని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode తిలోత్తమ గాయత్రీ పాప పాలలో మత్తు మందు కలిపేస్తుంది. త్రినేత్రి తెలియక ఆ పాలను పాపకి ఇస్తుంది. పాప పాలు తాగేస్తుంది. పాలు తాగిన కొద్ది సేపటికే పాప మత్తుతో పడిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. తిలోత్తమ కూడా నటించేస్తుంది. విశాల్ పాపని పట్టుకొని ఏడ్చేస్తాడు. వల్లభ పాలలో ఏమైనా కలిపావా అని త్రినేత్రిని అడుగుతాడు. పాపకి ఏమైందా అని అందరూ టెన్షన్ పడతారు.
త్రినేత్రి పాపని పట్టుకొనే టైంకి తిలోత్తమ ఆపి నీ వల్లే పాపకి ఇలా అయింది ఇప్పుడు పాపని ఎత్తుకొని ఉన్న ప్రాణం తీసేయాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. నయని ఎందుకు అలా చేస్తుందని విశాల్ అడుగుతాడు. పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి అని బయల్దేరుతారు.
తిలోత్తమ: అక్కర్లేదు. పాప మత్తులోకి జారుకోగానే గాయత్రీ దేవి అక్క ఆత్మ ప్రత్యక్షమైంది నాన్న.
విశాల్: నయని అమ్మ వచ్చిందా
త్రినేత్రి: బాబుగారు ఎవరి అమ్మ ఆవిడ చనిపోయింది అన్నారు కదా.
పావనా: ఆత్మని నువ్వు చూస్తావ్ కదమ్మా
త్రినేత్రి: నేను ఆత్మని చూడటం ఏంటి.
వల్లభ: అంటే నీకు పెద్దమ్మ ఆత్మ కనిపించడం లేదా.
త్రినేత్రి: మీరు పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్లకుండా ఏం మాట్లాడుతున్నారు. ఆత్మ కనిపించడం ఏంటి.
విక్రాంత్: బ్రో నాకు ఏదో తేడాగా ఉందంటే మీరు నమ్మడం లేదు.
సుమన: పూటకొకలా మాట్లాడుతుంటే సర్దుకుపోయాం కానీ ఇప్పుడు తను పెద్దత్తయ్యని చూడటం లేదంటే తను మా అక్కే కాదు.
Also Read: సత్య ఉచ్చులో మహదేవయ్య పడతాడా.. డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటాడా!
అందరూ గాయత్రీ దేవిని అడిగి విషయం తెలుసుకోమని తిలోత్తమకు చెప్తారు. ఇక్కడున్నది ఎవరు అని తిలోత్తమ అడిగితే ఆత్మ తాను నా కోడలు నయనినే అని చెప్తుంది. దాంతో తిలోత్తమ ఇదేంటి ఇలా అక్క చెప్పిందని అనుకుంటుంది. అమ్మ ఏం చెప్పిందని విశాల్ తిలోత్తమను అడిగితే తను నయని కాదని అక్క చెప్పిందని తిలోత్తమ మాట మార్చి చెప్తుంది. దాంతో వల్లభ నువ్వు ఎవరో మా పెద్ద మరదల్ని ఏం చేశావని ప్రశ్నిస్తుంది. మా అక్కకి భయపడాలి కానీ దీనికి ఎందుకు అని సుమన అంటే సుమన చెంప పగలగొడుతుంది త్రినేత్రి. గాయత్రీ దేవి తిలోత్తమతో నువ్వు నా కోడలు కాదని చెప్పినా తను ఎలా విశ్వరూపం చూపిస్తుందో అంటుంది.
ఇక తిలోత్తమ తనకు తాను నయని అని తేలే వరకు నయని అని చెప్పనని అనుకుంటుంది. గాయత్రీదేవి ఆత్మ తాను నయనినే అపార్థం చేసుకోవద్దని అంటుంది కానీ ఎవరికీ వినిపించదు. వినింపించినా తిలోత్తమ చెప్పదు. నా కొడుకుకి నిజం చెప్పమని గాయత్రీ దేవి ఎంత ప్రాధేయపడినా తిలోత్తమ ఏం చెప్పదు. ఇక ఆత్మ నయని నయని అని పిలుస్తుంది ఎందుకు నన్ను చూడటం లేదు అని అనుకుంటుంది. విశాల్ త్రినేత్రితో నువ్వు నా కన్న తల్లి ఆత్మని చూడలేకపోతున్నావా నువ్వు చూడకపోతే నువ్వు నా భార్య నయని కాదని నేను కూడా ఒప్పుకోవాల్సి వస్తుందని అంటాడు. దాంతో త్రినేత్రి కన్నీరు పెట్టుకుంటుంది. త్రినేత్రి బాధతో ఏడుస్తూ వెళ్లిపోతుంది. విశాల్‌తో తిలోత్తమ, వల్లభలు మాట్లాడుతారు. త్రినేత్రిని ఇంటి నుంచి పంపేయని చెప్తే తను నయనినే అని విశాల్ చెప్తాడు. మా అమ్మ నయనితో మాట్లాడుతుందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకి మల్లెపూలు ఇచ్చిన కార్తీక్.. దీపని చంపడానికి జ్యోత్స్న ప్లాన్!