Trinayani Serial Today November 23rd: 'త్రినయని' సీరియల్: త్రినేత్రిని ప్రశ్నించిన గురువుగారు.. త్రినేత్రి, నయని వేరు వేరని గ్రహించిన గురువుగారు!
Trinayani Today Episode గురువుగారు త్రినేత్రి, నయని వేరు వేరు వ్యక్తులని గ్రహించి దేహం ఒకటి ప్రాణం ఒకటి అని మాట్లాడటంలో ఇంట్లో అందరూ కన్ఫ్యూజ్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode త్రినేత్రితో గురువుగారు మీ అమ్మానాన్న ఎవరు అని అడిగితే త్రినేత్రి ఆలోచించి గుర్తు రావడం లేదని చెప్తుంది. దానికి సుమన నాన్న చిన్నప్పుడే చనిపోయారు అమ్మని మర్చిపోయావా అక్క అని సుమన అంటుంది. దానికి విక్రాంత్ నువ్వేం గుర్తు చేయనవసరం లేదు సమస్య వస్తుందని కూడా చెప్పకుండా ఆగిపోయింటుందని అంటాడు.
విశాల్: ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు.నయనికి గుర్తు లేదంటే ప్రమాదం జరగడానికి ముందు గతం అంతా జ్ఞాపకం లేదని అనుకుంటాను.
గురువుగారు: నయనికి తెలుసు త్రినేత్రికి తెలీదు విశాలా.
పావనా: అదేంటి స్వామి.
హాసిని: కొద్ది సేపు చెల్లి అందరితో కలివిడిగా మాట్లాడుతూ వరసలు పెట్టి పిలుస్తుంది.
గురువుగారు: అప్పుడు అన్ని విషయాలు తనకు గుర్తుంటాయి. ఏం చేయాలో అర్థమైంది.
తిలోత్తమ: త్రినేత్రి వెళ్తుంటే ఆగు ఆగు గురువుగారు నీ సంగతి తేల్చేద్దాం అన్నారు కదా.
త్రినేత్రి: విసిగిస్తే మీ సంగతి తేల్చాల్సి వస్తుంది.
సుమన: చూశారా మొన్నటి నుంచి ఇదే తీరు.
గురువుగారు: పది నిమిషాలు ఆగండి అందరి అనుమానాలు నివృత్తి చేస్తాను.
తిలోత్తమ: గురువుగారు ఏం చేయబోతున్నారో కొద్దిగైనా గెస్ చేయాలి వల్లభ.
వల్లభ: ఆయన మాటలే అర్థం కావు ఇంకా ఆయన ఆలోచించేది ఏం అర్థమవుతుంది. తనే తిను తినే తను అని గురువుగారు ఉల్టా పుల్టా మాట్లాడితే ఎలా.
తిలోత్తమ: ఆయన మహానుభావులు దివ్యదృష్టితో చూసి చెప్తారు. ఆయన మాట్లాడే మాటల్లో హింట్ ఉంటుంది. అది మనం కనుక్కోగలిగితే త్రినేత్రిని త్వరగా వదిలించుకోవచ్చు.
మరోవైపు దేవీపురంలో బామ్మ పోలీస్ స్టేషన్‌కి వెళ్లబోతే ఎదురుగా పోలీస్ ఆయన కనిపిస్తారు. పోలీస్ ఆయన దగ్గరకు బామ్మ వెళ్తుంటుంది. ఇక పోలీస్ ఆయన ముక్కోటితో రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది ఆ వివరాలు తెలుసా అని ముక్కోటిని అడుగుతారు. ముక్కోటి తన బండారం బయట పడిపోతుందని బయపడతాడు. బామ్మ వచ్చే టైంకి పోలీసు వెళ్లిపోతారు. ముక్కోటిని చూసి పోలీసాయన్ని ఆపరా అంటుంది. త్రినేత్రి గురించి చెప్దామంటే తను చనిపోయింది కదా అని ముక్కోటి అంటాడు. దాంతో బామ్మ ముక్కోటిని తిట్టి పోలీసులకు కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్తుంది.
గురువుగారు హాల్‌లో కూర్చొంటారు. అందరూ వస్తారు. గురువుగారు నయనిని పిలవమని అంటే అందరూ మేం పిలవము అంటే విశాల్ పిలుస్తాడు. విశాల్ తప్ప ఎవరు ఆ పేరుతో పిలిచినా ఊరుకోదని అంటుంది. ఇక విశాల్ త్రినేత్రితో పది నిమిషాలు పళ్లెత్తు మాట అనకుండా గురువుగారు అడిగిన దానికి సమాధానాలు చెప్పమని అంటాడు. ఇక గురువుగారు అమ్మవారి సాక్షిగా సమాధానాలు చెప్పమని అంటాడు. ఇక వయసు అడిగితే త్రినేత్రి 21 అని చెప్తుంది. అందరూ నయని వయసు 25 అని అంటారు.
త్రినేత్రి: మాట దాచేయొచ్చు కానీ దేహానికి ఉండే వయసు తగ్గించలేం కదా.
గురువుగారు: సత్యం నయని చెప్పిందే నిజం దేహానికి ఉన్న వయసు 21నే.
వల్లభ: అంటే తనకు పాతికేళ్లు లేవు అంటారా.
గురువుగారు: అవును.
పావనా: గాయత్రీ, గానవీలను కన్నప్పుడే నయని వయసు 22 స్వామి.
గురువుగారు: కానీ ఇప్పుడు వయసు 21 ఏళ్లే.
వల్లభ: పోయింది గురువుగారి మతి పోయింది.
విశాల్: ఏంటి అన్నయ్య ఆ మాటలు.
గురువుగారు: ఆ ఫొటోలో ఉన్నది ఎవరమ్మా.
త్రినేత్రి: విశాల్ బాబుగారి తల్లిగారు.
గురువగారు: ఉన్నారా లేరా ఇప్పుడు
త్రినేత్రి: లేరని చెప్పింది హాసిని అక్క.
గురువుగారు: అమ్మా త్రినేత్రి ఆ అమ్మ మళ్లీ పుట్టిందని నీకు తెలుసా.
త్రినేత్రి: తెలీదు.
తిలోత్తమ: వెరీ ఇంట్రస్టింగ్..
విక్రాంత్: మనసులో అంటే ఇంట్లోకి వచ్చింది వదిన కాదా.
విశాల్: నయని అమ్మ తెలీకపోవడం ఏంటి గాయత్రీ పాపగా మళ్లీ పుట్టింది కదా.
త్రినేత్రికి ఇంకా పెళ్లి కాలేదు విశాల్‌ని పెళ్లి చేసుకోవాలని వచ్చిందని హాసిని అంటుంది. దానికి గురువుగారు తన దారిలోనే వెళ్లి నిజం తెలుసుకోవాలి అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: చక్రి హగ్ చేసుకోగానే క్రిష్ ఎమోషనల్.. మామ కాని మామ అసలు రంగు బయట పెట్టడానికి సత్య ప్లాన్!