Trinayani Serial Today November 20th: 'త్రినయని' సీరియల్: కోమాలో నయని ఎక్కడున్నట్లు.. తల పట్టుకున్న విక్రాంత్.. కన్ఫ్యూజన్.. కన్ఫ్యూజన్!
Trinayani Today Episode డాక్టర్ చనిపోవడంతో కోమాలో ఉన్న నయనిని ఎక్కడ దాచిందో అని విక్రాంత్ టెన్షన్ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode డాక్టర్ గురించి విక్రాంత్ నర్స్‌ని అడిగితే డాక్టర్ సారిక నిన్న హార్ట్ అటాక్‌తో చనిపోయిందని నర్స్ చెప్తుంది. దాంతో విక్రాంత్ షాక్ అయిపోతాడు. కోమాలో ఉన్న తన వదిన నయని ఎక్కడ ఉంచారని అడుగుతాడు. సారిక డాక్టర్ వేరు హాస్పిటల్‌కి షిఫ్ట్ చేస్తానని చెప్తారు కానీ ఏ హాస్పిటల్‌లో ఉంచారో తెలీదని నర్స్ చెప్తుంది. దాంతో విక్రాంత్ తల పట్టుకుంటాడు.
విక్రాంత్: ఇంటికి వచ్చింది వదినేనా లేక అలా ఉన్న ఇంకా ఎవరైనానా.. నయం అయి వచ్చిందా లేదంటే మతిస్థిమితం లేకపోయే సరికి అలా ప్రవర్తిస్తుందా. ఏం అర్థం కావడం లేదు.
నయని ఇళ్లంతా శుభ్రం చేసి గాయత్రీ పాపకి తినిపిస్తుంది. విశాల్ ఫైల్స్ అన్ని సర్దుతుంది. నయని హడావుడి చూసి వల్లభ, తిలోత్తమ, సుమన, పావనలు బిత్తర పోతారు. విశాల్, హాసినిలు వస్తారు.
తిలోత్తమ: విశాల్ నీ భార్య అని నవ్వు ఏం పట్టించుకోవడం లేదు కానీ మాకు మాత్రం తను నయని ఏనా కాదా అని అనుమానంగానే ఉంది.
సుమన: ఊరుకోండి అత్తయ్య అసలే మా అక్క తలకి గాయం అయి ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. మీరన్నది వింటే కరిచినా కరిచేస్తుంది.
వల్లభ: అవును మమ్మీ నిన్నటి నుంచి చూస్తున్నాం కదా ఒక్కర్తే మాట్లాడుకుంటుంది.
హాసిని: చెల్లికి కాదు మీకు పిచ్చి పట్టినట్టు ఉంది. ఇంటి ఇళ్లాలు తన పని తాను చేసుకుంటే తప్పేంటి.
విశాల్: విక్రాంత్ మీ వదిన ముందులా లేదని వింతగా ప్రవర్తిస్తుందని అందరూ అంటున్నారు
విక్రాంత్: మనసులో నాకు అనుమానంగా ఉందని అంటే నువ్వు ఫీలవుతావేమో బ్రో.
నయని: బాబుగారు నేను పూర్తిగా కోలుకున్నాను. యాక్సిడెంట్ అయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా దాని గురించే ఎందుకు మాట్లాడుతున్నారు.
విక్రాంత్: వదినా మీకు తల నొప్పిగా ఏం లేదా
నయని: ఎందుకు ఉంటుంది.
విక్రాంత్: వదినకు యాక్సిడెంట్ అయిన తర్వాత తలకి గాయం అయింది నాలుగు రోజుల్లో నయం అయ్యే గాయం కాదు అది.
నయని: మనసులో విక్రాంత్ బాబు మీరు చాలా తెలివైన వారు తిలోత్తమ అత్తయ్య వాళ్లు అనుమానిస్తే మీరు మాత్రం ఆలోచిస్తారని నాకు తెలుసు. ఇప్పుడు నా తలకు అయిన గాయాన్ని చూపించమంటే నేను ఎలా చూపించను.
విక్రాంత్: వదినకు ఆయన గాయం పూర్తిగా తగ్గడానికి కనీసం నెల అయినా పడుతుంది. వదినా ఇలా అడుగుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి కానీ ఒకసారి మీ తలకు అయిన గాయం చూపిస్తారు.
విశాల్: రేయ్ నువ్వు ఇలా అడిగితే.
విక్రాంత్: మరోసారి సారీ అన్నయ్య.
తిలోత్తమ: నాన్న విశాల్ యాక్సిడెంట్ అయి గాయాల పాలైన నీ భార్య మూడు రోజుల్లో కళ్లు తెరిచినా బాగున్ను అనుకున్నాం అలాంటిది రెండు రోజుల్లో ఇంత హుషారుగా ఉందంటే అనుమానించాల్సిందే.
నయని: నన్ను అనుమానిస్తున్నారా అత్తయ్య.
సుమన: తప్పదక్కా తప్పుగా అనుకోకు. నిన్ను అభిమానించే నా భర్తే అలా అడుగుతున్నారు అంటే ఇది చిన్న విషయం కాదు ఇందులో ఏదో పెద్ద విషయమే ఉంటుంది.
హాసిని: కథ లేదు ఏం లేదు కొత్త సమస్యలు సృష్టించాలి అనుకుంటున్నారా. విక్రాంత్ ముందు నిన్ను అనాలి. మమల్ని హాస్పిటల్‌కి రానివ్వకుండా మొత్తం నువ్వే చూసుకున్న నువ్వే ఇలా అంటే ఎలా ఇక దీని గురించి ఎవరూ ఏం మాట్లాడొద్దు.
విశాల్: నయని వాళ్లకు ఎంత చెప్పినా హాసిని వదిన తప్ప అందరూ నిన్ను నిన్నులా చూడటం లేదు.
నయని: మనసులో ఇంకా గంటన్నరే సమయం ఉంది ఈ లోపు ఇంటి పనులు ఆఫీస్ పనులు చకచకా చేసేయాలి.
విక్రాంత్: వదినా తలకు అయిన గాయం చూపించకపోయినా అందరూ మీ చేతికి ఉన్న వాచ్ చూశారు ఎందుకు పెట్టుకున్నారో కాస్త చెప్తారా.
విశాల్: రేయ్ వాచ్ పెట్టుకోవడం కూడా నీకు ప్రాబ్లమేనా. నయని కండీషన్ అందరికీ తెలుసు అయినా ఇలా వేదించడం కరెక్ట్ కాదు.
హాసిని నయనికి వంట చేయమని చెప్తుంది. నయని వెళ్లిపోతుంది. ఇక తిలోత్తమ, వల్లభలు తాను నయని కాదని అందరికీ ఫ్రూవ్ చేయాలని అనుకుంటే నయని నయనిలా మారిపోయిందని ఏం అర్థం కావడం లేదని తిలోత్తమ, వల్లభ అనుకుంటారు. అసలు తను నయనినే లేక వేరే ఎవరైననా అని అనుకుంటారు. తాను నయని కాకపోతే ఏం చేస్తాం అని వల్లభ అడిగితే దానికి తిలోత్తమ మనం చెప్పినట్లు వింటే ఓకే లేదంటే లేపేద్దామని తిలోత్తమ అంటుంది. ఇక తాను నయనినో కాదో తెలుసుకోవడానికి పరీక్షించాలని అంటుంది.
రాత్రి నయని త్రినేత్రిగా మారిపోయి లంగా వోణి కట్టి కూర్చొంటుంది. ఇంతలో విశాల్ వస్తాడు. మీ కోసం వచ్చిన నన్ను ఎందుకు అందరూ ఇబ్బంది పెడుతున్నారని త్రినేత్రి అంటుంది. త్రినేత్రి విశాల్‌కి నయని ఎవరు బాబుగారు అని అడుగుతుంది. దాంతో విశాల్ నయని నా భార్య అని అంటాడు. దాంతో త్రినేత్రి మీకు పెళ్లి అయిందా అంటే దానికి విశాల్ గాయత్రీ, గానవి మన పిల్లలు కదా అంటాడు. దాంతో త్రినేత్రి నేను వేరు నయని వేరు బాబుగారు మీ పిల్లల్ని నా పిల్లలు అంటున్నారు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప, కార్తీక్‌లపై విరుచుకుపడ్డ శివనారాయణ.. కార్తీక్ కోసం తాతపై చేయెత్తిన దీప!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

