Trinayani Serial Today March 29th: వామ్మో.. గాయత్రీ మాయం వెనుక తల్లి నయని హస్తమా.. తేల్చేసిన విశాలాక్షి, సుమన సేఫ్!
Trinayani Serial Today Episode గాయత్రీ పాపను మాయం చేసింది నయని అని విశాలాక్షి తన సోదిలో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today March 29th Episode: పెద్దబొట్టమ్మకు సాయం చేసింది ఎవరో విశాలాక్షి చెప్తుంది అని విక్రాంత్ అంటాడు. దానికి విశాల్ సుమనే మొత్తం చేసిందని చెప్పబోతే నయని అడ్డుకుంటుంది. కొన్నింటిని భగవంతుడికే వదిలేయాలి అంటుంది.
విశాలాక్షి: అందుకే అమ్మ నన్ను చెప్పమంటుంది అమ్మ.
సుమన: నువ్వు దేవతవని అనుకుంటున్నావా..
హాసిని: విశాలాక్షి అని అమ్మవారి పేరు పెట్టుకున్నాక తెలిసి చెప్తాను అన్నాక ఈ కాసేపు అయినా అమ్మవారే అనుకుంటే తప్పు లేదు చిట్టీ.
పావనా: హాసిని చాటలో కొన్ని బియ్యం తీసుకొనిరా..
నయని: పసుపు కుంకుమ, చిల్లర తీసుకొని రా అక్క.
హాసిని వాటిని తీసుకొచ్చి విశాలాక్షి ముందు ముగ్గు పెట్టి అవన్నీ విశాలాక్షి ముందు ఉంచి గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలి అనుకున్ను ముఠా గురించి బయటకు తేవాలి అంటుంది. ఇక విశాలాక్షి గాయత్రీని బుట్టలో కూర్చొపెట్టమని విశాలాక్షి చెప్తుంది. విశాల్ కూర్చొపెడతాడు.
సుమన: ఇంట్లో వాళ్లని నమ్మరు కానీ బయట వాళ్లని బాగా నమ్ముతారు బావగారు. చెప్పగానే పిల్లని బుట్టలో కూర్చొపెట్టారు.
విశాలాక్షి: గాయత్రీ ఈ గవ్వలే (మూడు గవ్వలు) నీ విషయంలో దుర్మార్గంగా ఆలోచించిన వారి దగ్గరకు వెళ్తాయి. అని మొక్కతుంది.
సుమన: మనసులో అమ్మో నా వైపే వస్తున్నాయి. గాయత్రీని ఎత్తుకెళ్లాలి అనుకున్నది నేనే అని తెలిస్తే మా అక్క కాదు ముందు మా ఆయనే నన్ను చంపేసేలా ఉన్నాడు.
గవ్వలు సుమన దగ్గరకు వెళ్లి ఆగుతాయి. అందరూ షాక్ అవుతారు. ఇక అక్కడి నుంచి గవ్వలు వల్లభ దగ్గర నుంచి తిలోత్తమ దగ్గర నుంచి అందరి దగ్గరకు తిరిగి చివరకు నయని దగ్గర ఆగుతాయి. అందరూ షాక్ అయి నయని ప్రశ్నిస్తారు.
దురంధర: ఇదేం ట్విస్ట్ ఏంటే తల్లి.
విక్రాంత్: ఆ గవ్వలు పొరపడ్డాయేమో..
తిలోత్తమ: దత్త పుత్రికను పొత్తిల్లోకి తీసుకొన్న నయనీనే గాయత్రీని మాయం చేయాలి అనుకుంది అంటే నమ్మబుద్ధి కావడం లేదు.
హాసిని: ముందు గవ్వలు చిట్టీ వైపే కదా వెళ్లాయి.
సుమన: అంటే.. నన్ను ఇరికించాలి అని చూస్తున్నావు కదా అక్క.
తిలోత్తమ: గాయత్రీ పాపని ఎత్తుకుపోవాలి అనుకున్నది ఎవరో కాదు నయనినే అని మేం అంటాం. పెద్దబొట్టమ్మకు ఏ విధంగా సాయం పడిందో తెలీదు కానీ గాయత్రీని ఈ ఇంటి నుంచి దూరం చేయాలి అనుకున్నది మాత్రం నయనినే.
విశాలాక్షి: చెప్పమ్మ.
విశాల్: విశాలాక్షి నువ్వు సోది చెప్తావు అంటే సరదాగా ఉంటుంది అనుకున్నా ఇప్పుడు చూడు అందరూ నయనిని ఎలా అంటున్నారో.
విశాలాక్షి: వింటున్నాను నాన్న అలాగే అమ్మ మాట కూడా వినాలి అనిపిస్తుంది. మాట్లాడు అమ్మ.
నయని: విశాలాక్షి చెప్పింది నిజం. గాయత్రీ పాపను ఎత్తుకుపోయి ఈ ఇంటికి దూరం చేద్దాం అనుకున్నది నేనే. అని పాపని తీసుకొని గదికి వెళ్లిపోతుంది.
సుమన: హాల్‌లో అవాక్కు అయి ఇక్కడ మీరు మీ పని చేసుకుంటే నాకు మండదా..
విక్రాంత్: నేను ఏం చేయాలి.
సుమన: నన్ను అనుమానించి అవమానించినట్లే మా అక్క దగ్గరకు వెళ్లి గాయత్రీ పాపను ఎత్తుకెళ్లి ఏం చేయాలి అని అడగండి. పాపకి ద్రోహం చేయాలి అనుకున్నది మా అక్క అని తెలియగానే అందరూ సైలెంట్‌గా ఉన్నారు. అదే నేను అయితే చెంప పగలగొట్టేవారు. వెళ్లి అడగండి..
విక్రాంత్: వదిన నాతో చెప్పారు పాపను తీసుకొని పార్క్ కి వెళ్లాఅని.
సుమన: వెళ్లలేదు..
విక్రాంత్: వెళ్లారు అని చెప్తే అర్థం కాదా..
సుమన: లేదు అబద్ధం.. పాపను మా అక్క తీసుకెళ్లలేదు ఇది నిజం.
విక్రాంత్: పాపని వదిని తీసుకెళ్లలేదు అని నువ్వే చెప్తున్నావ్ అంటే నిజం చెప్పు ఎవరు తీసుకెళ్లారు. మర్యాదగా చెప్పు గాయత్రీ పాపను పెద్దబొట్టమ్మ తీసుకెళ్లలేదు. నయని వదినా తీసుకెళ్లలేదు. మిగిలింది నువ్వే.. దీని వాలకంలోనే ఏదో తేడా ఉంది.
ఇక హాల్‌లో ఉన్న అందరూ గాయత్రీ పాపను తీసుకెళ్లి ఏం చేయాలి అనుకున్నావ్ అని నయనిని వల్లభ అడుగుతాడు. అందర్ని నయనిని ప్రశ్నించమని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.