అన్వేషించండి

Trinayani Serial Today March 21st: 'త్రినయని' సీరియల్: గాయత్రీపాప కోసం రక్తం మరకలతో వేలిముద్రలు వేసిన లలితాదేవి.. షాక్ ఇచ్చిన నాగయ్య పాము!

Trinayani Serial Today Episode గాయత్రీ పాపకు పట్టాభిషేకం చేసి ఆస్తి పత్రాల మీద లలితాదేవి తన రక్తంతో వేలిముద్రలు వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today March 21st Episode  గాయత్రీ పాపకు అదృష్టం ఎలా వరించిందో తెలుసా అని లలితాదేవి అడిగి గాయత్రీ అని అమ్మవారి పేరు పెట్టుకోవడంతో జాతకం ప్రజ్వరిల్లిందని అంటుంది. ఇక ఇప్పుడు తన చెల్లెలు గాయత్రీ దేవిగా ఈ చిన్నారి పట్టపురాణి అవుతుంది అని అంటుంది. ఇక గాయత్రీ పాపకు లలితా దేవి కిరీటం పెడుతుంది. 

తిలోత్తమ: బియ్యంలో పేరు రాయమను..
సుమన: ముందు ఆస్తి పత్రాల మీద పెద్దత్తయ్యకు సంతకం పెట్టమని చెప్పండి అత్తయ్య.
విశాల్: సుమన గాయమైన చేయితో సంతకం పెట్టడం కష్టం కదా..
సుమన: ప్రయత్నించమని చెప్పండి నొప్పిగా ఉంటే వదిలేయ్‌మని చెప్పండి. 
వల్లభ: ఏం వదిలేయాలి. పెన్నా.. ఆస్తి ఇవ్వాలి అనే ఆలోచనా..
లలితాదేవి: షట్ అప్.. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తీసుకోను అని తెలుసుకదా..
సుమన: ఒకవేళ సంతకం రేపు పెడదామంటే మనసు మార్చుకోవచ్చు కదా. ఎవరికి తెలుసు డబ్బు అది. 
విశాల్: పెద్దమ్మ మనస్తత్వం నీకు తెలీదు కదా సుమన.
తిలోత్తమ: సుమనను అనడానికి కూడా లేదు విశాల్. వయసు పెరిగే వాళ్లు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనింది. 
వల్లభ: పెద్దమ్మ అలా చేస్తారు అని కాదు.
సుమన: అందంగానే సంతకం చేయనవసరం లేదు కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా.. వందలకోట్ల ఆస్తిని దరాదత్తం చేయడం కంటే వచ్చే నొప్పి ఏముంటుంది. 
నయని: పిచ్చి పిచ్చాగా మాట్లాడితే పళ్లు రాలతాయ్ సుమన. గాయత్రీ అమ్మగారు తిరిగి వస్తే ఈ గాయత్రీ పాప నేను దత్తత తీసుకోనే పాపగానే ఉంటుంది. నేను నిన్ను కన్న మొదటి బిడ్డ గాయత్రీదేవిగారు మాత్రం ఈ యావత్ ఆస్తికి వారసురాలు అవుతుంది అంటే మాత్రం ఇప్పుడు రాసినా రాయకపోయినా ఒకటే. 
తిలోత్తమ: అలా ఎందుకు అనుకోవాలి రాసిస్తాను అంటే రాసి ఇవ్వాలి. అలా అని నొప్పితో రాసి ఇవ్వమని కాదు.
లలితాదేవి: పర్వాలేదు. విశాల్ పెన్ను పేపర్ తీసుకొని రా.. అంటూ సంతకం పెడుతుంటే గాయం నుంచి రక్తం వస్తుంది. ఇంతలో బయట నుంచి చాలా పెద్ద గాలి వస్తుంది. నయని విశాల్‌లు సంతకం పెట్టొద్దు అని అంటారు. లలితా దేవి కూడా సంతకం పెట్టలేకపోతుంది.

లలితాదేవి: ఈ పత్రాలకు వ్యాల్యూ రావాలి అంతేకదా..
తిలోత్తమ: అవును.
లలితాదేవి: విశాల్ ఈ పత్రాలు తీసుకో. అని చేతి కట్టు విప్పేస్తుంది. ఎవరు చెప్పినా వినిపించుకోదు. ఇక  చేతికి వస్తున్న రక్తాన్ని ఇంకా గట్టిగా పట్టుకొని అరచేతి నిండా రక్తం అయ్యేలా చేస్తుంది. తోడపుట్టిన నా చెల్లి ఎక్కడుందో తెలీదు కానీ తను ఈ ఇంటికి రావాలి అని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అక్క ఆస్తిని దారాదత్తం చేస్తుంది అని ఈ కార్యన్ని అడ్డుకోవడానికి అయినా వస్తుంది అని ఆశతో ఈ కార్యాన్ని చేశాను. వందల కోట్ల ఆస్తి నాకు లెక్క కాదు. నా చెల్లిలు గాయత్రీ దేవి పునర్జన్మలో ఎలా ఉందో నేను చూడాలి. గాయత్రీని దత్తత తీసుకున్నారు. తనని నయని విశాల్ దత్తత తీసుకున్నారు కాబట్టి మొత్తం ఆస్తిని గాయత్రీ దేవి అన్న పేరు మీదే రాసి సంతకం పెట్టాలి అనుకున్నారు. చేతికి గాయం అయి సహకరించకపోగా రక్తం వస్తున్నా నా ప్రయత్నం మానుకోను. వెనకడుగు వేయను. విశాల్ నా చేతి రక్తంతో వేలి ముద్రలు వేస్తున్నాను. ఏ కోర్టుకు వెళ్లినా చెల్లుతుంది అని నీ చెల్లికి చెప్పు నయని. అంటూ పత్రాల మీద రక్తంతో వేలి ముద్రలు వేస్తుంది. 

ఇంతలో తిలోత్తమ వాళ్లు పెట్టిన క్లాత్ లలితా దేవి చేతిలో పడుతుంది. నయని అదే క్లాత్‌తో లలితా దేవి చేతికి కట్టు కడుతుంది. 

హాసిని: ఈ క్లాత్ ఎక్కడ నుంచి వచ్చింది.
దురంధర: పైనుంచి పడినట్లుంది. 
లలితాదేవి: ఎలా అయితేనేం మళ్లీ కట్టుకుంటాను. యావత్ ఆస్తిని రాసిచ్చినట్లు వేలిముంద్రలు వేశాను సరిపోతుందా తిలోత్తమ. సంతకాలే కాదు వేలిముద్రలు కూడా సరిపోతాయి సుమన అర్థమైందా.
పావనా: బియ్యం మీద పేరు ఎవరు రాస్తారు. 
తిలోత్తమ: సంతకం అయితే పెట్టడం కష్టం అయింది కానీ వేలితో బియ్యంలో పేరు రాయడం కష్టం కాకపోవచ్చు లలితక్కకి.
విశాల్: రక్తం కారడం కళ్లతో చూశారు. బలవంతం చేస్తారు ఏంటి అమ్మ.
వల్లభ: మరి ఎవరు రాస్తారు. 
తిలోత్తమ: అక్కయ్యే రాయాలిరా పిల్లలు అంటే పంచ ప్రాణాలు కదరా తనకి.
వల్లభ: ప్రాణాలు పోవడమే మన లక్ష్యం కద.
లలితాదేవి: వేలితో బియ్యంలో రాయడమే కదా రాయగలను పర్వాలేదు.
దురంధర: నిజానికి తండ్రి చేత రాయిస్తారు కదా..
విశాల్: పర్లేదులే అత్త..
పావనా: వాళ్ల నాన్న గారు కాలం చేయడంతో లలితా అక్కకి అమ్మఅయినా నాన్న అయినా అన్ని లలితా అక్కే కదా పర్లేదు.
నయని: లలితా దేవి రాస్తుంటే ఒక్క నిమిషం అమ్మగారు. రక్తం అంటిన చేతితో గాయత్రీ అమ్మగారి పేరు రాయడం మంచిది కాదు అనిపిస్తుంది. 
 
ఇక విశాల్‌కు రాయమంటే.. నయని తాను రాస్తాను అంటుంది. విశాల్ ఓకే చెప్తాడు. దీంతో నయని పేరు రాయడానికి వెళ్తే నాగయ్య పాము బయటకు వస్తుంది. దీంతో హాసిని బియ్యం పళ్లెం విసిరేస్తుంది. 

సుమన: ఈ గాయత్రీకి గాయత్రీదేవి అని పేరు పెట్టడం నాగయ్యకు కూడా ఇష్టం లేదు అని అర్థం.
నయని: లేదు నాగయ్య అలా చేయడు.
తిలోత్తమ: బియ్యం నేలపాలు చేస్తే అలా చేయడు అంటావ్ ఏంటి నయని.
విశాల్: నాగయ్య ఎందుకు అలా చేశావ్. అమ్మ పేరు పెట్టే కార్యక్రమం విజయవంతం చేయాలని రక్తంతోనే ముద్రలు వేశారు తెలుసా నీకు. 
లలితాదేవి: బియ్యం వేసినప్పుడు పాము కనిపించలేదా.. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: మోనిత: కార్తీకదీపం సీజన్ 2 లో మోనిత ఎంట్రీ ఇస్తుందా లేదా - ఇదిగో క్లారిటీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్అరెస్ట్ చేసే టైమ్‌లో కాఫీ తాగుతూ కూల్‌గా అల్లు అర్జున్అల్లు అర్జున్‌కి పదేళ్ల జైలు తప్పదా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
One Nation One Election: జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
Embed widget