అన్వేషించండి

Trinayani Serial Today July 27th: 'త్రినయని' సీరియల్: విశాలాక్షి అమ్మవారి విశ్వరూపం, కాళ్ల మీద పడ్డ సుమన.. మగ గొంతుతో బెంబేలెత్తించిన తిలోత్తమ! 

Trinayani Serial Today Episode తిలోత్తమ ఉన్నట్టుండి మగ గొంతుతో మాట్లాడి భయపెట్టడం విశాలాక్షి గండరఖడ్గం తీసుకొచ్చి తిలోత్తమ చేతి గ్లౌజ్ నరికేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode విశాలాక్షి ఇంట్లో ఏం జరిగిందో మొత్తం  చెప్పేస్తుంది. ఇక వల్లభ దురంధరకు ఏమైందో చెప్తే కాళ్లు పట్టుకుంటానని అంటాడు. దానికి డమ్మక్క అమ్మ కాలు మొక్కాల్సింది నువ్వు కాదు సుమన అని అంటుంది. సుమన  ఛీ.. ఛీ ఆ పిల్ల కాలు నేను పట్టడం ఏంటని మాట్లాడుతుంది. ఏం చెప్తుందో ఏంటో అని దురంధర మనసులో అనుకుంటుంది. విశాలాక్షి నవ్వుతుంది. అందరూ చెప్పమని అంటారు.

విశాలాక్షి తన అడ్డంగా ఊపితే వల్లభ సుమనలు విశాలాక్షి మీద సెటైర్లు వేస్తారు. కొన్ని విషయాలు తెలుసుకొని వచ్చి చెప్పి బిల్డప్‌ ఇస్తున్నారని అంటారు. తనని ఏమైనా అను కానీ అమ్మని అంటే కళ్లుపోతాయని డమ్మక్క అంటుంది. పోయావి కదా కాళ్లు అని సుమనని విశాలాక్షి అంటుంది. ఒకసారి నీ కాళ్లకు ఏమైందో నీకు తెలీకపోయినా నాకు తెలుసని ఒకసారి చూసుకో అని అంటుంది. సుమన కాళ్లు చూసే సరికి పెద్దబొట్టమ్మ శాపం వల్ల నల్లగా మారిపోతాయి. సుమన మంట పెడుతున్నాయని కుయ్యోముర్రో అనుకుంటుంది. ఏమాయ చేశావని సుమన విశాలాక్షిని ప్రశ్నిస్తుంది.

విశాల్: సుమన విశాలాక్షి ఏం చేయలేదు. పెద్దబొట్టమ్మ శాపం వల్ల ఇలా అయింది.
హాసిని: పెద్ద వాళ్ల శాపం ఊరికే పోదు.
నయని: విశాలాక్షి నువ్వే ఏదో దాని చూపించాలమ్మా.
డమ్మక్క: అమ్మ కాళ్లకు మీ చెల్లి దండం పెడితే సరిపోతుంది.
సుమన: చచ్చినా నేను ఆ పని చేయను. 

సుమన మంట అని అరుస్తుంది. తన గదికి వెళ్లి నీటిలో కాళ్లు పెట్టుకొని మంట మంట అని బాధ పడుతుంది. విక్రాంత్ వెటకారంగా సుమన కాళ్లకు ఫొటో తీస్తాడు. అందరూ విశాలాక్షి పేరు తలచుకోమని అంటారు. సుమన మాత్రం ఆ పని చేయను అంటుంది. అందరూ సుమనను బలవంతంగా తీసుకెళ్తారు. 

హాల్లో ఉన్న తిలోత్తమకు ఏదో శక్తి ఆవహించడంతో కరెంట్ షాక్ కొట్టినట్లు అయిపోతుంది. కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే వల్లభ వచ్చి సోఫామీద కూర్చొకుండా కింద కూర్చొన్నావ్ ఏంటి మమ్మీ అని అడుగుతాడు. వల్లభ నీరు ఇవ్వడంతో సీరియస్‌గా చూస్తూ గ్లాస్ విసిరి కొడుతుంది. ఇక సుమనను అందరూ తీసుకొని వస్తారు. ఇక సుమన విశాలాక్షి ఏమైనా దేవతా శాపవిమోచనం కలిగించడానికి అని  అంటుంది. ఇక తిలోత్తమ మగ గొంతుతో అవును అని అరుస్తుంది. అందరూ బిత్తరపోతారు. వల్లభ మమ్మీ అని అంటే ఏవడ్రా మమ్మీ అని అంటుంది. 

విశాల్ అమ్మ అని పిలిస్తే తిలోత్తమ మగ గొంతుతో మీ అమ్మీ నాకు ప్రధాన శత్రువని అంటుంది. అందరి మీద మగ గొంతుతో అరుస్తుంది. తను తిలోత్తమ  అత్తయ్య కాదు అని నయని అంటుంది. ఆ మగ గొంతు కూడా తెలుసని అంటుంది. దాంతో డమ్మక్క నీకు బాగా తెలిసిన గొంతే అని అంటుంది. ఇక తన తల్లి వస్తే నీకు సుమనకు విముక్తి కలుగుతుందని అంటుంది డమ్మక్క. ఎవరొస్తారో రమ్మని అని తిలోత్తమ పిలుస్తుంది. ఇక విశాలాక్షి గండరఖడ్గం తీసుకొని వస్తుంది. ఎవర్ని నరుకుతుందని దురంధర అంటుంది. విశాలాక్షి వస్తుంటే తిలోత్తమ రావొద్దని అరుస్తుంది. తిలోత్తమ వల్లభను తోసేస్తే విశాలాక్షి వల్లభ మీద అడుగు పెట్టి వస్తుంది. విశాలాక్షి అమ్మవారిలా కనిపిస్తుందని ఆపలేను అని నయని అంటుంది. ఇక అందరూ సుమనను విశాలాక్షి పాదాల మీద పడమని అంటారు. దాంతో సుమన విశాలాక్షి పాదాల మీద పడి శరణు వేడుతుంది. విశాలాక్షి కత్తితో తిలోత్తమ చేతి గ్లౌజ్ తొలగిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీ, జున్ను ప్లాన్‌కి లక్ష్మీ అరవిందకు దొరికిపోయిందా.. వీడియో మేటర్‌లో మనీషాకు పెద్ద షాక్!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget