Trinayani Serial Today July 10th: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లిపోయిన గంటలమ్మ.. తిలోత్తమకు ఆస్తి వాటా అడిగిన సుమన!
Trinayani Serial Today Episode హర్ష ఆత్మని వశీకరణ చేసి గంటలమ్మ గాయత్రీ పాపని ఎత్తుకెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode విశాల్ ఆయుష్షు గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని నయని హాసినిని అడుగుతుంది. దానికి హాసిని గాయత్రీ వల్లే అని అంటుంది. పాప వల్లా అని నయని అడిగితే విశాల్ తన తల్లి వల్ల అని చెప్తాడు. దానికి నయని అమ్మగారిని అక్క అత్తయ్య అంటుంది కానీ పేరు పెట్టి పిలవరు కదా అని అంటుంది.
హాసిని: ఇప్పుడు పిలవొచ్చు కదా. ఈ జన్మలో గాయత్రీ అత్తయ్య గారు పసి పిల్లగా ఉంటారు కదా అప్పుడు నేను గాయత్రీ అని పిలవొచ్చు కదా. అలాగే చెప్పాలి కదా.
విశాల్: మనసులో.. నన్ను ఇరికిస్తావ్ ఏంటి వదినా. నీ తెలివికి ఓ దండం.
నయని: అలా అంటావ్ ఏంటి అక్క బాబుగారిని చెప్పాలా అంటావ్ ఏంటి. మ్యానేజ్ చేస్తున్నట్లు ఉంది.
హర్ష ఆత్మ నయని ఇంటికి చాటుగా వస్తాడు. గంటలమ్మ కూడా చాటుగా వాడిని ఫాలో అవుతుంది. ఇక నయని గాయత్రీ పాపని హాల్‌లో ఉంచి ఆడుకోమని అంటుంది. గంటలమ్మ హర్ష వెనకాలే నిల్చొని చేతిలో ఎర్రటి తాడును హర్ష ఆత్మ మెడలో వేస్తుంది. హర్ష షాక్ అయిపోతే దొరికిపోయావ్ రా అంటూ తాను చెప్పినట్లు చేయమని అంటుంది. హర్ష అలాగే గంటలమ్మని ఫాలో అయిపోతాడు. గంటలమ్మ హర్షని గాయత్రీని తీసుకెళ్లడానికి వచ్చానని సాయం చేయమని అంటుంది. హర్ష వశీకరణకు గురై గంటలమ్మ ఏం చెప్తే అది చేస్తాడు. హర్ష గాయత్రీ పాప ముందు ఉన్న బాలుని పక్కన పెట్టి పాప ఆ బాలు కోసం వచ్చేలా చేయమని హర్షకి చెప్తుంది. బాలు కోసం హర్ష గాయత్రీని పిలుస్తాడు. పాప బాలు కోసం వెళ్తుంది. హాసిని పాలు తీసుకొని వస్తుంది. గాయత్రీని పిలుస్తుంది. గంటలమ్మ పాపని ఎత్తుకొని తన దుప్పటిలో కప్పేస్తుంది. హర్ష ఎంత చెప్పినా హాసినికి వినిపించదు. సుమన, విక్రాంత్ కిందకి వస్తారు. విశాల్ కూడా వస్తాడు. హర్ష విశాల్‌ని కూడా పాపని చూడమని అంటాడు. గంటలమ్మ మాత్రం నువ్వు ఆత్మవిరా నీ మాటలు వాళ్లకి వినిపించవని అంటుంది. నయని వచ్చే టైంకి గంటలమ్మ హర్ష ఆత్మని వెనక్కి రప్పించేస్తుంది.
నయని: అదేంటి అక్క గాయత్రీకి పాలు తాగించలేదా.
హాసిని: హాల్‌లో పాప లేదు చెల్లి.
విశాల్: సుమన చేతిలో పేపర్లు ఏంటి.
విక్రాంత్: నేను చెప్తా బ్రో. సర్పదీవికి ఉలూచిని తీసుకెళ్లిన అమ్మ జ్యోతిని వెలిగించడం వల్ల కాలికి గాయం అయింది కదా దానికి పరిహారంగా ఎంతో కొంత ఆస్తి ఇవ్వాలని ఈ పేపర్లు తీసుకొచ్చింది.
తిలోత్తమ: ఎంతో కొంత అంటే.
సుమన: పావలా.
వల్లభ: మమ్మీ దగ్గర దగ్గర డబ్బై కోట్లు.
తిలోత్తమ: సుమన ఉలూచి పాదాలు కందిపోయినట్లు అయింది. కాలేమీ చచ్చు పడిపోలేదు. ఆ మాత్రానికే నువ్వు అన్నేసి కోట్లు అడగడం న్యాయం కాదు.
ఇంతలో గాయత్రీ పాప గంటలమ్మ మెడలో గంట ఊపుతుంది. అందరూ గంట శబ్ధం ఏంటని ఆలోచిస్తారు. తిలోత్తమ మనసులో గంటలమ్మ వచ్చుంటుందని అనుకొని దురంధర పూజ చేస్తుందేమో అని అంటుంది. వాళ్లిద్దరూ బయటకు వెళ్లిందని అంటారు. హాసిని మాత్రం గాయత్రీ పాపనే గంట కొట్టుంటుందని అంటుంది. సౌండ్ ఇంకా ఎక్కువ గంట సౌండ్ వస్తుంది. ఇక గాయత్రీ పాప హర్ష మెడలో తాడు లాగేస్తుంది. దీంతో గంటలమ్మ పెద్దగా అరిచి పాపని బయట పెట్టేస్తుంది. హర్ష ఆత్మ నయనితో గంటలమ్మ పాపని ఎత్తుకెళ్లడానికి వచ్చిందని ఎందుకు ఏమి అనేది తర్వాత చెప్తా అని అంటుంది. నువ్వెందుకు ఇంట్లో వచ్చావని, పాపని ఎందుకు ఎత్తుకున్నావ్ అని ప్రశ్నలు వేస్తారు. తిలోత్తమ కూడా కావాలానే గంటలమ్మ మీద సీరియస్ అవుతుంది. అందరి ముందు కావాలనే ఇంటి నుంచి గెంటేసినట్లు తిలోత్తమ, వల్లభలు గంటలమ్మని తీసుకెళ్లిపోతారు. ఇక హాసిని, విశాల్, నయనిలు గంటలమ్మ చేసిన పని గురించి ఆలోచిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.