అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today November 16th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి ఉందా.. లేదా.. మహాలక్ష్మీకి పిచ్చా.. సీత ప్లాన్ అదుర్స్.. రేపే ప్రీతి పెళ్లి సుమతి వస్తుందా!

Seethe Ramudi Katnam Today Episode ప్రీతి పెళ్లికి సుమతిని ఎలా అయినా తీసుకొస్తానని సీత ఛాలెంజ్ చేసి అందరినీ పెళ్లి మండపం దగ్గరకు తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవిని చాటుగా ఇంట్లోకి తీసుకొచ్చి సీత ఫుడ్ పెడుతుంది. విద్యాదేవికి ఎక్కిళ్లు రావడంతో నీరు తీసుకురావడానికి సీత వెళ్తుంది. అదే టైంలో మహాలక్ష్మీ అటుగా వచ్చి విద్యాదేవిని చూసి షాక్ అయిపోతుంది. తనని చంపడానికి విద్యాదేవి ప్లాన్ చేస్తుందని చెప్పిన మాట గుర్తు చేసుకొని భయపడుతుంది. కంగారుగా గదిలోకి వెళ్లి జనార్థన్‌ని పిలిచి విద్యాదేవి వచ్చిందని గదిలో ఉందని చెప్తుంది. 

ఇంట్లో ఉన్న అందరినీ తీసుకొని కిందకి వస్తుంది. మహాలక్ష్మీ వాళ్లు వచ్చేసరికి అక్కడ విద్యాదేవి ఉండకుండా సీత కూర్చొని తింటుంటుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు. సీత వాళ్లని చూసి ఏంటి నన్ను అందరూ వింతగా చూస్తున్నారు అని అడుగుతుంది. 

రామ్: విద్యాదేవి టీచర్ వచ్చిందని పిన్ని చెప్పింది.
మహాలక్ష్మీ: నేను ఇందాక చూసినప్పుడు అక్కడ విద్యాదేవి ఉంది.
సీత: ఇందాక నుంచి ఇక్కడ కూర్చొంది నేనే.
మహాలక్ష్మీ: నేను చూసింది తననే. తను వచ్చింది నేను చూశాను. 
సీత: మీరు చూసింది నన్నే అత్తయ్య.
జనార్థన్: తన గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం వల్లే అలా అనిపించుంటుంది.
సీత: మీరు ఇలాగే అతిగా ఆలోచిస్తే పిచ్చి వస్తుంది అత్తయ్య  తర్వాత పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. అందరూ వెళ్లిపోతారు. హమ్మయ్యా అత్తమ్మను కాపాడేశాను అత్తమ్మ సేఫ్.

సీత ఓ ఫ్యాన్‌ని తీసుకొని వ్యాన్‌లో ఉన్న విద్యాదేవి కోసం పెడుతుంది. ఇక రామ్ సీత కోసం మళ్లీ కిందకి వస్తాడు. ఇంత లేట్ అయింది ఈ టైంలో సీత బయట ఏం చేస్తుందని అనుకొని బయటకు వెళ్తాడు. సీత వ్యాన్ దగ్గర ఉండటం చూసి పిలిచి దగ్గరకు వెళ్తాడు. విద్యాదేవి రామ్ రాగానే దాక్కుంటుంది. ఇక సీత రామ్‌తో అబద్ధం చెప్పి లోపలికి పంపేస్తుంది. మరోవైపు మహాలక్ష్మీ జరిగింది తలచుకొని ఆలోచిస్తూ అటూ ఇటూ తిరిగేస్తుంది. ఇంతలో మహాలక్ష్మీ దగ్గరకు వస్తుంది. మన ఇంట్లో ఏదో జరుగుతుందని అంటుంది. సీత పెద్ద ఫ్యాన్‌ పట్టుకొని వ్యాన్ దగ్గరకు వెళ్లిందని వ్యాన్‌లో ఏదో సీక్రెట్ ఉందని అంటుంది.

మహాలక్ష్మీ: కొంపతీసి ఆ వ్యాన్‌లో సుమతి లేదు కదా
అర్చన: ఉన్నా ఆశ్చర్యం లేదు. అసలే ఆ సీతకి ఆవిడ అంటే చాలా ఇష్టం. ఒకసారి వ్యాన్ దగ్గరకు వెళ్లి చూద్దామా. ఇద్దరూ వ్యాన్‌లోకి వెళ్లి మొత్తం చెక్ చేస్తారు. అప్పుడు సీత కావాలనే వ్యాన్ స్టార్ట్ చేసి బ్రేక్ వేయడంలో ఇద్దరూ కింద పడిపోతారు.
సీత: ఏంటి అత్తలు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు. 
అర్చన: వ్యాన్‌లో ఫ్యాన్ ఎందుకు పెట్టావ్.
సీత: ఇంజన్ వేడిగా ఉందని ఫ్యాన్ పెట్టా. మనసులో మీరు వస్తున్నారు అని తెలిసే ఇలా చేశాను. ఇక సీత సుమతిని పడుకోమని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇదేంటి అర్థరాత్రి అవుతున్నా పడుకోకుండా అందరూ మీటింగ్ పెట్టారు. మీటింగ్ ఎందుకు అత్తయ్య టీచర్ గారి గురించా.
మహాలక్ష్మీ: కాదు సుమతి గురించి రేపు ప్రీతి పెళ్లి సుమతి వచ్చి కన్యాదానం చేస్తుందని నువ్వు చెప్పావు. 
సీత: అవును మా అమ్మానాన్నలు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం రేపు ఊరు వెళ్తున్నాం.
అర్చన: ప్రాణాలతో లేని మీ అమ్మ ఎలా వస్తుంది రామ్.
గిరిధర్: వాళ్ల నాన్న చూసిన సంబంధం ప్రీతికి చేయాలని సీత ఇలా చేస్తుంది.
సీత: లేదు మామయ్య రేపు అత్తయ్య వస్తుంది ప్రీతి పెళ్లి జరిపిస్తుంది. అన్నింటికీ సమాధానం రేపే దొరుకుతుంది. 

ఉదయం శివకృష్ణ ఇంటి దగ్గర ప్రీతి పెళ్లి పనులు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తారు. అందరూ ఏర్పాట్లు బాగున్నాయని మాట్లాడుకుంటారు. ఇక సీత వాళ్లు పెళ్లి మండపం దగ్గరకు వస్తారు. ప్రీతిని పెళ్లి కూతురిలా రెడీ చేయడానికి లలిత తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: త్రినేత్రి శరీరంలోకి నయని ఆత్మ.. కళ్లెదుట భార్య రూపాన్ని చూసి బిత్తరపోయిన విశాల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Embed widget