అన్వేషించండి

Trinayani Serial Today November 16th: 'త్రినయని' సీరియల్: త్రినేత్రి శరీరంలోకి నయని ఆత్మ.. కళ్లెదుట భార్య రూపాన్ని చూసి బిత్తరపోయిన విశాల్!

Trinayani Today Episode త్రినేత్రి శరీరంలోకి నయని ఆత్మ రావడం త్రినేత్రి విశాల్ ఇంటికి రావడంతో అందరూ షాక్ అయిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode నయనిని హాస్పిటల్‌ మార్చాలని విక్రాంత్ డాక్టర్‌తో చెప్తాడు. ఇక విశాల్‌తో పాటు ఇంట్లో ఎవరూ హాస్పిటల్‌కి రాకుండా చేస్తాడు. నయని కోమాలో ఉందనే విషయం విశాల్‌కి తెలీకుండా జాగ్రత్త పడాలని రెండు మూడు నెలల తర్వాత నయని కోలుకుంటుందని అనుకుంటాడు. మరోవైపు త్రినేత్రి శవం దగ్గరకు చిత్రగుప్తుడు నయని ఆత్మని తీసుకొని వస్తాడు. 

నయని: ప్రాణం పోయిందా.
చిత్రగుప్తుడు: పోయినది. ఎంతో పుణ్యం చేసింది కనుకే తన దేహాన్ని తనలా ఉన్న నీకు అప్పగించే సత్యార్యానికి నోచుకుంది. 
నయని: నేను ఏమైనా కోరానా మీరు చేసిన పొరపాటుకి తన ప్రాణంతో పాటు నా ప్రాణం తీసుకున్నారు.
చిత్రగుప్తుడు: ఆవేశ పడకు మాతా నీ విషయంలో పొరపాటే కానీ త్రినేత్రిది విధిరాత. తన ఆయుష్షు ఇంత వరకే ఉంది.
నయని: పెళ్లి కూడా కాలేదు తన వాళ్లు ఎంత బాధ పడతారో.
చిత్రగుప్తుడు: వృద్ధురాలు తప్ప ఎవరూ తన గురించి బాధ పడరు. ప్రాణాలు తీసింది కూడా తన మేనత్త మేనమామలే కదా. 
నయని: దుర్మార్గులు ఎక్కడో ఉండరు మన చుట్టూ ఉంటారు. 
చిత్రగుప్తుడు: నువ్వు నీ పిల్లలు, భర్తని కాపాడుకోవడానికి ఈ శరీరాన్నే ఆశ్రయించాలి. కాదు కాకూడదు అంటే కోమాలో ఉన్న దేహంలోనే ఉండాలి మూడు నెలలు ఎదురు చూడాల్సిందే.
నయని: ఇంకొక్క రోజు అయితే బాబు గారు ఉండలేరు. ఇంకొక్క రోజు అయితే తిలోత్తమ అత్తయ్య ఏం కుట్ర చేస్తుందో. నన్ను త్రినేత్రి దేహంలోకి పంపించండి.
చిత్రగుప్తుడు: త్రినేత్రి దేహంలోకి వెళ్లిన తర్వాత నువ్వు త్రినేత్రి వలె నడుచుకుందువు. గాయత్రీ పాప అయినా గాయత్రీ దేవి అయినా ఆ పుణ్యవతి త్రినేత్రి చేతులు తాకితే మూడు గంటలు నువ్వు నయని అని తెలుస్తుంది. ఆ సంగతి నీకు గుర్తుండదు. అది నీ బిడ్డకే తెలుస్తుంది.
నయని: మూడు గంటలు నయనిగా ఉన్నప్పుడు నా సమస్యలు అన్నీ తీర్చుకుంటాను
చిత్రగుప్తుడు: అది నీ శక్తియుక్తుల మీద ఆధార పడి ఉంటుంది. నిన్ను ఈ దేహంలోకి ప్రవేశింప జేసి నిన్ను నీ గృహం వద్ద ప్రత్యక్షమయ్యేలా చేస్తాను పడుకో మాత. నయని ఆత్మ త్రినేత్రి శరీరంలో పడుకుంటుంది. దాంతో త్రినేత్రిలో నయని చేరుతుంది. 

సుమన: ఎలా ఉంది మా అక్క ఎప్పుడు కళ్లు తెరుస్తుంది.
విక్రాంత్: నేను ఏమైనా డాక్టర్‌నా నన్ను అడుగుతావేంటి. 
సుమన: మీరు డాక్టర్ కాదు కానీ యాక్టర్ అండీ. గాయత్రీ పాప గురించి ముందే తెలిసినా ఏం తెలీనట్లు నటించారు. గానవీనీ తీసుకొని వచ్చి నా బిడ్డగా నటించలేదా. 
విక్రాంత్: ఆ రెండు విషయాల వల్ల మేలే జరిగింది.
సుమన: ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మా అక్క బతుకుతుంది. 
విక్రాంత్: నోర్ముయ్.
సుమన: విశాల్ బావ మా అక్కని చూస్తాను అంటే బాధ పడతారు అని వద్దన్నారు ఒకే కానీ మిగతా అందరినీ ఎందుకు వెళ్లనివ్వడం లేదు. తోడ బుట్టిన నన్ను ఎందుకు వెళ్లనివ్వడం లేదు.
విక్రాంత్: వెళ్లి ఏం చూస్తావ్
సుమన: మా అక్క శవాన్ని.
విక్రాంత్: లాగి పెట్టి ఒకటి కొడతాడు. నయని వదిన ప్రాణాలతో తిరిగి వచ్చే వరకు నువ్వు నీ పిచ్చి అనుమానాలు  ఎవరీకీ చెప్పొద్దు. 

త్రినేత్రి కోసం బామ్మ ఆలోచిస్తూ దిగాలుగా కూర్చొని ఉంటుంది. ముక్కోటి ఆవిడ దగ్గరకు వెళ్లి త్రినేత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటే బాధగా ఉంది. మా కోసం వంట చేసి తిండి పెట్టు అంటాడు. నేనే తినను వండలేను మీరే చేసుకోండి అని అంటుంది. ఇక ముక్కోటి త్రినేత్రి ఫొటోకి బొట్టు పెట్టి భార్యని పిలిచి ఫొటో ఎదురుగా దీపం పెడతాడు. అది చూసి బామ్మ గోల చేస్తుంది. నా మనవరాలు అడవిలోకి వెళ్లింది కానీ ఇంకా బతికే  ఉందని నా మనసు చెప్తుందని మీరు బొట్టు పెట్టి దీపం ఎందుకు పెట్టారని అడుగుతుంది. దానికి ముక్కోటి దీపం పెట్టకపోతే త్రినేత్రి ఆత్మ శాంతించదని అంటాడు. బామ్మ ఏడుస్తుంది. నా ఆయుష్షు కూడా పోసుకొని త్రినేత్రి బతకాలి అని అంటుంది. ఇక ముక్కోటి సంబంధం కూడా పోయిందని చెప్తాడు. బామ్మ త్రినేత్రి ఫొటో దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది.  

మరోవైపు విక్రాంత్ హాల్లో డల్‌గా కూర్చొని ఉంటే సుమన, వల్లభ, తిలోత్తమలు వచ్చి నయని అప్డేట్స్ ఏంటి అని అడుగుతారు. పోయిందా అని అంటారు. దాంతో హాసిని వచ్చి తిడుతుంది. మరోవైపు త్రినేత్రి శరీరంలో ప్రవేశించిన నయని ఆత్మ తన ఇంటికి త్రినేత్రిలా వస్తుంది. తాను నయనిలా కాకుండా త్రినేత్రి ప్రవర్తిస్తుంది. ఇక్కడికి రావాలి అన్నట్లు నా అడుగులు ముందుకు పడుతున్నాయేంటి అని ఇంటిలోపలికి వెళ్తుంది. ఇక విశాల్ గాయత్రీ పాపని తీసుకొని  వచ్చి నయని కండీషన్ గురించి అడుగుతాడు. ఏం చెప్పాలా అని విక్రాంత్ అనుకుంటాడు. ఇక తిలోత్తమ ఏమైనా అయ్యుంటుందా అని అంటే హాసిని పొరపాటున కూడా అలా అనొద్దని అంటుంది.

ఇక త్రినేత్రిలో ఉన్న నయని ఆత్మ విశాల్ ఇంట్లోకి వస్తుంది. త్రినేత్రి విశాల్‌ని చూసి బాబుగారు అని పిలుస్తుంది. అందరూ షాక్ అయి అటుగా చూస్తారు. నయని పిలిచి నట్లు అనిపించిందని అనుకుంటారు. లంగావోణిలో ఉన్న త్రినేత్రిని చూసి అందరూ బిత్తరపోతారు. నయని కోమాలో ఉన్న విషయం తెలిసిన విక్రాంత్ కూడా ఏం జరుగుతుందో అర్థం కాక లేచి నిల్చొండిపోతాడు. త్రినేత్రి విశాల్ ఎదురుగా వచ్చి నిల్చొంటుంది. ఇక త్రినేత్రి తనని చూసి కళ్లు తిరిగి పడిపోయిన వల్లభ ముఖంలో నీరు చల్లుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: విద్యాదేవి పగ పట్టి చంపేస్తుందని మహాలక్ష్మీని వణికించేసిన సీత!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget