Seethe Ramudi Katnam Serial Today May 6th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మిథునని పెళ్లి చేసుకున్న రామ్.. మహాలక్ష్మీ కౌంట్‌డౌన్ స్టార్ట్ నౌ!
Seethe Ramudi Katnam Today Episode మిథున మెడలో రామ్ తాళి కట్టడం సీతకి నిజం చెప్పాలని సీత దగ్గరకు రామ్ వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode రామ్ మిథున మెడలో తాళి కడతాడు. అందరూ కొత్త జంటకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ముఖర్జీ, సుశీలలు మహాలక్ష్మీకి థ్యాంక్స్ చెప్తారు. మహాలక్ష్మీ మిథునని హగ్ చేసుకొని ఇక నుంచి నువ్వు రామ్ భార్యవి నా కోడలివి మిథున అని అంటుంది. మిథున మనసులో పిచ్చి అత్తయ్య ఏ సీతని అయితే కోడలిగా వద్దు అనుకున్నావో అదే సీతని నీ కోడలిగా నువ్వే చేసుకున్నావ్ అనుకుంటుంది. తర్వాత మహాలక్ష్మీకి థ్యాంక్స్ చెప్తుంది.
ముఖర్జీ వాళ్లు మిథునని తీసుకెళ్తామని మీ కోడలిగా పంపిస్తామని అంటారు. రామ్‌కి థ్యాంక్స్ చెప్పి మిథునలా ఉన్న సీతని తీసుకెళ్తారు. మిథున వెళ్తూ రామ్‌తో నా మెడలో తాళి కట్టావ్ రామ్ అంటే నేను నీ భార్యని ఇక నుంచి ఆ సీత ప్రస్తావన నా దగ్గర తీసుకురావొద్దు. ఇక నుంచి నీ భార్య ఈ మిథున మాత్రమే అని చెప్పి వెళ్లి పోతుంది. రామ్ బాధగా వెళ్లిపోతాడు.
మిథున అలియాస్ సీత రేవతి, కిరణ్‌ల దగ్గరకు వెళ్లి వాళ్లని గిరగిరా తిప్పేసి రామ్ మామతో నా పెళ్లి అయిపోయింది. నేను మళ్లీ పెళ్లి చేసుకున్నా అని పసుపు తాడు చూపిస్తుంది. ఈ రోజు మా పెళ్లి రోజు కదా మళ్లీ నా మెడలో రామ్ మామ తాళి కట్టాడు అని మత్తులో రామ్ ప్రవర్తన నుంచి మిథునకు తాళి కట్టడం వరకు మొత్తం చెప్తుంది. నువ్వు సూపర్ సీత నువ్వే సీత అని తెలిస్తే ఆ మహాలక్ష్మీ గుండె పగిలిపోతుందని రేవతి అంటుంది. దానికి సీత ఆవిడను అంత ఈజీగా పోనిస్తానా నిజాలు బయట పెట్టి ఆవిడ అంతు తేల్చుతా అని అంటుంది. మహాలక్ష్మీ ఏ సీతని విపరీతంగా ద్వేషించిందో మిథునలా నన్ను అంతే అమితంగా ప్రేమిస్తుంది. ఆ ఇంటికి వెళ్లి సుమతి అత్తమ్మ చావుకి కారణాలు తెలుసుకుంటాను. గౌతమ్ సంగతి తేలుస్తా.. సీతని ఇబ్బంది పెట్టిన అందర్ని ఏడిపిస్తా అని చెప్తుంది. రామ్ కాళ్ల మీద పడి నిజం చెప్పి క్షమించమని చెప్తానని అంటుంది.
రామ్ జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ సీత గురించి ఆలోచించి ఏడుస్తాడు. అందరూ రామ్ దగ్గరకు వస్తారు. మిథునని భార్యగా చూడలేనని సీత, మిథున ఎప్పటికీ ఒక్కటి కాదని అంటారు. నాకు ఆలోచించుకునే టైం ఇవ్వలేదు నాతో మిథున మెడలో తాళి కట్టించారని రామ్ అంటాడు. దానికి నువ్వు మిథునతో తప్పు చేయకపోతే మాకు పెళ్లి చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతారు. ముఖర్జీ నీ మీద కేసు పెడితే అందరూ పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాల్సి వచ్చేది మన పరువు పోయేది అని అంటారు. దానికి రామ్ ఒకే అంతా నాదే తప్పు అందుకే మిథునతో వెళ్లను అన్నాను. సీతని ఇంటికి తెచ్చుకుంటా అని అన్నాను. ఇప్పుడు సీతకి విషయం తెలిస్తే ఎలా సీత తట్టుకోగలదా. నాకు నేను ఏం శిక్ష వేసుకోవాలి. ఒకరే రాముడు ఒకరే సీత అనుకున్నాం.. ఏ భర్త ఏ భార్యకి చేయని ద్రోహం నేను సీతకి చేశాను అని అంటాడు.
జనార్థన్, మహాలక్ష్మీ వెళ్లి సీతతో మాట్లాడుతామని చెప్తారు. రామ్ వద్దని నేనే వెళ్లి మాట్లాడుతానని అంటాడు. సీత దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి వస్తానని వెళ్తాడు. రామ్ రేవతి ఇంటికి వెళ్లే సరికి సీత చక్కగా పూజ చేసి హారతి పళ్లెం పట్టుకొని వస్తుంది. అందరికీ హారతి ఇస్తుంది. రామ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. రామ్‌తో సీత అందరూ నువ్వు నన్ను వదిలేశావని ఇక మనం కలవమని అంటున్నారని చెప్తుంది. కిరణ్, రేవతిలు రామ్‌తో మీరు ఎప్పటికీ కలిసే ఉండాలని సీత పూజ చేసుకుంటుందని అంటారు. మా మధ్యలోకి ఎవరు వస్తారు మా మధ్యలోకి ఎవరూ రారు అంటే కదా మామ అని అంటుంది. నేనే ఎక్కడ ఉన్నా మామ పక్కన ఉన్నట్లే నేను మామ మనసులోనే ఉన్నాను అని చెప్తుంది. రామ్ సీతతో నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు. సీత కూడా రామ్‌తో ఒక విషయం చెప్పాలి అంటుంది. పక్కింటి వెంకట రావుకి పక్కింట్లో సెటప్ ఉందని ఆమెను పెళ్లి చేసుకున్నాడని రెండో ఇళ్లు పెట్టాడని అందరూ వాడిని తిడతారు. వెంకటరావు భార్య వాడిని చంపేసిందని చెప్తుంది సీత దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!



















