Seethe Ramudi Katnam Serial Today May 1st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కళ్లు తాగి సీతలా మహాతో మాట్లాడేసిన మిథున.. రామ్‌కి దొరికిపోతుందా!
Seethe Ramudi Katnam Today Episode సీత తాటికళ్లు తాగి తాను మహాలక్ష్మీతో మాట్లాడటం రామ్తో కలిసి ఒకే గదిలో ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, అర్చన ఇద్దరూ సీత కోసం రేవతి ఇంటికి వస్తారు. సీత లేకపోవడంతో గదిలో పడుకుందని వాయిస్ రికార్డ్ పెడతారు. దాంతో మహాలక్ష్మీ వాళ్లు వెళ్లిపోతారు. ఇక గౌతమ్, రేఖలు కత్తి పట్టుకొని ఎలా అయినా కత్తి ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటారు. ఇక రామ్, మిథున రౌతులను కలుస్తారు. పొలాలు మేం తీసుకొని ఫ్యాక్టరీ కడతాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం అని చెప్తారు. రైతులు సంతోషంగా భూములు ఇస్తామని అంటారు.
గౌతమ్ అక్కడే దిష్టిబొమ్మలా నిల్చొని రామ్ మీదకు కత్తి విసరాలి అనుకుంటాడు. గౌతమ్ కత్తి కరెక్ట్‌గా విసురుతాడు. అయితే అప్పుడే రామ్ వెళ్లిపోవడంతో ఆ కత్తి రేఖ ముందు సరిగ్గా పడుతుంది. రేఖ గౌతమ్‌తో నువ్వు నన్ను చంపాలి అనుకున్నావా రామ్‌ని చంపాలి అనుకున్నావా సెంటి మెంట్ దూరంలో చావు నుంచి తప్పించుకున్నానని అంటుంది. వాళ్లు వెళ్లిపోయారు ఇక మనం ఇక్కడెందుకు అని రేఖ అంటుంది.
రామ్ మిథునతో మనం వచ్చిన పని అయిపోయింది రిజిస్ట్రేషన్ చేయించుకొని వెళ్లిపోదాం అంటాడు. పక్క ఊరు వెళ్లి పొలాలు కొనాలి అని రెండు రోజులు ఇక్కడే ఉండాలి అని అంటుంది. ఇక మిథున పొలం ఫోటోలు తీస్తుంది. రామ్ మీద పడితే రామ్ తిడతాడు. మీద మీద పడొద్దని చెప్తాడు. ఇక రామ్‌కి ఫోన్ రావడంతో పక్కకు వెళ్తాడు. ఇంతలో సీత అలియాస్ మిథున తాటి కళ్లు చూసి తాగాలి అనుకుంటుంది. పెద్ద చెట్టు మీదకి ఎక్కలేక కింద నుంచి రాయి విసిరి తాటి కళ్లు మొత్తం తాగేస్తుంది. ఫుల్లుగా మత్తు ఎక్కుతుంది. తోటల్లో తూగుతూ తిరుగుతుంటుంది. ఇంతలో మహాలక్ష్మీ మిథునకి కాల్ చేయాలి అనుకొని చేస్తుంది. మరోవైపు రామ్ కూడా మిథున కోసం వెతుకుతాడు.
మహాలక్ష్మీ ఫోన్ లిఫ్ట్ చేసిన మిథున ఎవర్తివే నువ్వు గాడిద. నేను అంటే ఎవరే నీకు పేరు లేదా అంటుంది. మహాలక్ష్మీ మాట్లాడుతుంది అని అర్చన అంటే నువ్వు ఎవరే అడ్డ గాడిద. అయినా మిథున ఎవరే నేనే సీతనే చింపుల చింపాజీ లారా.. నన్ను రామ్ మామని దూరం చేస్తారా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రామ్ వచ్చి ఫోన్లో ఎవరిని తిడుతున్నావ్ అంటే తాటకి, సూర్పణకని అని అంటుంది. రామ్ పైకి చూసి తాటి కళ్లు తగించేసినట్లుందని అనుకుంటాడు. రామ్ ఫోన్ తీసుకొని ఎవరు అంటాడు. మహాలక్ష్మీ మిథునకు ఏమైంది అని అడుగుతుంది. మిథున తాటికళ్లు తాగేసిందని అంటాడు. మిథునని రామ్ రూమ్కి తీసుకెళ్తా అంటాడు. సీత పడిపోబోతే పట్టుకుంటాడు. పట్టుకోను అని ఇలా పట్టుకున్నావ్ అని అడుగుతుంది. వెంటనే రామ్ కింద పడేస్తాడు. నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లు అని అంటుంది. ఇదేం ఖర్మరా బాబురా అని రామ్ మిథునని తీసుకెళ్తాడు.
రాత్రి మిథున (సీత) బెడ్ సర్దుతుంటే రామ్ గదిలోకి వెళ్లి ఇబ్బంది పడతాడు. తర్వాత ల్యాప్ టాప్ తీసుకొని వెళ్తుంటే మిథున ఆపుతుంది. నేను నైట్ రూంలో ఉండను అని చెప్పాను కదా బయట వర్క్ చేసుకొని అక్కడే పడుకుంటా అంటాడు. మిథున ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. కనీసం ఫ్రెండ్ గా ఉండమని అంటుంది. దాంతో రామ్ నాకు భార్య అయినా ఫ్రెండ్ అయినా అన్నీ సీతే అని అంటాడు. నీ మీద నాకు నమ్మకం లేదు అని రామ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: దేవేంద్రవర్మ ఎవరో తెలుసుకున్న సత్యం.. చెల్లి నిర్దోషి అని నిరూపించుకోగలడా!





















