Seethe Ramudi Katnam Serial Today March 3rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతిని చంపింది గౌతమ్ అని కనిపెట్టేసిన సీత..!
Seethe Ramudi Katnam Today Episode సుమతి కొట్టి అరెస్ట్ చేయించిన ఆకతాయి గురించి సీత, శివకృష్ణ ఎంక్వైరీ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ తనని కావాలనే ఇరికించేసిందని సీత చెప్తుంది. రామ్ కనీసం ఆలోచించకుండా ఎందుకు సీతని పంపేశాడని లలిత కోప్పడుతుంది. మహాలక్ష్మీ ప్లాన్ ప్రకారమే ముందు సుమతిని తర్వాత సీతని ఇరికించేసింది అని శివకృష్ణ అంటాడు. సుమతి చనిపోయే ముందు ఎవరితో అయినా గొడవ పడిందా అని శివకృష్ణ అడిగుతాడు. దానికి సీత ఓ అమ్మాయిని ఏడిపించిన రౌడీని అరెస్ట్ చేయించాను అని అంటుంది.
వాడే కోపంతో సుమతిని చంపేశాడేమో అని అనుమానంతో వాడి గురించి తెలుసుకుందామని పోలీస్ స్టేషన్‌కి వెళ్దామని సీతతో చెప్తాడు. సీత తండ్రి గన్ తీసుకొని సుమతిని వాడే చంపేశాడని తెలిస్తే వాడిని చంపేస్తా అని తండ్రికి తెలీకుండా గన్ తీసుకెళ్తుంది. సీత, శివకృష్ణ ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. మరోవైపు రామ్ దిగులుగా ఉంటే రామ్ దగ్గరకు రేవతి వెళ్తుంది. సీతని ఎందుకు పంపేశావ్ అని రేవతి అడిగితే దాని గురించి అయితే మాట్లాడకు పిన్ని అని రామ్ అనేస్తాడు. ఎన్నో సార్లు సీతని సపోర్ట్ చేశావు ఇప్పుడేంటి ఇలా అని అంటే సీత పిన్నిని చంపాలి అనుకుంది పిన్నిని చంపాలి అనుకుంటే ఎవరినీ వదలను అని అంటాడు. మహాలక్ష్మీ కుట్రలో భాగమై సీతని పంపేశావ్ వెళ్లి సీతని తీసుకురా అని రేవతి అంటే అది ఎప్పటికీ జరగదు అని రామ్ అంటాడు.
సీత ఏదో ప్లాన్ చేసి మళ్లీ ఇంటికి తిరిగి వస్తుందని మహాలక్ష్మీ అనుకుంటుంది. సీతని ఎలా అయినా రానివ్వకూడదని అనుకుంటుంది. మహాలక్ష్మీ గౌతమ్‌ని పిలిచి మనం టైం బ్యాడ్‌లా ఉందని సుమతిని నువ్వే చంపావని సీతకి తెలిస్తే ఊరుకోదని జాగ్రత్తగా ఉండమని గౌతమ్‌కి చెప్తుంది. సీతకి అంత సీన్ లేదని గౌతమ్ వెళ్లిపోతాడు. మిధున ముందు ముఖర్జీ అతని భార్య చీర నగలు పెట్టి రెడీ అవ్వమని పెళ్లి చూపులు అని చెప్తారు. మిధున చిరాకు పడుతుంది. తల్లిదండ్రలు బతిమాలడంతో పెళ్లి కొడుకు నచ్చితేనే ఒకే చెప్తా అని అంటుంది. పెళ్లి వాళ్లు రావడంతో ముఖర్జీ వాళ్లు వెళ్తారు. ఇక మిధున రెడీ అవ్వకుండా మోడ్రన్ డ్రస్‌లోనే వస్తుంది. మిధున పెళ్లి వాళ్ల ముందు కాళ్ల మీద కాలు వేసుకొని కూర్చొంటుంది. అమెరికాలో చదివితే మాత్రం ఇంత పొగరా అని పెళ్లి వాళ్లు అంటారు.
పెళ్లి కొడుకు మాత్రం తనకు మోడ్రన్ గల్స్ అంటేనే ఇష్టం అని కాళ్ల మీద కాలు వేసి మాట్లాడుతాడు. ఆ అబ్బాయి పెళ్లి అయ్యాక అమెరికాలో సెటిల్ అవుదాం తల్లిదండ్రులు వద్దని అంటాడు. దాంతో మిధున పెళ్లి కొడుకుకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. తల్లిదండ్రులు అంటే అంత చులకనా అని చెడామెడా తిడుతుంది. మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనే ఇలా చీర కట్టుకోకుండా వచ్చానని మీ సంబంధం మాకు వద్దని వాళ్లని వెళ్లిపోమని చెప్తుంది. మరోవైపు సీత వాళ్లు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. సుమతి ఇచ్చిన కంప్లైంట్ గురించి అడుగుతారు. కంప్లైంట్ పేపర్ చూసిన శివకృష్ణ అతన్ని కోర్టుకి తీసుకెళ్లారా అంటే వదిలేశారు అని అంటాడు. ఇక గౌతమ్ ఫొటో చూపించడంతో సీత షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: చెల్లిని చావగొట్టిన దీప.. కన్నకూతురి చెంప పగలగొట్టిన సుమిత్ర.. దీప విశ్వరూపం!





















