Seethe Ramudi Katnam Serial Today March 31st: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మిధున దగ్గర నాగు ఫోన్.. మహాలక్ష్మీ కుట్రని సీత నిరూపిస్తుందా!
Seethe Ramudi Katnam Today Episode మిధునగా మహా ఇంటికి వెళ్లిన సీతకి నాగు ఫోన్ దొరకడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత చూడకుండా అర్చన నాగుని తప్పించేస్తుంది. మహాలక్ష్మీతో అర్చన నాగుని పంపేశానని చెప్తుంది. దాంతో మహాలక్ష్మీ నువ్వు చెప్పావని ఇళ్లంతా వెతికాం కానీ ఎవరూ లేరు కదా అని అడుగుతుంది. అందరూ సీతతో రామ్ నిన్ను దూరం పెట్టారు కదా దూరంగా ఉంటేనే మంచిది అని అంటారు. సీతని బయటకు పొమ్మని చెప్పమని మహాలక్ష్మీ రామ్‌తో అంటే ఎవరూ నాకు బయటకు వెళ్లమని చెప్పాల్సిన పని లేదు నేనే వెళ్లిపోతా ఈ సారి ఆధారాలతో వస్తానని అంటుంది.
మహాలక్ష్మీకి త్రిలోక్ కాల్ చేస్తాడు. చాలా సార్లు కాల్ చేశా మీరు లిఫ్ట్ చేయడం లేదని సీత నాగుని చూసిందని ఫాలో అయ్యిందని చెప్పడంతో మహాలక్ష్మీ జరిగింది చెప్తుంది. సీతకి వాడు దొరికితే మీరు డేంజర్‌లో పడతారని త్రిలోక్ చెప్తాడు. రామ్, సీతలకు అనుమానం వస్తే ప్రమాదమని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. సీత బట్టలు మార్చుకొని మిధునలా మహాలక్ష్మీ ఇంటికి వస్తుంది. అందరూ మిధునకు వెల్ కమ్ చెప్తారు. రామ్ మాత్రం సీరియస్‌గా చూస్తాడు. మహాలక్ష్మీ మిధునని పొగిడేస్తుంది. మిధున ముఖం మీద రంగులు చూసి అందరూ ప్రశ్నిస్తారు.
చలపతి: సీత ముఖం మీద ఇందాక ఇవే రంగులు చూశాను ఇప్పుడు ఈ మిధున ముఖం మీద అవే రంగులు ఉన్నాయేంటి.
రామ్: చెప్పు ఈ రంగులేంటి.
సీత: మనసులో మిధునలా రావాల్సిన నేను కంగారులో రంగులు కడుక్కోలేదే.. రామ్ ఇదంతా మీ వల్లే అంటే మీ సీత వల్లే. నేను వస్తుంటే మీ సీత ఇవే రంగులు పూసుకొని ఎదురు పడింది. తను అచ్చం నాలానే ఉంది కానీ పెద్ద మెంటల్ కేసులా ఉంది..
అర్చన: మనసులో మీ ఇద్దరికీ మెంటల్‌లో పెద్ద తేడా లేదులే.
మిధున: నన్ను కారులో నుంచి లాగి రంగులు పూసింది. నేను వద్దన్నా వినకుండా రాసింది. నాకు కోపం వచ్చి తిడితే హోళీ రోజు ఎవరు ఎవరికైనా రాయోచ్చని వాధించింది. నాకు తిక్క రేగితే ఈ సారి రంగులతో కాదు రాళ్లతో కొడతాను అని పిచ్చి పిచ్చిగా వాగి వెళ్లింది.
చలపతి: సీత చెప్పింది అంటే చేసేస్తుంది. సీతకి రాళ్లుకు దూరంగా ఉండు.
మహాలక్ష్మీ ఇక ఆ టాపిక్ వదిలేయమని స్వీట్స్ తీసుకురమ్మని అర్చనను పంపిస్తుంది. గౌతమ్ మిధునని చూసి ఓవర్‌గా రియాక్ట్ అయి మిధున హ్యాపీ హోళీ అని చెప్పగానే థ్యాంక్స్ అని అనేసి కనీసం గౌతమ్ వైపు కూడా చూడదు. ఇక రామ్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో రామ్ మిధున మీద సీరియస్ అవుతాడు. మహాలక్ష్మీ అందరికీ స్వీట్స్ ఇస్తుంది. మిధునలా ఉన్న సీత చేయి కడగటానికి వెళ్తూ నాగు ఫోన్ చూస్తుంది. నాగు ఫోన్ అని గుర్తించి ఎవరూ చూడకుండా తన బ్యాగ్‌లో వేసుకుంటుంది. తర్వాత మహాలక్ష్మీ వాళ్ల దగ్గరకు వెళ్తుంది. మిధున వాళ్ల నాన్న కాల్ చేయడంతో మళ్లీ వస్తాను అని చెప్పి బయల్దేరుతుంది. కావాలనే రామ్‌కి బాయ్ చెప్తుంది.
గౌతమ్ చెప్పినా పట్టించుకోదు. గౌతమ్ రగిలిపోతాడు. రామ్‌ని చంపలేకపోయానని తిట్టుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మీ వచ్చి గౌతమ్‌ని తిడుతుంది. రామ్ ఏం చేశాడు వాడిని ఎందుకు చంపాలి అనుకుంటున్నావ్ అని తిడుతుంది. పిచ్చి వేషాలు వేయొద్దని చెప్తుంది. రామ్ మనసులో సీత ఉంది మిధున లేదు అని అంటుంది. మిధునని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని అంటుంది. సీత రేవతి, కిరణ్‌లతో నాగు గురించి చెప్తుంది. మహాలక్ష్మీనే తనని కిడ్నాప్ చేయించి చంపాలని చూసిందని అంటుంది. మహాలక్ష్మీ నాగుని తప్పించుంటారని అంటుంది. నాగు ఫోన్ దొరికిందని సీత చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సీఈఓ స్థానం కావాలన్న ఫణి.. బాల ఆస్తులకు సర్వ హక్కులు త్రిపురవే!





















