(Source: ECI/ABP News/ABP Majha)
Seethe Ramudi Katnam Serial Today March 23rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సూర్యతో మధుకి విడాకులు ఇప్పించనున్న మహాలక్ష్మి.. సుమతి డైరీ కోసం సీతారాముల ఆరాటం!
Seethe Ramudi Katnam Serial Today Episode సుమతి డైరీ కోసం సీత, రామ్‌లు స్టోర్ రూంలో వెతకడం మహాలక్ష్మి వాళ్లని చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode మధుమిత గార్డెన్‌లో ఓ చోట ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. తన గురించి మహాలక్ష్మి గారు చాలా ఆలోచిస్తున్నారు అని అలాంటి ఆమెను సీత ఎందుకు అపార్థం చేసుకుంటుంది అని అనుకుంటుంది. ఇక మధుమితని మహాలక్ష్మి చూసి దగ్గరకు వెళ్తుంది.
మహాలక్ష్మి: మధు.. నీతో కాస్త మాట్లాడాలి. ఇప్పుడే మన లాయర్ గారు ఫోన్ చేశారు ఎవిడెన్స్ అన్నీ సూర్యకు వ్యతిరేకంగా ఉన్నాయి అంట. బెయిల్ రాలేదు అని చెప్పారు. అంతే కాదు కేసు నుంచి బయట పడటానికి సూర్యకు కాస్త టైం పడుతుంది అని అన్నారు. సారీ మధు.
మధు: అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి. మీరు నా విషయంలో సూర్య విషయంలో చాలా చేస్తున్నారు. మీ మంచి తనాన్ని ఇటు సీత, అటు సూర్య అర్థం చేసుకోలేకపోతున్నారు. సూర్య అయితే నేను ఇక్కడ ఉండటం గురించి చాలా తప్పుగా అవమానకరంగా మాట్లాడాడు. రామ్ గారిని కూడా ఇబ్బంది పెట్టాడు. ఆ విషయంలో నేనే మీకు సారీ చెప్పాలి. సీత తరుఫున కూడా సారీ అండీ. వీళ్ల మాటలు సీత చాటుగా వింటుంది.
మహాలక్ష్మి: సీత గురించి వదిలేయ్ మధు నాకు అలవాటు అయిపోయింది. కానీ సూర్య మాటలే నాకు షాకింగ్‌గా ఉన్నాయి. నీకు ఇలా చెప్తున్నా అని ఏం అనుకోవద్దు. ఇప్పుడే నీ గురించి సూర్య రేపు రీలీజ్ అయితే ఇంకా ఎలా మాట్లాడుతాడా అని కంగారుగా ఉంది. ఆడది దేన్ని అయినా సంహించోచ్చు కానీ అనుమానాన్ని అవమానాన్ని భరించకూడదు మధు. ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఆడదాని శీలాన్ని వ్యక్తిత్వాన్ని తప్పు పడితే అది భర్తైనా, తండ్రి అయినా ఎవరైనా ఆఖరికి కన్న బిడ్డలు అయినా ఎదురించాలి. అవసరం అయితే వాళ్లతో విడిపోవాలి.
సీత: ఈవిడ ఈ విషయాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది.
మహాలక్ష్మి: అనుమానించే సూర్య నీకు అవసరమా మధు. సూర్యని నువ్వు వదిలించుకోవచ్చు కదా. నీ మంచి కోరి చెప్తున్నా.. ముందు ముందు నువ్వు సూర్య వల్ల చాలా ఇబ్బందులు పడతావ్. నీ బతకు నాశనం అవుతుంది. సూర్య నీకు తగిన వాడు కాదు మధు. ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ ఒప్పులుగా కనిపిస్తాయి. పెళ్లి అయితే తప్పులు తెలుస్తాయి. సూర్యని పెళ్లి చేసుకొని తప్పు చేశావు. ఆలోచించి చెప్పు మధు నువ్వు సరే అంటే సూర్యతో నీకు విడాకులు ఇప్పిస్తాను. నేనే దగ్గరుండి నీకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మనసులో.. మంచి సంబంధం అంటే మా రామ్‌కు నీకు పెళ్లి చేస్తాను అని అర్థం. బాగా ఆలోచించుకో మధు. నేను ఉండగా నీకు ఏ లోటు ఉండదు. నీ లైఫ్‌ని నేను సెట్ చేస్తా. త్వరగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు.
సీత: తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ఇక్కడ పరిస్థితి ఏం బాలేదమ్మా.. అక్కని వీళ్లు పూర్తిగా మార్చేస్తున్నారు. అక్క నా మాటలు నమ్మడం లేదు. అక్క పూర్తిగా వాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. వీళ్ల వల్ల అక్క జీవితం నా జీవితం కూడా ఇబ్బందుల్లో పడేలా ఉంది. అక్క ఇక్కడే ఉంటే మామకు నేను సూర్య బావకి అక్క దూరమయ్యే పరిస్థితి వస్తుంది.
శివకృష్ణ: అంత వరకు వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా. ఆ మహాలక్ష్మి ని ఎన్‌కౌంటర్ చేస్తాను తర్వాత ఏమైనా పర్లేదు.
సీత: మీరు నేను చెప్పినట్లు చేస్తారా నాన్నా.
శివకృష్ణ: చెప్పమ్మా చేస్తాను.
సీత: అయితే ఒక పని చేయండి నాన్న అని చెప్తుంది.
సీత: మామ అత్తయ్య రాసిన డైరీ ఒకటి నేను మన స్టోర్ రూంలో చూశాను.
రామ్: ఏంటి మా అమ్మ డైరీనా..
సీత: అవును మామ చాలా రాసింది. అత్తమ్మ రాసినప్పటికి మీరు ఇంకా పుట్టలేదు. అత్తయ్య తన గురించి తన పుట్టించి గురించి రాశారు. తనకు అన్నయ్య ఉన్నారు అంట. ఆయనతో గొడవ పడి బయటకు వచ్చేశారు అంట.
రామ్: ఎవరు ఆ అన్నయ్య. ఏంటి ఆ వివరాలు.. వాటి గురించి అమ్మ ఏం రాయలేదా..
సీత: రాసినట్లున్నారు కానీ ఆ పేజీలు చింపేసి ఉన్నాయి. ఆ పేజీలు ఉంటే మీ మేనమామ ఎవరో ఎక్కడుంటారో అన్నీ తెలిసేవి. వాటిని ఎవరో కావాలి అనే చింపేసినట్లున్నారు. సొంత ఇంట్లోనే అత్తయ్యకి శత్రువులు ఉన్నారు.
రామ్: ఆ డైరీ ఎక్కడుందో ఆ పేజీలు కూడా అక్కడే ఉంటాయి పద వెళ్లి వెతుకుదాం.
సీత, రామ్‌లు స్టోర్ రూంలో డైరీ పేజీల కోసం వెతికితే మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. రామ్‌ని పిలుస్తుంది. ఇక్కడేం చేస్తున్నారు అని అంటుంది.
రామ్: అదేం లేదు పిన్నిఈ రూంలో సీత మా అమ్మ డైరీ చూసింది అంట. వాటిలో కొన్ని పేజీలు మిస్ అయ్యాయి అంట. వాటి కోసం వెతుకుతున్నాం.
మహాలక్ష్మి: మిస్ అయిన పేజీలతో మీకు ఏం పని.
సీత: అందులో మా అత్తమ్మ తన పుట్టింటి గురించి రాసింది అత్తయ్య. అత్తయ్య మీరు మా అత్తమ్మ డైరీ చదివారా..
మహాలక్ష్మి: లేదు.. చదవలేదు. ఇక అక్కడున్న ఓ పేపర్ ముక్కను మహాలక్ష్మి చూస్తుంది. షాక్ అయిపోతుంది. కాలితో ఆ పేపర్‌ను అందుకుంటుంది. దాన్ని చింపి పడేస్తుంది.
మహాలక్ష్మి: ఆ రోజు ఇంట్లో సుమతి ఫొటో కాల్చేశానే. ఈ రోజు సుమతి ఎవరో తెలిపే చివరి అవకాశాన్ని చింపేశాను. శివకృష్ణ ఇంట్లో ఉన్న ఆ ఒక్క ఫోటో కూడా లేకుండా చేయాలి.
ఇక హాల్‌లో అందరూ కూర్చొని ఉంటారు. జనార్థన్ మధుమితని రామ్‌తో సిటీ అంతా చూసి రమ్మని చెప్తాడు. ఇక మహాలక్ష్మి కూడా మధుని వెళ్లమని అంటుంది. ఇక ఇద్దరు ఆడవాళ్లు అక్కడికి వచ్చి గృహా ప్రవేశం కోసం పిలుస్తారు. మధుమిత తమ కోడలు అనుకొని మాట్లాడుతారు. రామ్‌కి సరైన జోడీ అని తగిన కోడలు దొరికింది అని చెప్పి.. ఇక మధుమితకు కూడా కుంకుమ పెట్టి నువ్వు కూడా మీ అత్తయ్యతో కలిసి రావాలి అని చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
'త్రినయని' సీరియల్ మార్చి 23rd: గాయత్రీ పాపను ఫొటో దగ్గరకు తీసుకెళ్లి ఆ పని చేసిన సుమన, తిలోత్తమ!