Seethe Ramudi Katnam Serial Today March 15th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కారులో రామ్, మధుమితలను చూసేసిన శివకృష్ణ ఫ్యామిలీ.. భార్య మీద సూర్యకు అనుమానం!
Seethe Ramudi Katnam Serial Today Episode సూర్యని కలవడానికి వెళ్లిన మధుమితను సూర్య అనుమానంతో అవమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Telugu Serial Today Episode: సీత మహాలక్ష్మిని మీరు పేరుకే లక్ష్మి అని నిజంగా లక్ష్మిదేవి కాదు అని అంటుంది. దానికి మహాలక్ష్మి ఇంత పేరు పలుకుబడి ఆస్తి ఉన్న నేను లక్ష్మి దేవి కాకపోతే మరేంటి అని సీతని ప్రశ్నిస్తుంది. దీంతో సీత మీరు చెప్పుకుంటున్న ఈ ఆస్తి అంతా మా అత్తమ్మ సుమతి గారిదని అంటుంది.
మహాలక్ష్మి: ఆ సుమతి స్థానంలో ఇప్పుడు నేను ఉన్నాను.
సీత: పులి తోలు కప్పుకున్నంత మాత్రాన తోడేలు పులి కాలేదు.
మహాలక్ష్మి: సీతా...
సీత: అరవకండి.. మీరు ఆట మొదలు పెడితే నేను ముగిస్తాను.
మహాలక్ష్మి: నా ఆట పద్మహ్యూహమే చిక్కుకుంటే ప్రాణాలు దక్కవు.
సీత: మీ ఆట ఏదైనా నేను తిప్పి కొడతాను.
మహాలక్ష్మి: మాటలు చెప్పినంత ఈజీ కాదే నన్ను గెలవడం.. నువ్వు ఇలాగే అనుకుంటూ ఉండు అతి త్వరలో నేను అనుకున్నది సాధించి చూపిస్తా.. అయినా మీ సూర్య బావను పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్నారు అంట. అటునుంచి అటే జైలుకి వెళ్తాడేమో...
మరోవైపు సూర్యని పోలీసులు కోర్టుకు తీసుకెళ్లడానికి రెడీ అవుతారు. అప్పుడే మధుమిత, రామ్ అక్కడికి వస్తారు. సూర్య మధుని కోపంగా చూస్తాడు. మధు, రామ్‌లు కలిసి రావడంతో రగిలిపోతాడు.
మధు: సూర్య ఏంటి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు.
సూర్య: కోపంతో.. కోర్టుకి అటునుంచి అటే జైలుకి కూడా తీసుకెళ్తారు.
మధు: అదేంటి సూర్య అలా మాట్లాడుతున్నావ్..
సూర్య: నువ్వు చేసిన పనికి ఇంకా ఎలా మాట్లాడమంటావ్.. నీ గురించి నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఇది వరకు మధువి కాదు పూర్తిగా మారిపోయావ్.. అప్పుడు నీ కంటికి నేను హీరోలా కనిపించాను. ఇప్పుడు వేస్ట్ ఫెలోలా కనిపిస్తున్నాను.
మధు: నేను మారిపోవడం ఏంటి సూర్య. అయినా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే నాకు హీరోవి..
సూర్య: నేను హీరోని ఏంటి మీ నాన్న నన్ను విలన్‌ని చేసేశాడుగా.. నీ చేయి పట్టుకున్న పాపానికి నా చేతికి సంకెళ్లు వేశాడు. నువ్వు నా మీద అలసత్వం చూపిస్తున్నావు. అయినా నీకు పెద్ద పెద్ద వాళ్లతో స్నేహాలు డబ్బున్న వారితో కలిసిపోయావు కదా..
రామ్: మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా పిన్ని మధుమిత గారిని మా ఇంటికి తీసుకొచ్చింది. మిమల్ని విడిపించడానికి ప్రయత్నిస్తుంది.
మధు: అవును సూర్య.. నీతో మాట్లాడటానికే నేను రామ్ గారు వచ్చాం.
సూర్య: కవర్ చేయకు నువ్వు నాతో మాట్లాడాలి అనుకొని ఉంటే అక్కడికి వెళ్లకముందే వచ్చేదానివి. నాతో చెప్పదానివి. అంతేకాని ఇలా కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు వచ్చేదానివి కాదు.
రామ్: మధుమిత గారిని మా ఇంటికి తీసుకెళ్లడం ఈ ఊరి అందరికీ తెలీడం ఇష్టం లేకే మా పిన్ని మీతో చెప్పకుండా తీసుకొచ్చింది సూర్య..
సూర్య: అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారు.
మధు: నిన్ను చూడాలని నేను రామ్‌ని తీసుకొని వచ్చాను సూర్య. నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను సూర్య..
సూర్య: మీరందరూ ఎలాంటి వాళ్లో నాకు బాగా తెలుసు. నా కళ్ల ముందు నుంచి వెళ్లిపోండి.. అని సూర్య మధుమితని తోసేస్తాడు. అప్పుడ రామ్ పట్టుకుంటాడు. అది చూసి సూర్య రగిలిపోతాడు. సూర్య వెళ్లిపోవడంతో మధు ఏడుస్తుంది. సూర్య దారుణంగా మాట్లాడుతున్నాడని రామ్‌తో చెప్పి ఏడుస్తుంది. రామ్ మధుమితని ఓదార్చుతాడు. తర్వాత ఇద్దరూ బయల్దేరుతారు.
మరోవైపు సీత తన గదిలో కూర్చొని బాధపడుతుంది. ఇక రేవతి, చలపతి అక్కడికి వస్తారు. మహాలక్ష్మి ఇలాంటి దారుణాలకే పాల్పడుతుంది అని అంటారు.
రేవతి: సీత అసలు మీ బావను డ్రగ్స్ కేసులో ఇరికించిందే మహాలక్ష్మి ఏమో అని డౌట్ వస్తుంది.
చలపతి: మహాలక్ష్మి అంతటి సమర్దురాలే. తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తుంది.
రేవతి: ఏది ఏమైనా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రామ్‌ని నీ గ్రిప్‌లో ఉండేలా చూసుకో..
సీత: నా మామ మీద నాకు నమ్మకం ఉంది నన్ను మోసం చేయరు.
చలపతి: కానీ మీ అక్క మీద మాకు అనుమానం ఉంది సీత. తను అన్నింటికి అతిగా మహాలక్ష్మి మీద ఆధారపడుతుంది.
సీత: అక్కకి ఊరులో ఎలాంటి సాయం లేదు బాబాయ్. ఏం చేయలేని స్థితిలో అత్తయ్యతో వచ్చేసింది. మా అక్కకు సాయం లేక ఇక్కడికి వచ్చింది కానీ సూర్య బావ అంటే తనకు ప్రాణం.
లలిత: ఈరోజు మీరు స్టేషన్‌కు వెళ్లలేదు ఏంటండి.
శివకృష్ణ: ఈరోజు సూర్యని కోర్టులో హాజరుపరుస్తారు. అది చూడటం ఇష్టం లేక ఉండిపోయాను. ఆధారాలతో పాటు దొరికాడు కాబట్టి నేను సూర్యకు వ్యతిరేకంగా చెప్పాల్సి వస్తుంది. అసలు నా పెంపకంలో ఏదో తప్పు ఉంది అందుకే మధు అలా చేసింది.
ఇంతలో రామ్ మధుమితలు వెళ్తున్న కారు కరెక్ట్‌గా శివకృష్ణ ఇంటికి ఎదురుగా ఆగిపోతుంది. ఇక శివకృష్ణ వాళ్లు ఇంటి ముందు ఎవరి కారు ఆగిందా అని చూడటానికి బయటకు వస్తారు. రామ్ కారు రిపేర్ చేస్తుంటే వచ్చి మాట్లాడుతారు. రామ్ కూడా కంగారు పడతాడు. మధుమిత ముఖం చాటేసుకుంటుంది. మధుని చూసి సీత అనుకొని పరుగులు తీస్తారు. మధుని చూసి షాక్ అవుతారు.
లలిత: అల్లుడి గారితో నువ్వు వచ్చావేంటే..
శివకృష్ణ: కారులో నువ్వు ఉన్నావ్ వేంటి.. ఇక చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఒక అల్లుడితో ఇంకో కూతురు రావడం ఏంటో అని సూటిపోటి మాటలు అంటారు.
శివతల్లి: మనం అనవసరంగా కంగారు పడ్డాం. సీత మధుమితని ఒప్పించి ఇంటికి పంపిస్తా అని చెప్పింది కదా అందుకే మధు వచ్చింది.
రామ్: సారీ అంకుల్ నేను మధుమితని డ్రాప్ చేయడానికి ఇక్కడికి తసుకొని రాలేదు. తను సూర్యని కలవాలి అంటే తీసుకొచ్చా. సూర్యని కలిసి తిరిగి వెళ్తేంటే మీ ఇంటి ముందు కారు ఆగిపోయింది.
శివకృష్ణ: అంటే నువ్వు మనసు మార్చుకొని ఇంటికి రాలేదన్నమాట.
లలిత: ఎలాగూ వచ్చావ్ కదా మధు ఇక్కడే ఉండిపో..
రామ్: మధు ఇక్కడ ఉండటం కుదరదు అండీ. సూర్యని చూపించి తిరిగి తీసుకురమ్మని మా పిన్న చెప్పింది. ఇక ఎవరు ఏం చెప్పినా రామ్ వినిపించుకోకుండా మధుని తీసుకెళ్తా అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.