Seethe Ramudi Katnam Serial Today January 23rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత కిడ్నాప్.. షాక్‌లో ఫ్యామిలీ.. ఏసీపీ ఎంట్రీ.. రౌడీలు సీతని చంపేస్తారా?
Seethe Ramudi Katnam Today Episode ప్రీతి, ఉషలు దారిలో వదిలేయడం మహా రౌడీలు సీతని కిడ్నాప్ చేయడం చలపతి ఆ విషయం ఇంట్లో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత ఇద్దరు మరదళ్లతో కలిసి గుడికి బయల్దేరుతుంది. మహాలక్ష్మీ ప్రీతితో ప్లాన్‌లో ఏ తేడా రాకూడదు అని చెప్తుంది. అందరూ దగ్గరుండి వాళ్లని గుడికి పంపిస్తారు. జనార్థన్ విద్యాదేవితో వాళ్లకి ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడు. మహాలక్ష్మీ మనసులో ముందు సీత సంగతి చెప్పి తర్వాత ఈ సుమతి సంగతి చెప్తా అనుకుంటుంది. టీచర్ దేవుడి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటుంది. సీత క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటుంది. ఇంతలో దేవుడి దగ్గర దీపం కొండెక్కిపోతుంది.
టీచర్ చాలా కంగారు పడుతుంది. కచ్చితంగా ఏదో జరగబోతుందని సీతకి ఏమైనా అపాయం జరబోతుందా? ప్రీతి, ఉషలు కానీ మహాలక్ష్మీ, అర్చనలు కానీ ఏమైనా చేయబోతున్నారా? సీత, రామ్‌లు విడిపోతారా? ఏంటి ఈ అపశకునాలు అసలు ఏం జరగబోతున్నాయో అని చాలా కంగారు పడుతుంది. సీత వాళ్ల కారు వచ్చే దారిలో నాగు రౌడీలతో కాపు కాస్తుంటాడు. ఇక కారులో ఉన్న ఉష ఎక్కిళ్లు వస్తున్నాయి అని హడావుడి చేస్తుంది. దీనికి ఎక్కిళ్లు వస్తే తగ్గవు అని ప్రీతి టెన్షన్ పడుతుంది. సీత కారు ఆపి వాటర్ బాటిల్ తీసుకొస్తానని కారు దిగుతుంది. సీత వాటర్ బాటిల్‌కి వెళ్లగానే ప్రీతి డ్రైవర్‌తో కారు పోనిమని చెప్తుంది. సీత మేడం రావాలి కదా అంటే అవసరం లేదని వెళ్లిపోతారు. సీత కారు వెనక పరుగులు తీస్తుంది.
ఇక నాగు తన రౌడీలతో వ్యాన్‌లో సీత వెనక ఫాలో అవుతాడు. ఇక వెంటనే సీత ప్రీతికి కాల్ చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు ఆటపట్టిస్తున్నారా లేక కావాలనే ఇలా చేస్తున్నారా అని అనుకుంటుంది. ఇక మహాలక్ష్మీ, అర్చనలు నాగు ఫోన్ కోసం ఎదురు చూస్తుంటారు. నాగు కాల్ చేసి సీత కనిపించింది నా కళ్ల ముందే ఉందని అంటాడు. ఇక సీత రామ్‌కి కాల్ చేస్తుంది కానీ రామ్ కాల్ కలవదు. తర్వాత సీత చలపతికి కాల్ చేస్తుంది. ప్రీతి, ఉషలు దారి మధ్యలో దించేశారని సీత చలపతితో చెప్తుంది. నాగు వచ్చి సీతతో లిఫ్ట్ కావాలా అని మాట్లాడటం చలపతి వింటాడు. ఆటోలో ఇంటికి వచ్చేయ్ అని అంటాడు. దానికి సీత ప్రీతి, ఉషలతో ఇంటికి వస్తానని అంటుంది. ఇక రౌడీలు సీతని తీసుకెళ్లిపోతారు. సీతకి ఏదో జరగబోతుందని చలపతి హడావుడిగా ఇంటికి వెళ్లి అందరినీ పిలుస్తాడు.
సీత కిడ్నాప్ అయిందని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. ఎవరు చెప్పారు అని జనార్థన్ అడిగితే సీత తనతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఎవరో వ్యాన్‌లో ఎక్కించుకొని వెళ్లిపోయారని చెప్తాడు. టీచర్ చాలా కంగారు పడతారు. ప్రీతి, ఉషలు మధ్యలోనే కారులో నుంచి దించేసి వెళ్లిపోయారని చెప్తాడు. ప్రీతి, ఉషలు అలా ఎందుకు చేస్తారని మహాలక్ష్మీ, అర్చనలు అంటారు. సీతకి టీచర్ కాల్ చేస్తుంది. సీత కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. చలపతి మహాలక్ష్మీని ప్రీతి, ఉషలకు కాల్ చేయమని చెప్తుంది. జనార్థన్ తన ఫ్రెండ్ ఏసీపీకి కాల్ చేసి విషయం చెప్తారు. దాంతో ఏసీపీ సీత ఫొటో, ఫోన్ నెంబరు అడుగుతారు. అనవసరంగా ఈ రోజు గుడికి పంపారని చలపతి మహాలక్ష్మీ, అర్చనల వల్ల అయిందని అంటాడు. మరోవైపు సీత తల్లి సీత గురించి ఆలోచిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: రోడ్లు ఊడుస్తున్న సత్య.. పాపం అని చేస్తుందా.. ప్రచారం కోసం చేస్తుందా!





















