అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today January 19th - 'సీతే రాముడి కట్నం' సీరియల్: గిరిధర్‌ని చితక్కొట్టేసిన రౌడీలు, సీతకు హగ్‌ ఇచ్చి ఆ పని చేయకుండా అడ్డుకున్న రామ్

Seethe Ramudi Katnam Serial Today Episode: సీత గిరిధర్ గురించి రౌడీల ముందు బిల్డప్ ఇవ్వడంతో ఇంటికి వచ్చి రౌడీలు గిరిధర్‌ని చితక్కొట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode: సీతని బాగా ఏడిపించామని గిరిధర్ అంటే దానికి అర్చన మహా మనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది కదా ముందు ముందు సీతని ఇంకా ఇబ్బంది పెట్టాలి అని భర్తతో అంటుంది. వాళ్ల మాటలను సీత విని సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోతుంది. 

గిరిధర్: చూశావా.. సైలెంట్‌గా వెళ్లిపోయింది బాగా భయపడినట్లుంది.
అర్చన: ఆ మాత్రం భయం ఉండాలి లేదంటే మహానే ఎదురిస్తుందా.. మనకే కౌంటర్లు వేస్తుందా.. 
గిరిధర్: ఈ విషయం తెలిస్తే మహా వదినా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. పద వెళ్లి చెప్దాం. 

మరోవైపు రౌడీలు వచ్చి గిరిధర్ గురించి గిరిధర్‌కే అడుగుతారు. సీత తన గురించి రౌడీలకు చెప్పిందని తెలియని గిరిధర్ వారి ముందు బిల్డప్ ఇస్తాడు. దీంతో రౌడీలు గిరిధర్‌ని చితక్కొట్టేస్తారు. సీత దూరం నుంచి చూసి తెగ సంతోషపడుతుంది. ఇక గిరిధర్‌కి వార్నింగ్ ఇచ్చి రౌడీలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. 

గిరిధర్: సీత మామూలుది కాదే నా మీద వారికి చెప్పి పగ తీర్చుకుంది. నడవ లేకపోతున్నానే నన్ను ఇంట్లోకి తీసుకెళ్లు. 
అర్చన: జాగ్రత్త అండి.. దెబ్బలు బాగా తగిలాయ్.  
చలపతి: ఏమైంది.. ఎవరు కొట్టారేంటి.
అర్చన: ఆ సీత ఏది.. సీత కావాలనే ఇద్దరు రౌడీలను పెట్టి కొట్టించింది.
చలపతి: సీత అలా చేయదే అసలు ఏం జరిగింది చెల్లి. అర్చన మొత్తం చెప్తుంది. బావ సీతతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. జాగ్రత్త. 
గిరిధర్: ఈ విషయం వదినకు చెప్పకపోవడమే బెటర్. రామ్‌తో చెప్దాం. వాడు ఆఫీస్ నుంచి వచ్చే వరకు నేను ఇలానే ఉంటాను. 
రామ్: టైలరింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. సీత వల్ల ఈ ఇంట్లో ఇంకేం ప్రాబ్లమ్ రాకుండా చూడు తల్లీ.
అర్చన: రామ్.. 
రామ్: ఏంటి బాబాయ్ ఆ దెబ్బలు ఏంటి..
అర్చన: అంతా నీ పెళ్లం వల్లే బాబు.
రామ్: సీత కొట్టిందా..
గిరిధర్: వీధి రౌడీలను ఇంట్లోకి తెచ్చి కొట్టించింది రామ్.
రామ్: సీత రౌడీలను మెంటైన్ చేస్తుందా.. 
అర్చన: తనే ఓ పెద్ద రౌడీ కదా.. 
రామ్: ఇంత చేసిందా.. 
గిరిధర్: నువ్వేం చేస్తావో నాకు తెలీదు రామ్.. నువ్వు సీతని తీసుకొచ్చి సారీ చెప్పించు లేకపోతే నేను ట్రీట్మెంట్ కూడా చేయించుకోను.
రామ్: దేవుడా మరో ప్రాబ్లమ్ మొదలా.. ఓసేయ్ సీతా.. 
సీత: మామా.. నువ్వు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేశావా.. ఏంటి ఈరోజు ఇంత తొందరగా వచ్చేశావు. ఈ ముద్దుల భార్యని చూడాలి అనిపించిందా.. మరీ అంత ప్రేమ అయితే ఎలా మామ.
రామ్: నీతో మాట్లాడాలి సీత. ముందు నామీద చేతులు తీయ్. ఏంటి నువ్వు చేసిన పని. బయట ఎవరో రౌడీలకు మా గిరి బాబాయ్ గురించి చెప్పావంట.. వాళ్లు వచ్చి మా బాబాయ్‌ని కొట్టేసి వెళ్లారంట.
సీత: ఏంటి.. నేను గిరిధర్ మామయ్య గురించి గొప్పగా చెప్తే వాళ్లు కొట్టారా.. మీ బాబాయ్‌ని కొట్టిన ఆ రౌడీలను నేను ఊరికే వదలను. ఇప్పుడే వెళ్లి వాళ్ల అంతు చూస్తాను. అని బెడ్ కింద దాచిన పెద్ద కత్తి తీస్తుంది. 
రామ్: ఏంటిది ఇంత పెద్ద కత్తి ఎందుకు. ఇంత పెద్ద కత్తి బెడ్ కింద ఎందుకు దాచావ్.. వాళ్లిద్దరినీ చంపేస్తావా..
సీత: నరికేస్తాను. మా మామయ్య జోలికి వచ్చిన వారిని వదిలేస్తానా.. కొబ్బరి బొండాలు నరికి నట్లు వాళ్ల తలలు ఎగరేస్తాను. 
చలపతి: ఏంటి బావ నువ్వు ఇంకా హాస్పిటల్‌కి వెళ్లలేదా..
గిరిధర్: నేను హాస్పిటల్‌కి వెళ్లడం కాదు ఆ సీతని మెంటల్ హాస్పిటల్‌కి పంపిస్తాను.
రామ్: సీత ఆగు సీత..
సీత: నన్ను వదులు ఆ ఇద్దరినీ వేసేసే దాకా నేను అస్సలు ఊరుకోను. 
చలపతి: సీత ఇద్దరిని వేసేస్తా అంటుంది. కొంపతీసి ఆ ఇద్దరు మీరేనా బావ.. గిరిధర్.. అర్చనలు ఉద్దేశించి.. 

ఇక సీత తమనే చంపడానికి వస్తుంది అని గిరిధర్, అర్చనలు సీతకు క్షమాపణ చెప్పడానికి సిద్ధమైపోతారు. ఇంతలో చలపతి భార్య వచ్చి మిమల్ని రౌడీలను చంపుతుంది అంట మిమల్ని కాదు అని అంటుంది. మరోవైపు సీత వెనక రామ్ పరుగులు పెడతాడు. సీత వెళ్లకుండా హగ్ చేసుకుంటాడు. ఇక సీత కావాలనే అర్చన, గిరిధర్‌లు చూస్తున్నారు అని రొమాన్స్ చేసినట్లు చేస్తుంది. ఇక రామ్ సీతని ఎత్తుకొని తన గదికి తీసుకెళ్లిపోతాడు. సీత అర్చన వాళ్లు వైపు చూసి కన్ను కొడుతుంది. సీత మనల్ని కావాలనే ఫూల్‌ని చేసిందని గిరిధర్ అర్చనతో అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read:  'సత్యభామ' సీరియల్ జనవరి 19th: సత్య తన ప్రేమకు ఓకే చెప్పిందన్న భ్రమలో క్రిష్, వదినమ్మా అంటూ నిజం చెప్పిన కాళీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget