Seethe Ramudi Katnam Serial Today February 22nd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కన్నీటితో సుమతికి కడసారి వీడ్కోలు.. ఇక సీత జైలుకే!
Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవినే సుమతి అని తెలుసుకున్న రామ్, జనార్థన్ అంతా కన్నీరు మున్నీరు అయి అంత్యక్రియలు పూర్తి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవినే సుమతి అని శివకృష్ణ వీడియో అందరికీ చూపిస్తాడు. రామ్ గతంలో విద్యాదేవితో తాను ప్రవర్తించిన తీరు ఆమె మీద కోప్పడటం అన్నీ గుర్తు చేసుకొని అమ్మా అంటూ గుండె పగిలేలా ఏడుస్తాడు. రామ్ ఏడ్వడం చూసి సీత, లలిత, శివకృష్ణ చాలా ఏడుస్తారు.
రామ్: అమ్మా సారీ అమ్మ నువ్వు నా కన్న తల్లి అని సీత ఎంత చెప్పినా నమ్మకుండా నిన్ను ఎన్నో సార్లు అవమానించాను. అనకూడని మాటలు ఎన్నో అన్నాను నన్ను క్షమించమ్మా.
జనార్థన్: సుమతితో తన పెళ్లి గుర్తు చేసుకొని సుమతి అని ఏడుస్తాడు. నన్ను క్షమించు సుమతి నువ్వు నా కళ్ల ముందే ఉన్నా గుర్తించలేని గుడ్డివాడిని అయ్యాను. నువ్వే సుమతి అని నువ్వు ఎన్నో సార్లు పరోక్షంగా చెప్పినా అర్థం చేసుకోలేకపోయాను. వెరీ వెరీ సారీ సుమతి.
మహాలక్ష్మీ: అయ్యో అయ్యో సుమతి నువ్వు విద్యాదేవి కాదా నా ప్రాణ స్నేహితురాలు సుమతివా. సీత వేషాలు నమ్మలేక నిన్ను దూరం పెట్టాను సుమతి. ఫ్రెండ్‌ని అయ్యిండి నిన్ను గుర్తించలేకపోయాను. ఈ తెలివి తక్కువ దాన్ని క్షమించు సుమతి.
అర్చన: ఓసినీ వేషాలు ఏం నటిస్తున్నావ్ మహా నేను మాత్రం తక్కువ ఇప్పుడు చూడు.. అయ్యో సుమతి అక్క నన్ను క్షమించు అక్క.
గిరి: వదినా..
పంతులు: సమయం అవుతుందండి.
రామ్: తల కొరికి నేను పెడతా పంతులు గారు. నా చెల్లి ప్రీతి రావాలి అమ్మని ఆఖరి చూపు చూడాలి.
మహాలక్ష్మీ: రామ్ ప్రీతి వాళ్ల ఆయన ఫారెన్ వెళ్లారు రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు ఆపలేం కదా.
జనార్థన్: ప్రీతికి తర్వాత చెప్దాం కార్యక్రమం కానిద్దాం రామ్.
రామ్: ప్రీతికి అమ్మ చివరి చూపు దక్కాలి కదా నాన్న.
మహాలక్ష్మీ: ఇప్పుడు అంత టైం లేదు రామ్ సాయంత్రంలోపు కార్యక్రమం పూర్తవ్వాలి.
సుమతి శవాన్ని తీసుకొని బయల్దేరుతారు. సీత తల్లిని పట్టుకొని అమ్మా అత్తమ్మా అని ఏడుస్తుంది. మహాలక్ష్మీ కొడుకు గౌతమ్‌కి కాల్ చేసి సుమతి చనిపోయిందని సీత పేరు చెప్పిందని సీతే మర్డర్ చేసిందని అందరిని నమ్మించానని గౌతమ్‌తో చెప్తుంది. నువ్వు కొట్టిన దెబ్బకి రెండు పిట్టలు రాలిపోయావని అంటే నేను ఇప్పుడు రావొచ్చా అంటే ఇప్పుడు కాదు సీత జైలుకి వెళ్లిన తర్వాత రమ్మని అంటుంది. తర్వాత మహాలక్ష్మీ త్రిలోక్‌కి కాల్ చేస్తుంది. నాకు అన్నీ తెలుసు సీతని అరెస్ట్ చేయాలి అంతే కదా అంటాడు. రేపు వచ్చి సీతని అరెస్ట్ చేస్తానని అంటాడు.
సుమతి శవానికి రామ్ అంత్యక్రియలు చేస్తాడు. తల్లికి తలకొరివి పెడతాడు. సీత ఆరు బయట కూర్చొనే ఏడుస్తుంది. శివకృష్ణ, లలితలు ఈ టైంలో వెళ్లొస్తా అని చెప్పకూడదు వెళ్లాం సీత అని అంటారు. సుమతి అత్తమ్మ పరిపూర్ణమైన జీవితం గడిపిందని ప్రీతి పెళ్లి చేసిందని నేను రామ్ సంతోషంగా ఉండటం చూసిందని మామయ్యని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు అయినా సంతోషంగా ఉందని అత్తమ్మ చివరి రోజుల్లో నాతో అపార్థాలు రావడమే బాధగా ఉందని సీత అంటుంది. దాంతో లలిత వాళ్లు మీ అత్తమ్మకు నువ్వే ప్రాణం అని అంటారు. ఇంతలో రామ్ వస్తే సీత బాధ్యత అప్పగిస్తారు. సీత చేయి ఎన్నిటికీ వదలనని అంటాడు. సీతకి నువ్వే శ్రీరామరక్ష అని చెప్తారు.
జనార్థన్ సుమతి ఫొటో ముందు కూర్చొని విద్యాదేవిగా సుమతి తనతో సంతోషంగా గడిపిన రోజులు గుర్తు చేసుకొని ఏడుస్తాడు. రెండు రూపాల్లో నాకు తోడు ఉంటూ మన కుటుంబం కోసం చాలా కష్టపడ్డావని నిన్ను గుర్తించలేక రెండు సార్లు దూరం చేసుకున్నానని కుమిలిపోతాడు. మహా, అర్చన, గిరిలు అక్కడికి వస్తారు. మహా భర్తతో సుమతి మన మధ్య లేకపోయినా ఎప్పటికీ గుర్తుంటుందని అంటుంది. ఇక అర్చన, గిరిలు సీత సుమతిని బలి అయిపోయిందని అంటారు. చలపతి వచ్చి వాళ్లతో గొడవ పడతాడు. అనవసరంగా సీతని ఏం అనొద్దని అంటాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి జనార్థన్ వెళ్లిపోతాడు. తల్లిని గుర్తు చేసుకొని రామ్ ఏడుస్తాడు. ఇంతలో సీత వస్తుంది. అత్తమ్మ చావుకి నేను కారణం అని నీకు చిన్న అనుమానం ఉండొచ్చు ఎందుకంటే భార్య కంటే కన్నతల్లి ఎక్కువ అని తెలుసు అని నాకు తెలుసు అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాల కోసం గడప దాటిన త్రిపుర.. ఫణి పేరున రిజిస్ట్రేషన్ ఆపుతుందా!!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

