Seethe Ramudi Katnam Serial Today February 13th: సీతే రాముడి కట్నం సీరియల్: సూర్యకి జాబ్ ఇప్పించింది తానేనని మధుతో చెప్పిన మహాలక్ష్మి
Seethe Ramudi Katnam Serial Today Episode పక్కింటిలో పెళ్లి చూపులకు వెళ్లిన సీతను లాక్కొని రమ్మని రామ్‌ని మహాలక్ష్మి పంపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode: మధులతకి మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది. మధు అండీ అంటూ మాట్లాడితే మహాలక్ష్మి అత్తయ్య అని పిలవమని చెప్తుంది. మనం అత్తాకోడళ్లం అని నాకు నువ్వొకటి సీత ఒకటి కాదు అని చెప్పాలంటే సీత కంటే ఎక్కువే ఇష్టమని చెప్తుంది మహాలక్ష్మి. అయితే మధు మిమల్ని అత్తయ్య అని పిలవలేకపోతున్నాను అని అంటుంది. దీంతో మహా టైం వచ్చినప్పుడు నువ్వే అంటావ్ అంటుంది.
మహాలక్ష్మి: సూర్య జాబ్‌కి వెళ్లాడా..
మధు: సూర్యకి జాబ్ వచ్చినట్లు మీకు ఎలా తెలుసు. నేను ఇంకా సీతకి కూడా చెప్పలేదు. మీకు ఎవరు చెప్పారు.
మహాలక్ష్మి: సూర్యకు జాబ్ వచ్చినందుకు నువ్వు హ్యాపీనే కదా..
మధు: చాలా హ్యాపీనే అండీ రైట్ టైంలో జాబ్ వచ్చింది. మా కష్టాలు తీరినట్లే.
మహాలక్ష్మి: నేను ఉండగా నీకు కష్టం రానిస్తానా.. ఈ మహాలక్ష్మి ఉండగా నీకు ఎప్పుడూ ఏ లోటు రానివ్వను.
మధు: మీ అభిమానానికి థ్యాంక్స్ అండీ. ఇంతకీ సూర్యకి జాబ్ వచ్చిన విషయం మీకు ఎలా తెలుసో చెప్పలేదు.
మహాలక్ష్మి: నీకో విషయం చెప్తాను. అది నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి. ఇంకా ఎవరికీ తెలీకూడదు. సూర్యకి ఆ జాబ్ వచ్చినట్లు చేసింది నేనే. సూర్య జాబ్ కోసం వెతుకుతున్నాడు అని తెలిసి ఆ మార్కెటింగ్ కంపెనీ వాళ్లకి కాల్ చేసి జాబ్ ఇవ్వమని చెప్పాను. ఇందతా సూర్య కోసం కాదు నీకోసం. చెప్పాను కదా నువ్వంటే నాకు ప్రత్యేక మైన అభిమానం అని. నువ్వు కష్టపడితే నేను చూడలేను. సూర్యకు మా కంపెనీలోనే ఇంకా మంచి జాబ్ ఇవ్వొచ్చు. కానీ నేను ఇచ్చినట్లు అందరికీ తెలిసిపోతుంది అందుకే ఇలా ప్లాన్ చేశా. ఈ విషయం సూర్యకి కానీ సీతకి కానీ చెప్పొద్దు.
మధు: చెప్పనండీ. చాలా థ్యాంక్స్.. మహాలక్ష్మి గారు చాలా గ్రేట్ ఏమీ కానీ నా కోసం ఇంత చేస్తున్నారు.
మహాలక్ష్మి: ఏం చేసైనా సరే నిన్ను నా కోడల్ని చేసుకుంటాను మధుమిత. సీతకు నిన్ను పక్కలో బల్లెంలా తయారు చేస్తాను.
రామ్: సీత ఏది.. గదిలో లేదు. టెర్రస్ మీద లేదు.. హాల్‌లో ఉందా.. హాల్‌లో అందర్ని చూసి సీత గురించి వీళ్లని అడగటం బాగోదేమో.. మామయ్య సీతని చూశారా.. సీత కనిపించడం లేదు.
ప్రీతి: కింద కూడా సీత లేదు అన్నయ్య.
గిరిధర్: ఎవరికైనా చెప్పి వెళ్తే కదా తెలిసేది. ఎవరికీ చెప్పదు. ఎరికైనా చెప్పి వెళ్లాలి కదా.
మహాలక్ష్మి: రామ్ ఇప్పుడు సీతతో నీకు ఏంటి పని.
రామ్: ఏం లేదు పిన్ని తను కనిపించకపోయే సరికి.
చలపతి: కంగారు పడుతున్నావా రామ్. సీతకు ఏమైంది అని భయపడుతున్నావా.
రేవతి: కంగారు భయం అక్కర్లేదు రామ్ ఎవరికో భయపడి సీత ఎక్కడికో వెళ్లే రకం కాదు. ఇక్కడే ఉండి పోరాడే రకం. సీత నాతో చెప్పి పక్కింటికి వెళ్లింది. అక్కడ పెళ్లి చూపులు ఉన్నాయి అంటే సాయంగా వెళ్లింది.
గిరిధర్: పక్కింటికి వెళ్లిన సీత అక్కడ ఏదైనా సమస్య తీసుకొస్తే ఆ సమస్య వల్ల అక్కడ జరిగే పెళ్లి చూపులు ఆగిపోతే..
చలపతి: ఎందుకు బావ అంత ఆలోచిస్తున్నావ్.. సీత వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు.
మహాలక్ష్మి: అని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా అన్నయ్య. రామ్ నువ్వు వెళ్లి సీతని తీసుకొస్తావా.. నన్ను వెళ్లమంటావా..
రామ్: మీరు వద్దు పిన్ని నేను వెళ్లి తీసుకొస్తా.
చలపతి: రామ్ వెళ్లాడు సరే అక్కడ తను సీతకు ఏమవుతానని చెప్పి తీసుకొస్తాడో.
రేవతి: సీత ఎలాగూ ఈ ఇంటి కోడల్ని అని చెప్పదు. సీత తన భార్య అని రామ్ చెప్తేస్తాడేమో. అయినా భార్య అని చెప్పకుండా సీత చేయి పట్టుకొని రామ్ ఎలా తీసుకొస్తాడు.
పెళ్లి చూపుల దగ్గర పక్కింటి వాళ్లు సీతని తెగ పొగిడేస్తారు. అది రామ్ వింటాడు. సీత పెళ్లి వాళ్లతో కలుపుగోలుగా మాట్లాడుతుంటుంటే రామ్ సీతని ప్రేమగా చూస్తాడు. ఇక పెళ్లి వాళ్లు అమ్మాయి నచ్చిందని చెప్తారు. సీత అమ్మాయికి అబ్బాయి నచ్చాడా అని అడుగుతుంది. తను ఓకే అనడంతో మరిదికి కూడా అమ్మాయి నచ్చిందని చెప్తుంది. ఇక పెళ్లి కొడుకు తల్లి కట్నం గురించి మాట్లాడుతుంది. ఇంతకు ముందు ఏదో సంబంధం వచ్చిందని 20 లక్షలు.. అవి ఇవి కావాలని చెప్తుంది. ఇక పెళ్లి కూడా మీరే చేయాలి అని చెప్తారు.
దీంతో పెళ్లి కూతురు పేరెంట్స్ పర్సనల్‌గా మాట్లాడుకొని వచ్చి పెళ్లి చేస్తాం అని 10 లక్షలు మాత్రమే ఇవ్వగలం అని చెప్తారు. దీంతో పెళ్లి కొడుకు తల్లి ఇష్టమొచ్చినట్లు మాటలు అంటుంది. దీంతో సీత వాళ్లని ఆపి.. కూతురిలా సేవలు చేసే కోడలు కావాలా.. కట్న కానుకలు ఇచ్చానని పెద్దరికం చేసే కోడలు కావాలా అని క్లాస్ పీకుతుంది. దీంతో సీత మాటలకు వాళ్లు కరిగిపోతారు. పెళ్లికి ఓకే చెప్తారు. మరోవైపు సీత మాటలకు రామ్ ఫిదా అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.