అన్వేషించండి

Seethe ramudi katnam Serial Today August 30th: ‘సీతే రాముడి కట్నం సీరియల్‌ : కిరణ్ ను అవమానించిన మహా – నిశ్చితార్థం జరగదేమోనని భయపడ్డ రేవతి

Seethe ramudi katnam Today Episode: నిశ్చితార్థం జరగకుండా ఎలా చెడగొట్టాలో మహా, జనార్థన్ కు చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Seethe ramudi katnam Serial Today Episode:  మధును ఆఫీసులో అవమానించిన వాడిని చంపేస్తానని సూర్య వాళ్ల అన్నయ్య కత్తి తీసుకుని వెళ్లబోతుంటే ఆయన భార్య వచ్చి ఆపుతుంది. మగరాయుడిలా రోడ్లు పట్టుకుని తిరుగుతే ఇలాంటి అవమానాలే జరుగుతాయని మీరెందుకు వెళ్తారని ఆయన చేతిలో ఉన్న కత్తిని లాక్కుంటుంది. అలాగే సూర్యను కూడా తిడుతుంది. దీంతో సూర్య వాళ్ల అన్నయ్య లోపలికి వెళ్లిపోతాడు. మరోవైపు రామ్‌, సీత ఇంటిని అలంకరిస్తుంటారు. ఇంతలో గిరి, అర్చన వస్తారు.

అర్చన: అలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు వీళ్ల ఉత్సాహం చూస్తుంటే నవ్వోస్తోందండి.

గిరి: మరే జరగని నిశ్చితార్థానికి పొద్దునే ప్రయాస పడుతున్నారు.

చలపతి: నిశ్చితార్థం జరగదని మీరెలా అనుకుంటున్నారు.

అర్చన: మహాలక్ష్మీ ప్రమేయం లేకుండా ఈ ఇంట్లో ఏ వేడుకైనా జరిగిందా? అన్నయ్యగారు.

చలపతి: సీత తలుచుకుంటే జరగనిది ఏదీ లేదు చెల్లేమ్మా..?

గిరి: సీత చాలెంజ్‌ చేయడం అది మీరు నమ్మడం గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు ఉంది బావగారు.

రామ్‌: గుడ్డి వాళ్లం మేము కాదు బాబాయ్‌ మీరు. మీకు కళ్లున్న మనసు లేదు. అందుకే రేవతి అత్తయ్య అన్నయ్యలుగా మీరు నాన్నా చేయాల్సిన పనులు మేము చేస్తున్నాం.

అర్చన: మీ బాబాయికి మనసు లేకపోతే నీకు గౌరవ మర్యాదలు ఉన్నాయా? నిన్న ఆయన కాలర్‌ పట్టుకున్నప్పుడు నీ క్యారెక్టర్‌ ఏమైంది.

సీత: మాటను బట్టే మర్యాద ఉంటుంది. ప్రవర్తనను బట్టే గౌరవం ఉంటుంది చిన్నత్తయ్యా..

 అని సీత చెప్పగానే గిరి, అర్చన నోరు మూసుకుంటారు. తర్వాత సీతే రామును నాశనం చేస్తుందని అర్చన తిడుతుంది. దీంతే రామ్‌ నన్నెవరూ పాడు చేయడం లేదని చెప్తాడు. దీంతో గిరి, అర్చన లు ఇద్దరితో మనకేం పని మామ మనకు మహాలక్ష్మీ, జనార్ధన్‌ లతోనే పని అని సీత చెప్తుంది. మరోవైపు మహాలక్ష్మీ నైట్‌ నేను చెప్పింది గుర్తుంది కదా జనా అంటుంది. అంతా గుర్తుంది అంటాడు జనార్ధన్‌. ఇద్దరూ కలిసి సీతను ఎలా వెళ్లగొట్టాలో ప్లాన్‌ చేస్తారు. మరోవైపు రేవతి నిశ్చితార్థానికి రెడీ అవుతుంది.

విద్యాదేవి: ఒకసారి అద్దంలో చూసుకో రేవతి. నా అలంకరణ నీకు నచ్చుతుందో లేదో..

రేవతి: చాలా బాగా రెడీ చేశారు టీచర్‌.

విద్యాదేవి: మరి అంత డల్‌ గా చెప్తావేంటి?

రేవతి: నా నిశ్చితార్థం జరుగుతుందో లేదో అని భయంగా ఉంది.

విద్యాదేవి: నీకా భయం అక్కర్లేదు. సీత చెప్పిందంటే కచ్చితంగా చేస్తుంది.

రేవతి: ఊరికే నిశ్చితార్థం జరగడం కాదు కదా టీచర్‌. మా అన్నయ్య వదినలు నిశ్చయ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవాలి.

విద్యాదేవి: నేను చెప్పింది కూడా అదే రేవతి..

అని టీచర్‌ ఎంత చెప్పినా రేవతి డల్‌ గానే ఉంటుంది. మీకున్న ధైర్యం నాకు లేదు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అంటుంది రేవతి. కానీ టీచర్‌ రేవతికి ధైర్యం ఇస్తుంది. తర్వాత హాల్‌లోకి అందరూ వస్తారు. అయితే తాము నిశ్చితార్థం కోసం రెడీ కాలేదని మహాలక్ష్మీ, జనార్దన్‌ చెప్తారు. ఇదేదో సస్పెన్స్‌ సినిమాలా ఉందని చలపతి అనడంతో నువ్వు సస్పెన్స్‌ సినిమానే చూస్తావు ఉండు అంటాడు జనార్ధన్‌. ఇంతలో పంతులు నిశ్చిర్థానికి అంతా రెడీ చేస్తుంటాడు. ఇంతలో కిరణ్‌ వస్తాడు. దీంతో మహాలక్ష్మీ కిరణ్‌ బంధువులు ఎక్కడ? కనీసం ఒక కుక్క కూడా తన వెంట రాలేదని అవమానిస్తుంది. ఒంటికొమ్ము సొంటిగాడిలా వచ్చాడు ఈ అనాథగాడికి నా చెల్లెలును ఇస్తానా? నెవర్‌ అంటాడు జనార్థన్‌. దీంతో కిరణ్‌ ఏడుస్తుంటాడు. గిరి, అర్చన వెటకారంగా మాట్లాడతారు. దీంతో కిరణ్‌ తరపున తాంబూలాలు తీసుకోవడానికి వాళ్లు వస్తున్నారు అని రామ్‌ చూపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: శంకర్‌ బలాన్ని పోలీసులకు చెప్పిన జెండే – కిడ్నాపర్ల ఆచూకి తెలుసుకున్న చిన్నొడు.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today November 21st: 'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
Nindu Manasulu Serial Today November 21st: నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
Podarillu Serial Today NoV 21:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు
పొదరిల్లు:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 21:రామలింగాన్ని ఇంటికి తీసుకొచ్చిన భరత్‌..పెళ్లికార్డు సెలక్ట్ చేయాలంటూ ఒత్తిడి
నువ్వులేక నేను లేను: రామలింగాన్ని ఇంటికి తీసుకొచ్చిన భరత్‌..పెళ్లికార్డు సెలక్ట్ చేయాలంటూ ఒత్తిడి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
IND VS NZ 1st Test Highlights: వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget